YCP MP Into Janasena Party: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ప్రస్తుతం చాలా ఆసక్తిగా కొనసాగుతున్న సంగతి మన అందరికి తెలిసిందే..అధికార వైసీపీ పార్టీ పై రోజు రోజుకి జనాల్లో తీవ్రమైన వ్యతిరేకత ఏర్పడుతున్న ఈ నేపథ్యం లో యాంటీ వోట్ బ్యాంకు ని ఈసారి ఎవరు తమవైపు తిప్పుకుంటారా అని టీడీపీ మరియు జనసేన పార్టీల వైపు రాజకీయ విశ్లేషకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు..2019 సార్వత్రిక ఎన్నికలలో టీడీపీ మరియు జనసేన పార్టీలకు జగన్ వేవ్ తాకిడికి ఘోరమైన ఫలితాలు చవిచూడాల్సి పరిస్థితి ఏర్పడిన సంగతి మన అందరికి తెలిసిందే..టీడీపీ పార్టీ కి 23 సీట్లు రాగా, జనసేన పార్టీ కి కేవలం ఒక్క సీటు మాత్రమే దక్కింది..ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా పోటీ చేసిన రెండు స్థానాల్లో ఓడిపోవడం పెద్ద షాక్ అని చెప్పొచ్చు..అయితే అలాంటి పరిస్థితిలో ఉన్న పార్టీ ని సమర్థవతంగా నిలబెట్టి నేడు జనాలకు ఒక ప్రత్యామ్న్యాయ శక్తిగా నిలబెట్టడం లో పవన్ కళ్యాణ్ నూటికి నూరు పాళ్ళు విజయం సాధించారు..దానికి ఉదాహరణే ఈ ఏడాది జరిగిన గ్రామా స్థాయి ఎన్నికల ఫలితాలు..ఈ ఎన్నికలలో జనసేన పార్టీ అందరి అంచనాలను తారుమారు చేస్తూ తన ఉనికిని చాటుకుంది.
ముఖ్యంగా గోదావరి జిల్లాలలో జనసేన పార్టీ ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్ష పార్టీ హోదాలో ఉంది అని చెప్పొచ్చు..ఈ ప్రాంతాలలో లోకల్ బాడీ ఎన్నికలలో జనసేన పార్టీ తన సత్తాను చాటుకుంది..దీనితో ఉభయ గోదావరి జిలాలలో ఉన్న టీడీపీ మరియు వైసీపీ పార్టీ ముఖ్య నేతలు ఇప్పుడు జనసేన పార్టీ వైపు మొగ్గు చూపుతున్నట్టు సమాచారం..2019 సార్వత్రిక ఎన్నికలలో నర్సాపురం MP స్థానం కి వైసీపీ పార్టీ నుండి రఘురామ కృష్ణ గారు పోటీ చేసి భారీ మెజారిటీ తో గెలుపొందిన సంగతి మన అందరికి తెలిసిందే..కానీ పార్టీ అధికారం లోకి వచ్చిన తర్వాత జగన్ పాలనపై తీవ్రమైన అసంతృప్తి తో ఉన్న రఘురామ కృష్ణ గారు వైసీపీ కి వ్యతిరేకంగా మొదటి నుండి మాట్లాడుతూనే ఉన్నారు..జగన్ అతని పైన కేసులు బనాయించి జైలు లో వేయించి పోలీసుల చేత బాగా కొట్టించిన సంగతి కూడా మన అందరికి తెలిసిన విషయమే..అయినా కూడా ఏ మాత్రం ఆత్మ విశ్వాసం కోల్పోకుండా వైసీపీ పార్టీ పైన ఆయన పోరాటం చేస్తూనే ఉన్నారు..ఇది ఇలా ఉండగా ప్రస్తుతం ఆయన పవన్ కళ్యాణ్ తో తరుచూ టచ్ లో ఉన్నట్టు తెలుస్తుంది..పవన్ కళ్యాణ్ ఆహ్వానిస్తే కచ్చితంగా జనసేన పార్టీ లో చేరుతాను అని..ఈ విషయం తనకి ఎలాంటి అభ్యన్తరం లేదని రఘురామ కృష్ణ గారు ఇటీవలే జనసేన పార్టీ నాయకులకు కూడా బహిరంగంగానే చెప్పినట్టు తెలుస్తుంది..ఒకవేళ రఘురామ కృష్ణ గారు జనసేన పార్టీలోకి వస్తే ఈసారి కూడా భారీ మెజారిటీ తో గెలుస్తాడని రాజకీయ వర్గాల్లో సాగుతున్న చర్చ..మరి ఆయనని జనసేన పార్టీలోకి పవన్ కళ్యాణ్ ఆహ్వానిస్తాడో లేదో చూడాలి.