Chiranjeevi Acharya Pre Release Event: మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన ఆచార్య సినిమా ఈ నెల 29 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల అవ్వబోతున్న సంగతి మన ఎందరికి తెలిసిందే..చిరంజీవి మరియు రామ్ చరణ్ కాంబినేషన్ లో కొరటాల శివ దర్శకత్వం లో తెరకెక్కిన సినిమా కావడం తో మెగా అభిమానుల్లో ఈ సినిమా పై అంచనాలు భారీ గా ఉన్నాయి..ఆ అంచనాలకు తగ్గట్టు గానే ఇటీవల విడుదల చేసిన ఈ సినిమా ట్రైలర్ అద్భుతమైన రెస్పాన్స్ ని అందుకుంది..ఈ సినిమాలో చిరంజీవి మరియు రామ్ చరణ్ కలిసి ఒక్క మాస్ సాంగ్ కి డాన్స్ వేసిన సంగతి మన అందరికి తెలిసిందే..తండ్రి కొడుకులు ఇద్దరినీ ఒక్కే సాంగ్ లో డాన్స్ చెయ్యడం చూసే అభిమానులకు థియేటర్ లో అద్భుతమైన ఫీలింగ్ వస్తుంది అని ఆ చిత్ర దర్శకుడు కొరటాల శివ అంటున్నాడు..ఈ పాట ఈనెల 20 వ తారీఖున యూట్యూబ్ లో అందుబాటులోకి రానుంది.. గతం లో రామ్ చరణ్ మరియు చిరంజీవి కలిసి అమ్ముడు లెట్స్ డూ కుమ్ముడు అనే సాంగ్ లో ఒక్క చిన్న బిట్ కి డాన్స్ వేసిన సంగతి మన అందరికి తెలిసిందే..ఈ చిన్న బిట్ కి అప్పట్లో అభిమానులు థియేటర్స్ లో పూనకాలు వచ్చి ఊగిపోయారు..ఇప్పుడు ఏకంగా ఇద్దరు కలిసి వెండితెర మీద 45 నిమిషాల పాటు కనిపించబోతుండడం తో ఎలా ఉండబోతుందో అని అభిమానులు ఉత్కంఠ తో ఎదురు చూస్తున్నారు.

ఇది ఇలా ఉండగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ గురించి నిన్న మెగా మెగా అభిమానుల్లో కాస్త గందరగోళం జరిగిన సంగతి మన అందరికి తెలిసిందే..ఎందుకంటే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ గారు వస్తున్నారు అంటూ ప్రచారం సాగడం తో పవన్ కళ్యాణ్ అభిమానులు చిరంజీవి పై విరుచుకుపడ్డారు..సొంత తమ్ముడు పవన్ కళ్యాణ్ సినిమాలను అన్ని విధాలుగా ఇబ్బంది పెట్టిన మనిషిని ఎలా పిలుస్తావు అంటూ సోషల్ మీడియా లో చిరంజీవి ని టాగ్ చేస్తూ రచ్చ రచ్చ చేసేసారు.
Also Read: Suma: పండుగ పూట కూడా పాత మొగుడేనా.. ఆ షోలో సుమ రెచ్చిపోయిందిగా?
తమ అభిమాన హీరో ని తిడుతున్నందుకు చిరంజీవి ఫాన్స్ కూడా పవన్ కళ్యాణ్ అభిమానులతో వాగ్వాదానికి దిగి నిన్న కాసేపు సోషల్ మీడియా వాతావరణం కాస్త వేడెక్కింది..కానీ ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదు అని వైసీపీ పార్టీ స్పోక్స్ పర్సన్ అధికారికంగా తెలియచేయడం తో ఒక్కసారిగా అందరూ చల్లబడ్డారు..అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి తాజా సమాచారం ప్రకారం ఈ నెల 23 వ తారీఖున హైదరాబాద్ లోని యూసఫ్ గూడా పెరేడ్ గ్రౌండ్స్ లో ఘనంగా నిర్వహించనున్నారు అట…ఈ ఈవెంట్ కి ముఖ్య అతిధులుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు SS రాజమౌళి హాజరు కాబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి..దీనికి సమ్బడినించిన అధికారిక ప్రకటన బయటకి వెలువడాల్సి ఉంది.

ఇక ఈ సినిమా లో ముఖ్య పాత్ర పోషించిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చే అవకాశాలు తక్కువ ఉన్నాయి అని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న ఒక్క వార్త..ఎందుకంటే ప్రస్తుతం ఆయన శంకర్ గారి దర్శకత్వం లో ఒక్క సినిమా చేస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే..ప్రముఖ నిర్మాత దిల్ రాజు 50 వ చిత్రం గా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం అమ్రిత్ సర్ లో గత వారం రోజుల నుండి జరుగుతుంది…ప్రస్తుతం ఆ షూటింగ్ లోనే ఆయన బిజీ గా ఉండడం తో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరు అయ్యే అవకాశాలు చాలా తక్కువ గా ఉన్నాయి అట..చూడాలి మరి ఈ ఈవెంట్ కి చివరి నిమిషం లో అయినా రామ్ చరణ్ వస్తాడో రాదో అనేది..ఎంతో భారీగా జరగనున్న ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
[…] TSRTC MD Sajjanar: ఐపీఎస్ అధికారి, వీసీ సజ్జనార్ గురించి తెలంగాణ ప్రజలకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మామూలుగా పోలీసుల పేర్లు అన్ని ప్రాంతాల ప్రజలకు పెద్దగా తెలియదు. కానీ ఈయన పేరు మాత్రం ఈ ప్రాంతం ఆ ప్రాంతం అని తేడా లేకుండా తెలంగాణలోని అన్ని జిల్లాల వారికి సుపరిచితమే. ఎందుకంటే ఆయన ఏ శాఖలో ఉన్నా సరే తన ప్రత్యేకతను చాటుకున్నారు. డ్యూటీని నిబద్ధతతో చేయడం అంటే ఆయన దగ్గర నుంచే నేర్చుకోవాలి. ఎందుకంటే ఆయన ఈ శాఖలో ఉన్న సరే దానికి గుర్తింపు తీసుకు వచ్చే విధంగా అహర్నిశలు కష్టపడుతుంటారు. […]
[…] Prabhas: దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన #RRR చిత్రం ఇటీవలే విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన సంగతి మన అందరికి తెలిసిందే..బాక్స్ ఆఫీస్ పరంగా ఈ సినిమా ఎన్ని అద్భుతాలు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..ప్రతిష్టాత్మక వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ మార్కుని అందుకొని బాహుబలి మరియు దంగల్ వంటి సినిమాల తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన ఆల్ టైం టాప్ 3 ఇండియన్ సినిమా గా సరికొత్త చరిత్ర సృష్టించింది..ఇక ఈ సినిమాలో హీరోలుగా నటించిన ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ కి ఎలాంటి పేరు ప్రఖ్యాతలు వచ్చాయో తెలిసిందే..వీళ్లిద్దరి నటనని దేశ వ్యాప్తంగా మెచ్చుకోని వాడు అంటూ ఎవ్వడు మిగలలేదు అంటే ఏ మాత్రం అతిశయోక్తి కాదు..క్రిటిక్స్ నుండి సెలబ్రిటీస్ వరుకు వీళ్లిద్దరి నటన పై ప్రశంసల వర్షం కురిపించారు..ఇక ఇటీవలే ఈ సినిమాని యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రత్యేకమైన స్క్రీనింగ్ ద్వారా ఈ సినిమా ని వీక్షించారు..సినిమా చూసిన తర్వాత ఆయన మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. […]