Sunrisers Hyderabad IPL 2022: ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ సీజన్ రసవత్తరంగా మారుతోంది. అంచనాలను తలకిందులు చేస్తూ ఓడిపోతుంది అనుకున్న జట్టు అప్రతిహతంగా విజయాలు సాధిస్తోంది. గెలుస్తుంది అనుకున్నా జట్టు దారుణంగా ఓడిపోతుంది. ప్రస్తుతం సన్రైజర్స్ కూడా ఇలాగే అంచనాలను తలకిందులు చేస్తూ వరుస విజయాలను నమోదు చేస్తోంది. ఇప్పుడు హ్యాట్రిక్ విజయాలతో ఫుల్ జోష్ మీద ఉంది. అయితే ఈ జట్టు హ్యాట్రిక్ విజయాలు వెనుక ఏదో బలమైన కారణం ఉంది.

జట్టు నుంచి ఓ ఇద్దరు ఆటగాళ్లను తీసుకోవడమే సన్ రైజర్స్ విజయాలకు పునాదిగా మారింది. ఇంతకీ ఆ ఇద్దరు ఎవరు కాదండోయ్.. సన్ రైజర్స్ భారీ ధరకు కొనుగోలు చేసిన అబ్దుల్ సమద్, రొమారియో షేఫర్ట్. అబ్దుల్ సమద్ ను రూ.4 కోట్లకు, రోమారియోను రూ.7.75 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే వీరిద్దరూ ఏ మాత్రం అంచనాలను అందుకోలేక పోయారు. అబ్దుల్ ఆడిన తొలి రెండు మ్యాచ్లలో బ్యాటింగ్ లో 4, 0 పరుగులు మాత్రమే చేసి దారుణంగా ఫెయిల్ అయ్యాడు. ఆల్రౌండర్ గా అదరగొడతా అనుకున్న షేఫర్ట్ బౌలింగ్ లో 1/33, 42/2 సమీకరణాలతో దారుణం దెబ్బతీశాడు.
Also Read: BJP vs KCR: బీజేపీపై మాటలకే పరిమితమా కేసీఆర్.. చంద్రబాబు, జగన్ ఎందుకీ మౌనదీక్ష..?
దీంతో వీరిద్దరినీ తర్వాత మ్యాచ్ లలో హైదరాబాద్ టీం తప్పించేసింది.ఇక వీరి మీద వేటు వేయడంతో పవర్ హిట్టర్ నికోలస్ పూరన్ బ్యాటింగ్ లో మార్పు వచ్చింది. అతను అద్భుతంగా రాణిస్తున్నాడు. దాంతో పాటు అటు కెప్టెన్ విలియమ్సన్ కూడా ఫామ్ అందుకున్నాడు. యువ ఓపెనర్ అభిషేక్ శర్మ కూడా ఆచితూచి అవసరం ఉన్నప్పుడల్లా మెరుగ్గా రాణిస్తున్నాడు.
దీంతో ఓపెనింగ్ సమస్య తొలగిపోయింది. ఇక మిడిల్ ఆర్డర్ లో మర్‌క్రమ్, త్రిపాఠి అద్భుతంగా రాణిస్తున్నారు. వీరిద్దరూ కలిసి చివరి మూడు మ్యాచ్ లలో ఎవరో ఒకరు చివరి వరకు ఉండి బాధ్యతతో మ్యాచ్ ఫినిష్ చేస్తున్నారు. దాంతో ఈ మూడు మ్యాచ్‌లు సన్ రైజర్స్ గెలిచింది. ఇక అటు బౌలింగ్ పరంగా కూడా మెరుగైన మార్పు కనిపిస్తోంది.

షెఫర్డ్ ప్లేస్ లో వచ్చిన మార్కో జాన్‌నెస్ అద్భుతంగా ఆడుతున్నాడు. ఈ లెఫ్ట్ హ్యాండ్ పేసర్‌కు తోడుగా నటరాజన్ కూడా కలవడంతో యార్కర్లతో బ్యాటర్లను ఇబ్బంది పెడుతున్నారు. అటు ఫాస్టెస్ట్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ కూడా పదునైన బంతులను విసురుతున్నాడు. ఇలా ఇద్దరిని తీసేయడంతో మిగతా వారిలో అద్భుతమైన మార్పు వచ్చి రైజర్స్ దూసుకుపోతోందన్నమాట.
Also Read:Internal Conflicts In YCP: కుదరని ముహూర్త బలం.. అన్ని జిల్లాల్లో వైసీపీలో విభేదాల పర్వం