Girls Education: ఆచరించి చెప్పేవాడే ఆచార్యుడు అన్నారు మహాత్మాగాంధీ. ఆ వధువు ఆలోచన కూడా అలాగే ఉంది. అమ్మాయిలు తమ కుటుంబం బాగుండాలని వారి సంసారమే సాఫీగా ఉండాలని కలలు కనే వారుండే ఈ రోజుల్లో అనాథ బాలికల కోసం తను కట్టుకోబోయే భర్తకు షరతు విధించి తనలో కూడా మానవత్వం మిగిలే ఉందని తెలుస్తోంది. జీవితంలో ఎదిగేందుకు డబ్బు అవసరం ఈ రోజులలో కామన్ అయిపోయింది. మనం ఎలా సంపాదించమన్నది కాదు ఎంత సంపాదించమన్నదే ముఖ్యం. కానీ ఆ అమ్మాయి మాత్రం భావి భారత బాలికల కోసం తన సుఖాన్ని త్యాగం చేసి అందరి మన్ననలు పొందుతోంది.

హర్యానాలో ఆడవారికి వరకట్నం ఇచ్చే సంప్రదాయం అమల్లో ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడ నివసించే ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడి కూతురు పూనమ్. ఆమెకు పెళ్లి వయసు వచ్చింది. ఓ అబ్బాయిని చూసి వివాహం చేయాలని నిర్ణయించారు. అయితే పెళ్లికి ముందే ఆమె వరుడికి ఓ షరతు పెట్టింది. పెళ్లికి ముందే వధువుకు కట్నం కింద బంగారం, నగదు ముట్టజెప్పుతారు. కానీ ఆమె తనకు ఏ నగదు, బంగారం అవసరం లేదని చెప్పింది.

అనాథలైన బాలికలు 11 మంది చదువు కోసం ఆ డబ్బు బ్యాంకులో డిపాజిట్ చేసి దానికి వచ్చే వడ్డీతో వారి విద్యాభ్యాసం పూర్తయ్యే లా చర్యలు తీసుకోవాలని సూచించింది. దీనికి వరుడు కూడా సరేనని చెప్పడంతో అందరిలో ఆనందం వెల్లివిరిసింది. తన స్వార్థం కోసం కాకుండా పదిమంది అభాగ్యుల కోసం ఆలోచించిన పూనమ్ ఆలోచనను అందరు ప్రశంసించారు.
Also Read: కేసీఆర్ కొత్త పార్టీపై సర్వేలు..! ప్రజలేమనుకుంటున్నారు..?
బాలికలు చదువు లేకపోవడంతోనే జీవితంలో ఎదగలేకపోతున్నారని పూనమ్ గుర్తించింది. ఆమె ఆలోచనలు ఆచరణలో పెట్టడానికి ఎంతో ఆలోచించింది. దీంతోనే బాలికల కోసం తన స్వార్థం చూసుకోకుండా వారి అభ్యుదయం కోసం ఇంత భారీ నిర్ణయం తీసుకోవడం సముచితమే. తన సంసారం ఎదగాలని తనకు డబ్బు కావాలని భావిస్తున్న నేటి కాలంలో బాలికల బాగోగుల గురించి పట్టించుకోవడం ఆహ్వానించదగినదే. పూనమ్ చర్యతో ఇరు కుటుంబాల్లో ఆనందాలు వెల్లివిరుస్తున్నాయి.
సొంత లాభం కొంత మానుకుని ఇతరుల కోసం ఆలోచించే వారిలోనే నిజమైన దైవత్వం దాగి ఉంటుంది. తన స్వార్థమే పరమార్థంగా భావించే ప్రస్తుతం కాలంలో ఇలా పరాయి వారి కోసం పూనమ్ నిర్ణయం తీసుకోవడం నిజంగా మంచి భావనగానే గుర్తించవచ్చు. అందరు ఇలా ఆలోచిస్తే బాలికల చదవుకు ఆటంకాలు ఎదురు కావనే అభిప్రాయం అందరిలో వస్తోంది.
Also Read: కేసీఆర్ తో యుద్ధానికి బీజేపీ సిద్ధం..రె‘ఢీ’