Late Marriages: ఇటీవల కాలంలో వివాహాలు ఆలస్యంగా చేసుకుంటున్నారు. ఫలితంగా కెరీర్ పైనే దృష్టి సారించి సంసారాల గురించి పట్టించుకోవడం లేదు. ఫలితంగా జీవిత భాగస్వామకి ఇబ్బందులు తప్పడం లేదు. ఎన్నో కలలతో వచ్చిన జీవితభాగస్వామిని నిర్లక్ష్యం చేస్తూ జీవితంలో ఎదిగేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. కొందరైతే పడక గది సుఖాన్ని సైతం విస్మరిస్తున్నారు. భవిష్యత్ లో ఎదురయ్యే కష్టాలకు కుంగిపోతూ ఇప్పటి నుంచే నిత్యం బాధలతోనే జీవితం సాగిస్తున్నారు. అందరు కెరీర్ పై దృష్టి పెట్టి ముప్పై ఏళ్లు దాటాక వివాహాలు చేసుకుని ఇబ్బందులు కొని తెచ్చుకుంటున్నారు.

డబ్బు సంపాదనపైనే దృష్టి కేంద్రీకరించి వైవాహిక జీవితాన్ని నిర్లక్ష్యం చేస్తారు. దీంతో జీవిత భాగస్వామి గురించి పట్టించుకోవడం మానేస్తారు. ఇక అప్పటి నుంచే అనుమానాలు, అపార్థాలు చోటు చేసుకుంటాయి. ఒకరిపై ఒకరికి నమ్మకం పోతుంది. గొడవలు మొదలవుతాయి. విభేదాలు ముదిరితే విడాకుల వరకు వెళ్లడం సహజమే. కానీ వైవాహిక జీవితంలో ఎదురయ్యే ఆటుపోట్లను తట్టుకుని నిలవాల్సిందే. అందు కోసం భార్యాభర్తలు ఇద్దరిలో సమన్వయం ఉండేలా చూసుకుంటే మంచిది.
Also Read: Mamata Banerjee- Chandrababu: ఇదేంది.. అందర్నీ పిలిచి నిన్ను పిలవలేదా? చంద్రబాబుకు అవమానం
ఇద్దరి మధ్య ఆకర్షణ తగ్గిపోతుంది. దీంతో అనుమానాలకు బీజం పడుతుంది. సంసారంలో కలతలు చోటుచేసుకుంటాయి. వీటిని తట్టుకునే క్రమంలో ఇద్దరు సఖ్యతగా ఉండేందుకు ప్రయత్నించాలి. ఇద్దరి ఆలోచనలు ఒకే రకంగా ఉంటే ఇబ్బందులు తలెత్తవు. అందుకే వీలైనంత వరకు ఎలాంటి దాపరికాలు లేకుండా చూసుకోవడమే సురక్షితం. ఈ క్రమంలో భార్యాభర్తలు మనస్పర్ధలు లేకుండా మసలుకోవాలి. అప్పుడే సంసారం సాఫీగా సాగుతుంది.

జీవితంలో డబ్బు సంపాదించడమే ధ్యేయంగా ముందుకు పోవడం చేస్తారు. దీంతో జీవిత భాగస్వామిని ఏ రకంగా కూడా దూరం పెట్టడం సముచితం కాదు. ఓ వైపు డబ్బు సంపాదిస్తూనే మరో వైపు భార్యపై ప్రేమ చూపించాలి. అప్పుడే సంసారం మూడు ముద్దులు ఆరు కౌగిలింతలుగా సాగుతుందనడంలో అతిశయోక్తి లేదు. సంసారంలో మునిగాక అందరు తిప్పలు పడాల్సిందే. అందరు ఏదో ఒక సందర్భంలో గొడవలు పడాల్సిందే. కానీ నిత్యం అవే రిపీట్ అయితే కష్టమే.
Also Read: Excise Department Transfers: ఇవేం బదిలీలు?.. ఎక్సైజ్ శాఖలో సొమ్ము చేసుకుంటున్న అధికారులు