BJP vs KCR: బీజేపీపై రెండు తెలుగు రాష్ట్రాల్లో భిన్నమైన వాతావరణం ఉంది. కేసీఆర్ విషయానికి వస్తే ఆయన ఈ మధ్య కేంద్రంపై ఒంటికాలిపై లేస్తున్నారు. కేంద్ర తీసుకునే ప్రతి నిర్ణయంపై స్పందిస్తూ తీవ్రమైన విమర్శలు గుప్పిస్తున్నారు. నేరుగా ప్రధాని నరేంద్ర మోడీని, బీజేపీని టార్గెట్ చేస్తూ.. దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్నారు. అదే సమయంలో ఏపీలో టీడీపీ, వైసీపీ పార్టీలు మాత్రం కేంద్ర వైఖరి పట్ల సైలెంట్ గానే ఉంటున్నాయి.

కాగా మొన్న బీజేపీకి వ్యతిరేకంగా దాదాపు 13 పార్టీలు కలిసి సంయుక్తంగా ఓ ప్రకటన చేశాయి. ఇందుకు కాంగ్రెస్ నేతృత్వం వహించింది. దేశాన్ని విడగొడుతున్న బీజేపీని వ్యతిరేకిస్తూ ఈ సంయుక్త ప్రకటనపై సంతకం చేసేందుకు చాలా పార్టీలు వెనకడుగు వేశాయి. ఎన్సీపీ, శివసేన, ఎస్పీ లాంటి పార్టీలు దూరంగా ఉన్నాయి. ఇక టీఆర్ ఎస్‌కూడా ఇందుకు వెనకడుగు వేసింది.
Also Read: Acharya Pre Release Event: జగన్‌ను చిరు అందుకే పిలిచారా.. జనసైనికుల్లారా ఇది మీ కోసమే..!
ఇదే ఇక్కడ హాట్ టాపిక్ గా మారిపోయింది. బీజేపీ అంటేనే ప్రతి విషయంలో వ్యతిరేకించే కేసీఆర్.. ఈ విషయంలో ఎందుకు సైలెంట్ గా ఉన్నారు. పోనీ కాంగ్రెస్ తో పడదు కాబట్టి దూరంగా ఉన్నారా అంటే.. ఇందులో ఇంకా చాలా పార్టీలు ఉన్నాయి కదా. మిగతా పార్టీల్లాగే దేశం కోసం పోరాడుతన్నామనే సంకేతాలు ఇవ్వొచ్చు కదా.
అంటే పైకి చెబుతున్న మాటలన్నీ కేవలం ఉత్తవేనా..? ఇలాంటి పెద్ద పనుల్లో ఎందుకు భాగస్వామి కారు అనే ప్రశ్నలు తెరమీదకు వస్తున్నాయి. ఇక అటు ఏపీలోని టీడీపీ, వైసీపీ పరిస్థితి అయితే మరీ దారుణం. కనీసం బీజేపీకి ఎదురు మాట్లాడలేని పరిస్థితి ఆ పార్టీలది. టీడీపీ ఏమో దోస్తీ కోసం బీజేపీని వ్యతిరేకించట్లేదు. జగన్ తన కేసుల విషయం వల్ల మౌనదీక్ష పట్టారు.

ఇలా రెండు తెలుగు రాష్ట్రాల్లోని పార్టీలు కేవలం స్టేట్ మెంట్లు ఇవ్వడం వరకే పరిమితం అవుతున్నాయి. మరీ ముఖ్యంగా కేసీఆర్ ఈ విషయంలో ఎందుకు వెనకడుగు వేశారనే ప్రశ్నలు వస్తున్నాయి. పైగా బీజేపీకి వ్యతిరేకంగా ఆయన కలుపుకుని పోయిన ఎన్సీపీ, శివసేనలు కూడా బీజేపీని వ్యతిరేకించలేదు. అంటే ఇన్ని రోజులు వీరు చెప్పిందంతా కేవలం మాటలకే పరిమితమా అనే అనుమానాలు కలుగుతున్నాయి. మరి కాంగ్రెస్ తో వద్దని ఒంటరిగా పోరాడుతారా అని ప్రశ్నలు వస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. చూడాలి మరి కేసీఆర్ ఏ మేరకు తన ప్రభావం చూపిస్తారో.
Also Read:Internal Conflicts In YCP: కుదరని ముహూర్త బలం.. అన్ని జిల్లాల్లో వైసీపీలో విభేదాల పర్వం
[…] CM Jagan: జగన్ ఎప్పుడైతే కొత్త కేబినెట్‌కు శ్రీకారం చుట్టారో.. అప్పటి నుంచే ఇటు పార్టీలో కూడా సమూలమైన మార్పులుచేపడుతున్నారు. ఇక 14మంది మంత్రి పదవులు తీసేసిన జగన్ వారిని పార్టీ పనుల్లో వాడుకుంటామని గతంలోనే ప్రకటించారు. ఈ సారి ప్రాంతీయ, కుల సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని.. ఏయే ప్రాంతంలో ఏయే వర్గం వారు అధికంగా ఉన్నారో లెక్కలేసుకుని.. ఆ వర్గం నేతకే ఆ ప్రాంతంలో పార్టీ పగ్గాలను ఇవ్వనున్నారు. […]
[…] Bandi sanjay- Aravind: మనకు బీజేపీ అనగానే మొన్నటిదాకా ఓ ఇద్దరు నేతలు ముఖ్యంగా కనిపించేవారు. ఏ ప్రెస్ మీట్ అయినా ప్రతిపక్షాలను ఓరేంజ్ లో తిట్టేసి యూత్లో ఫాలోయింగ్ తెచ్చుకున్నది ఆ ఇద్దరు నేతలే. పైగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కోసం ఆ ఇద్దరూ గట్టిగా పోటీ పడ్డారు. ఇంతకీ వారెవరో కాదండోయ్.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్. ఇద్దరూ 2019 ఎంపీ ఎన్నికల సమయంలో అనూహ్యంగా సంచలన విజయం సాధించి రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు రేపారు. […]