https://oktelugu.com/

 Health Tips : డైలీ ఈ ఫుడ్స్ తింటున్నారా.. అయితే తస్మాత్ జాగ్రత్త!

పోషకాలు మెండుగా ఉంటాయని కొందరు రోజూ కొన్ని రకాల ఆహార పదార్థాలను తింటుంటారు. అయితే వీటిని తినడం వల్ల అనారోగ్య బారిన పడతారని నిపుణులు చెబుతున్నారు. ఏదైనా ఆహారం మితంగానే తీసుకోవాలి. ఆరోగ్యానికి మంచిదని ఎక్కువగా తీసుకుంటే సమస్యలు తప్పవు. కాబట్టి డైలీ లైఫ్‌లో మితంగా తీసుకోవాల్సిన పదార్థాలేవో తెలుసుకుందాం.

Written By:
  • NARESH
  • , Updated On : August 12, 2024 / 12:01 AM IST
    Follow us on

    Health Tips :  ప్రస్తుతం సోషల్ మీడియా హవా నడుస్తోంది. ఏదైనా ఒక ఫుడ్ వైరల్ అయితే ఇక అందరూ అదే ఫుడ్ తింటుంటారు. పోషకాలు తక్కువగా ఉన్నా సరే ఆ ఆహార పదార్థాలను తింటున్నారు. పోషకాలు లేని ఆహారం తినడం వల్ల అనారోగ్య సమస్యలను కొనితెచ్చుకుని జీవితాన్ని ఆసుపత్రి పాలు చేసుకుంటున్నారు. ఏదైనా పదార్థం ఆరోగ్యానికి మంచిదా? కాదా? అని తెలుసుకోకుండా తినేస్తున్నారు. ఇలాంటి పదార్థాలను తినడం వల్ల శరీరానికి తగినంత పోషకాలు అందక సమస్యల బారిన పడతారు. పోషకాలు మెండుగా ఉంటాయని కొందరు రోజూ కొన్ని రకాల ఆహార పదార్థాలను తింటుంటారు. అయితే వీటిని తినడం వల్ల అనారోగ్య బారిన పడతారని నిపుణులు చెబుతున్నారు. ఏదైనా ఆహారం మితంగానే తీసుకోవాలి. ఆరోగ్యానికి మంచిదని ఎక్కువగా తీసుకుంటే సమస్యలు తప్పవు. కాబట్టి డైలీ లైఫ్‌లో మితంగా తీసుకోవాల్సిన పదార్థాలేవో తెలుసుకుందాం.

    నెయ్యి
    పోషకాలు మెండుగా ఉండే నెయ్యి ఆరోగ్యానికి చాలామంచిది. పరగడుపున రోజూ ఒక టేబుల్ స్పూన్ తినడం వల్ల శరీరానికి పోషకాలు అందుతాయి. కేవలం ఆరోగ్యంగా ఉండటంతో పాటు చర్మం, జట్టు కూడా ఆరోగ్యంగా ఉంటాయని భావిస్తుంటారు. అయితే రోజూ నెయ్యి తినడం ఆరోగ్యానికి అంతమంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. తక్కువగా తినడం వల్ల ఎలాంటి సమస్యలు ఉండవు. కానీ అధికంగా తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు తప్పవని నిపుణులు అంటున్నారు. కొందరు వేడి నెయ్యి వేసుకుని తింటే రుచిగా ఉంటుందని వేడి చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల అందులో హానికరమైన సమ్మేళనాలు ఏర్పడతాయి. కాబట్టి నెయ్యిని మితంగా మాత్రమే తీసుకోండి.

    బియ్యం
    సౌత్ ఇండియన్ ఫుడ్‌లో ఎక్కువగా రైస్ ఉంటుంది. మధుమేహం ఉన్నవాళ్లు రోజుకి ఒకపూట మాత్రమే రైస్ తినాలని వైద్యులు సూచిస్తుంటారు. అయితే వాళ్లు మాత్రమే కాకుండా మిగతావాళ్లు కూడా తక్కువగా తినాలి. రైస్‌కి బదులు రిచ్ ఫైబర్ ఉండే జొన్న రొట్టెలు, చపాతీలు, కొర్రలు వంటివి ఆహారంలో తీసుకుంటే బెటర్.

    ఊరగాయలు
    ఊరగాయలు, పచ్చళ్లు అంటే చాలామందికి ఒక ఎమోషన్. ఇందులో ప్రోబయోటిక్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వల్ల ఇవి ఆరోగ్యానికి మంచిదని కొందరు భావిస్తారు. కానీ ఈ ఊరగాయల్లో సోడియం ఎక్కువగా ఉంటుంది. అతిగా తింటే తప్పకుండా ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. కాబట్టి తక్కువగా తీసుకోవడమే ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు.

    కొబ్బరికాయలు
    కొబ్బరిలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇందులో పోషకాలు మెండుగా ఉండటంతో పాటు కేలరీలు కూడా ఎక్కువగా ఉంటాయి. కానీ ఎక్కువగా తీసుకోవడం అంతమంచిది కాదు. కొబ్బరి కొందరిలో తొందరగా జీర్ణం కాదు. కాబట్టి మితంగా మాత్రమే తీసుకోవాలి.