Tips For Happiness: భూమ్మీద ఉన్న ప్రతి వ్యక్తి ఆనందంగా ఉండాలని కోరుకుంటారు. అయితే ఆనందం మార్కెట్లోనూ.. లేక పక్కింట్లోనూ ప్రత్యేకంగా ఉండదు. ఆనందాన్ని మన మనసులో నుంచి బయటకు తీయాలి. మనసు ప్రశాంతంగా ఉంటే ఆనందంగా ఉన్నట్లే. మనసు ఆందోళనగా ఉంటే అక్కడ కష్టాలు ఎదురైనట్లే. అయితే తాము, తమ కుటుంబం సంతోషంగా ఉండాలని దేవుళ్లను ప్రార్థిస్తూ ఉంటారు. ఎక్కలేని కొండలు ఎక్కి ప్రత్యేక పూజలు చేస్తారు. ఎన్నో యాత్రలు చేస్తారు. కానీ ఆ దేవుడు ఎక్కడో లేడు మన మనసులోనే ఉన్నాడు అని.. అనుకోవాలి. అంతేకాకుండా సంతోషం ఉన్న ప్రతి చోట భగవంతుడు ఉంటారని విషయాన్ని గ్రహించాలి. అయితే ఆనందం కోసం ఏం చేయాలి? ఎలా ఉంటే భగవంతుడు కరుణిస్తాడు?
జీవితం బాగుండాలని.. డబ్బు బాగా సంపాదించాలని.. ఎలాంటి అనారోగ్యానికి గురికాకుండా ఉండాలని.. ప్రత్యేకమైన పూజలు చేస్తూ ఉంటారు. అయితే డబ్బు బాగా ఉన్నవారికి సంతోషం ఉండదన్న విషయం అందరికీ తెలిసిందే. అనారోగ్యానికి గురికాని వ్యక్తి ఉండరు అనే విషయం కూడా తెలుసు. అందువల్లే తమకు ఎలాంటి ఆటంకం రాకుండా ఉండాలని కోరుకుంటారు. భగవంతుడిని కోరుకునే వరకు సరే.. కానీ ఆనందంగా ఉండడానికి ఏం చేయాలి? అనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. చాలామంది ఆనందం కోసం ఏవేవో కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. కానీ మనసు ప్రశాంతంగా ఉంటే అంతకు మించిన ఆనందం ఉండదు అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి.
Also Read: Rohith Sharma : రోహిత్ ఎక్కడ ఉంటే.. అక్కడ చిరునవ్వుంటుంది.. వైరల్ వీడియో
సంతోషంగా ఉండడానికి ఏం చేయాలి? ముందుగా చుట్టూ ఉన్న వాతావరణాన్ని సరిచేసుకోవాలి. కొంతమంది తమకు దగ్గర ఉన్న బంధువులు లేదా స్నేహితులు ఎప్పుడూ నిరాశతో కలిగి ఉంటారు. ఏదైనా కార్యక్రమం మొదలుపెడితే అటు చెప్పి భయపెడుతూ ఉంటారు. అంతేకాకుండా బాధలు కష్టాలు చెప్పుకుంటూ ఉంటారు. ఇలాంటి వారి మధ్య నిత్యం ఉన్నట్లయితే ఎప్పటికీ ఆనందం దొరకదు. ఎప్పుడు నిరాశతోనే ఉండాల్సి వస్తుంది. అందువల్ల ఇలాంటి వారి మధ్య ఉండకుండా జాగ్రత్త పడాలి.
పుట్టగానే బంగారు చెంచా నోట్లో పెట్టుకుని ఉండేవారు చాలా తక్కువ మంది ఉంటారు. అయితే డబ్బు ఉంటేనే తమకు ఆనందం అని కొందరు అనుకుంటూ ఉంటారు. అవసరానికి మించి ఎంత ఎక్కువ డబ్బు ఉంటే అన్ని కష్టాలు ఉంటాయన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. అవసరం మేరకు డబ్బు సంపాదించడానికి దేవుడు అన్ని రకాలుగా ఆరోగ్యాన్ని ఇస్తే.. విలువైన ఆస్తిని ఇచ్చినట్లే. అలాంటప్పుడు శారీరకంగా లేదా మానసికంగా ఏదో ఒక పనిని గుర్తుంచుకొని దానిని నిర్వర్తిస్తూ ఉండాలి. అలా కాకుండా సోమరితనాన్ని ప్రదర్శిస్తూ.. ఊరికే డబ్బు రావాలంటే.. దేవుడు కూడా కరుణించడు. తమకు అవసరమైన డబ్బు కావడానికి తనకు నచ్చిన పని చేసుకుంటూ పోవడం వల్ల ఏదో ఒక రోజు దేవుడి దయ కూడా ఉంటుంది. అప్పుడు అనుకున్న దాని కంటే ఎక్కువగా సంతోషిస్తారు.
కొంతమంది డబ్బు లేనప్పుడు ఒక విధంగా ప్రవర్తిస్తారు. డబ్బు రాగానే వారి క్యారెక్టర్ మారిపోతూ ఉంటుంది. అంటే వారిలో అహంకారం పెరిగిపోతుంది. అహంకారం పెరగడం వల్ల డబ్బు ఎంత సంపాదించినా తృప్తి ఉండదు. అంతేకాకుండా సమాజంలో గుర్తింపు కోల్పోయి తీవ్రంగా నష్టపోతారు. అందువల్ల అహంకారాన్ని వీడి.. కలిసిమెలిసి ఉండడంవల్ల ఎంతో ఆనందంగా ఉండవచ్చు.