Chanakya Niti Money: మనిషిని నడిపించే డబ్బు. ఇప్పుడు ధనం మూలం ఇదం జగత్ అంటున్నారు. ధనమే అన్నింటికి మూలం. అదే ప్రభావాన్నిచూపుతుంది. బాగా సంపాదిస్తే గౌరవిస్తారు. సంపాదన లేకపోతే ఈసడిస్తారు. డబ్బున్న వాడిదే గౌరవం. దుడ్డున్న వాడిదే బర్రె అన్న చందంగా మారిపోయింది లోకం. ఏం చేసినా సరే డబ్బు సంపాదన మాత్రమే చూస్తారు. వాడు ఏం చేశాడన్నది చూడటం లేదు. కానీ ఇది కరెక్టు కాదు. ధర్మబద్ధంగా ఎంత సంపాదించినా ఏం కాదు. కానీ అక్రమంగా సంపాదించడం మంచిది కాదు. కానీ నేడు అవేమీ పట్టించుకోవడం లేదు. ఆచార్య చాణక్యుడు మాత్రం ధర్మంగా సంపాదించే డబ్బు అని చెబుతున్నాడు. అన్యాయాలు, అక్రమాలు చేసి సంపాదించింది డబ్బు కాదు.
డబ్బు లేకపోతే వేశ్య కూడా..
మన చేతిలో డబ్బు ఉంటే వేశ్య కూడా మనకు విలువ ఇస్తుంది. డబ్బు ఉన్నన్ని రోజులు మనతో చనువుగా ఉంటుంది. మన దగ్గర డబ్బు లేదని తెలిస్తే దూరం చేస్తుంది. డబ్బు మహా జబ్బు. మనక బతకడానికి డబ్బు కావాలి. కానీ డబ్బు సర్వస్వం కారాదు. కానీ లోకం తీరు మారుతోంది. పోకడ కొత్త పుంతలు తొక్కుతోంది. డబ్బుంటే సుబ్బిగాడిని కూడా సుబ్బరావు గారంటారు.
పండ్లు లేని చెట్టును..
పండ్లు లేని చెట్టును పక్షులు కూడా పట్టించుకోవు. ఏ చెట్టు అయితే విరివిగా కాస్తుందో ఆ చెట్టు మీదే పక్షులు ఉంటాయి. పండ్లు తింటూ ఆకలి తీర్చుకుంటాయి. కానీ కాయని చెట్టు దగ్గరకు పక్షులు వెళ్లవు. అలాగే ధనమున్న వాడి దగ్గరకు అందరు వెళతారు. డబ్బు లేని వాడి దగ్గరకు ఎవరు రారు. ఇది జీవితసత్యమని ఆచార్య చాణక్యుడు ఏనాడో చెప్పాడు.
గెలిచిన రాజునే..
యుద్ధంలో గెలిచిన రాజును గౌరవిస్తారు. ఓడిన వాడిని పట్టించుకోరు. ధనం కూడా అంతే. ఎవరి దగ్గర ఉంటే వారిని ఆకాశానికెత్తేస్తారు. ఎవరి దగ్గరైతే డబ్బు ఉండదో వారిని దూరం పెడతారు. డబ్బుంటేనే అన్ని ఉన్నట్లు లెక్క. అందుకే డబ్బుకు లోకం దాసోహం అంటారు. ఎవరి దగ్గరైతే డబ్బు ఉంటుందో వారినే అభిమానిస్తారు ఆదరిస్తారు. లేకపోతే వాడితో మాకు పనేంటనే ధోరణిలో ఉంటారు.