Snake Bite Survivor: మనకు దూరం నుంచి పామును చూస్తేనే భయం వేస్తుంది. ఇక అది దగ్గరికి వస్తుంటే పరుగులు పెట్టడం ఖాయం. అలాగే పాము కాటు వేస్తే అది చిమ్మె విషం కంటే భయమే ఎక్కువగా ఉంటుంది. ఈ భయంతోనే రక్తప్రసరణ ఎక్కువ ఆయి పాము విషం త్వరగా శరీరంలోకి వెళ్తుంది. అయితే పాము కాటు పై అవగాహన ఉన్నవారు ప్రాథమిక చికిత్స చేసి పాము విషం ఎక్కకుండా చేస్తారు. ఎంత చేసినా పాము విషం శరీరంలోకి వెళ్లి ప్రాణాలను తీసే అవకాశం ఉంటుంది. కానీ ఓ వ్యక్తికి మాత్రం ఎంత ఎక్కువ విషం ఉన్న పాములు కరిచినా ఏం కాదు. అతనికి ఇప్పటివరకు ఎన్నో వందల పాములు కరిచాయి. ఇంతకీ అతని రక్తంలో ఏముంది? ఆయన ఎవరు?
Also Read: పాము కరిచిన ఏం కాదు.. అంత పవర్ మొక్క ఇదీ.. వెంటనే తెచ్చేసుకోండి
పాము కాటు వల్ల ప్రపంచ వ్యాప్తంగా లక్షల మంది చనిపోతున్నారు. అనేక వేలమంది పాము కాటు వల్ల అవయవాలు పనిచేయకుండా పోతున్నాయి. కొన్ని పాములు కలవడం వల్ల కొందరు మంచానికే పరిమితమయ్యారు. ముఖ్యంగా పొలాల్లో, ప్రకృతిలో పనిచేసే వారికి పాము కాటు నుంచి ఎక్కువగా ప్రమాదం ఉంటుంది. అయితే వీరు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. కొన్ని విషపూరితమైన పాములు కరవడం వల్ల వారి ప్రాణాలకు ప్రమాదం ఉంటుంది. కానీ అమెరికాకు చెందిన Tim Friede అనే వ్యక్తికి ఏ పాము కరిచిన విషయం ఎక్కదు. ఈయనకు చిన్నప్పటినుంచి పాములు అంటే చాలా ఇష్టం. దీంతో పాము కరిచినా తనకు ఏమి కాకుండా ఉండడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాడు. సాధారణంగా పాము కరిచిన వారికి ఆ విషయం శరీరం అంతటా వ్యాపించకుండా యాంటీ వీనం ఇస్తూ ఉంటారు. కానీ టీం ఫ్రీడ్ యాంటీ వీణంగా మారడానికి ప్రయోగాలు చేశాడు. అలా 200 పాములతో కరిపించుకున్నాడు. ప్రతీసారి తనకు ఏమి కాకుండా ఉండడానికి తన రక్తాన్ని Anty Venom మారుస్తూ.. పాములతో కాటు వేయించుకున్నాడు. ఇలా మొత్తం తన శరీరంలో ఉన్న రక్తం ఆంటీ వీణంగా మారింది. అయితే ఒకసారి పాము కాటు వేస్తే ఇది పనిచేస్తుంది. కానీ ఓ సందర్భంలో తనకు ఓ కోబ్రా వెంట వెంటనే రెండుసార్లు కాటు వేసింది. దీంతో ఈ సమయంలో యాంటీ వీనం పనిచేయలేదు. ఈ సమయంలో అతడు కోమాల్లోకి వెళ్లాల్సి వచ్చింది. అదృష్టవశాత్తు తిరిగి అతను ప్రాణాలను దక్కించుకున్నాడు.
Also Read: వీధి కుక్కల చేతిలో బలి.. వాకింగ్ కు వెళ్లిన ఓ బిలియనీర్ విషాద కథ
అయితే టీం ఫ్రీడ్కే కేవలం తన శరీరంలోని రక్తాన్ని మాత్రమే యాంటీ వీనం గా మార్చుకోవడం కాకుండా సమాజంలోని అందరూ కూడా ఇలా తన రక్తాన్ని ఆంటీ వీణంగా మార్చుకుంటే ఎలాంటి పాము కాటు వేసినా సేఫ్ గా ఉండవచ్చని భావించాడు. ఈ విషయాన్ని కొందరు పరిశోధకులకు చెప్పడంతో ఇప్పుడు వారు ప్రయోగాలు చేయడం ప్రారంభించారు. త్వరలోనే ఇది అందుబాటులోకి వస్తే ఇక పాము కాటు నుంచి ఎలాంటి ప్రమాదం ఉండకపోవచ్చని కొందరు చర్చించుకుంటున్నారు.