Wife – Husband : భార్యభర్తల మధ్య దూరం పెరగడానికి కారణం ఇదే.. అయితే ఇలా చేస్తే ఒక్కటవుతారు..

దంపతుల మధ్య ప్రేమాభిమానాలు ఉన్నప్పుడే జీవితాంతం ఏ గొడవలు జరగకుండా కలిసి ఉంటారు. కానీ అన్ని సమయాల్లో ఇది సాధ్యం కాదు. ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చినప్పుడు ప్రేమతో కలిసి ఉండడానికి ప్రయత్నించాలి. ఈ విషయంలో పురుషులే కాస్త చొరవ తీసుకొని భార్యను దగ్గరికి తీసుకోవాలి. వారు ఎంత చికాకుగా ఉన్న పాత విషయాలను మరిచిపోయి వారితో ప్రేమగా ఉండే ప్రయత్నం చేయాలి.

Written By: Srinivas, Updated On : August 11, 2024 2:37 pm
Follow us on

Wife – Husband : పెళ్లంటే నూరేళ్ల పంట అని అంటారు. అంటే పెళ్లి చేసుకున్న జంట వందేళ్ల పాటు కలకాలం కలిసి ఉండాలని అంటారు. కానీ దంపతుల మధ్య అనేక మనస్పర్థలు, గొడవలు వస్తుంటాయి. ఒకప్పుడు భార్య కంటే భర్త వయసు ఎక్కువగా ఉండడం వల్ల ఇద్దరి మధ్య ఒకరికి మరొకరు ఎక్కువగా గౌరవం ఇచ్చుకునేవారు. కానీ నేడు ఇంచు మించు ఒకే వయసుతో ఉన్న వాళ్లు మ్యారేజ్ చేసుకుంటున్నారు. అయితే కొందరు మాత్రం ఒకరిపై ఒకరు ఆధిపత్యానికి పోయి గొడవలు పడుతున్నారు. దీంతో పెళ్లయిన ఏడాదికే విడిపోతున్నారు. దంపతుల మధ్య మనస్పర్థలు, గొడవలు తరుచూ వస్తుంటాయి. ఇలాంటి సమయంలో ఎవరో ఒకరు సర్దుకుంటే సమస్య పరిష్కారం అవుతుంది. అలా కానీ సమయంలో ఈ పని చేయాలి. అప్పుడు ఇద్దరి మధ్య ప్రేమ పెరిగిపోయి తిరిగి ఒక్కటవుతారు. అదేంటంటే?

దంపతుల మధ్య ప్రేమాభిమానాలు ఉన్నప్పుడే జీవితాంతం ఏ గొడవలు జరగకుండా కలిసి ఉంటారు. కానీ అన్ని సమయాల్లో ఇది సాధ్యం కాదు. ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చినప్పుడు ప్రేమతో కలిసి ఉండడానికి ప్రయత్నించాలి. ఈ విషయంలో పురుషులే కాస్త చొరవ తీసుకొని భార్యను దగ్గరికి తీసుకోవాలి. వారు ఎంత చికాకుగా ఉన్న పాత విషయాలను మరిచిపోయి వారితో ప్రేమగా ఉండే ప్రయత్నం చేయాలి. అయినా వారి కోపం తగ్గని సమయంలో ఒకడుగు ముందుకు వేసి హగ్ చేసుకోవడం లేదా ముద్దులు పెట్టడం లాంటివి చేయాలి. ముద్దులు పెట్టడం వల్ల ఇద్దరి మధ్య కెమిస్ట్రీ కుదిరి కోపం తగ్గే అవకాశం ఉంది.

ఎంతటి కోపిష్టినైనా చిన్నపాటి ప్రేమతో లొంగదీసుకోవచ్చని అంటారు. అలాగే భార్య ఎంత కోపంతో ఉన్నా.. వారిని ప్రేమతో ఆదరించి వివిధ యాంగిల్స్ లో ముద్దులు ఇవ్వడం వల్ల వారి మనసు కరిగే అవకాశం ఉంటుంది. ఒకవేళ వారు సైతం కోపాన్ని మరిచిపోయి భర్తతో కలిసి ఉండడానికి ప్రయత్నిస్తే పడకగదిలోకి తీసుకెళ్లాలి. ఇలా ఒక రోజు మొత్తం వారితో స్నేహంగా ఉంటూ వారికి కావాల్సిన సౌకర్యాలు అందిస్తే మరోసారి గొడవ పెట్టుకోవడానికి ప్రయత్నించరు. వీలైతే వారు చేసే పనులకు సాయం చేయడం వల్ల మరింత దగ్గరవుతారు. భర్త నుంచి భార్య ఆశించేది ప్రేమ ఒక్కటే. అది వారికి కావాల్సినప్పుడు ఇస్తే ఎలాంటి సమస్యలు ఉండవు. మరోసారి కోప్పడడానికి కూడా ఆలోచిస్తారు.

ప్రస్తుత రోజుల్లో ఉద్యోగాలు, వ్యాపారం కారణంగా పురుషులు బిజీగా ఉంటున్నారు. దీంతో ఇంటివారిని పట్టించుకోవడం లేదు. దీంతో ఇద్దరి మధ్య గ్యాప్ ఏర్పడడంతో మనస్పర్థలు ఏర్పడుతున్నాయి. ఫలితంగా చిన్న చిన్న విషయాలే పెద్ద గొడవగా మారుతున్నాయి. అందువల్ల వారంలో కనీసం రెండు రోజుల పాటు వారితో పడక పంచుకోవడం వల్ల ఇద్దరి మధ్య అన్యోన్యం పెరుగుతుంది. కేవలం పడక గదిలోనే కాకుండా సమయం దొరికిప్పుడల్లా వారితో ప్రేమగా ఉండడం వల్ల భర్తలను ఎప్పటికీ ప్రేమగా చూసుకుంటారు. ఇలాగే కాకుండా సమయం దొరికతే విహార యాత్రలకు తీసుకెళ్లాలి. ఉమ్మడి కుటుంబం అయితే వారితో ప్రైవసీగా ఉండడానికి బయటకు వెళ్లాలి. దీంతో భర్తపై వారికి నమ్మకం ఏర్పడుతుంది.