
Suryakumar Yadav: ఇండియన్ క్రికెట్ లో ముఖ్యంగా టి20 ఫార్మాట్లో అత్యంత ప్రతిభ కలిగిన క్రికెటర్ సూర్య కుమార్ యాదవ్. స్టేడియం నలుమూలల తనదైన షాట్లతో విరుచుకుపడే సూర్య కుమార్ యాదవ్ అంటే ప్రత్యర్థి బౌలర్లకు హడల్. వరల్డ్ నెంబర్ 1 టి20 ప్లేయర్ గా కొనసాగుతున్న సూర్య కుమార్ యాదవ్ కొద్ది రోజులుగా ఫామ్ లో లేక తడబడుతున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఘోరంగా విఫలమవుతుండగా, అంతకు ముందు జరిగిన ఆస్ట్రేలియా తో జరిగిన వన్డే సిరీస్ లోనూ దారుణంగా విఫలమై నిరాశపరిచాడు. చివరి ఆరు ఇన్నింగ్స్ లో నాలుగు గోల్డెన్ డకౌట్ కావడం గమనార్హం.
సూర్య కుమార్ యాదవ్ క్రీజులో ఉన్నాడంటే.. లక్ష్యం ఎంత పెద్దది అయినా చిన్న బోవాల్సిందే. స్టేడియం నలుమూలల అలవోకగా సిక్సులు, ఫోర్లు బాదేయగల సమర్థత సూర్య కుమార్ యాదవ్ సొంతం. తుఫాన్ ఇన్నింగ్స్ లు ఆడి అనేక మ్యాచ్ ల్లో ఇండియా జట్టును గెలిపించిన ఘనత సూర్య కుమార్ ది. అటువంటి సూర్య కుమార్ యాదవ్ ప్రస్తుతం జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ ఎడిషన్ లో ఘోరంగా విఫలమవుతున్నాడు. ఒక్క మ్యాచ్ అంటే ఒక్క మ్యాచ్ లో కూడా తనదైన స్థాయిలో ఆడ లేకపోతున్నాడు. కనీస స్కోర్ చేసేందుకు నానా అగచాట్లు పడుతున్నాడు. ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతున్న ఈ క్రికెటర్ గడిచిన మూడు ఇన్నింగ్స్ లో దారుణంగా విఫలమయ్యాడు.
ఆరు ఇన్నింగ్స్ లో నాలుగు గోల్డెన్ డకౌట్లు..
ముంబై ఇండియన్స్ తరఫున సూర్య కుమార్ ఆడిన చివరి మూడు, అంతక ముందు ఇండియా జట్టుకు ఆడిన మరో మూడు ఇన్నింగ్స్ లో కలిపి నాలుగుసార్లు గోల్డెన్ డకౌట్లు కావడం గమనార్హం. ఆడిన తొలి బంతికే బౌలర్లకు వికెట్లు సమర్పించుకొని పెవిలియన్ బాట పట్టాడు. ఒక మ్యాచ్ లో 16 బంతుల్లో 15 పరుగులు చేయగా, మరో మ్యాచ్ లో రెండు బంతుల్లో ఒక పరుగు చేసి అవుట్ అయ్యాడు.

దారుణమైన ఆటతీరుతో నిరాశ పరుస్తున్న సూర్య..
గతంలో ఎన్నడూ లేనివిధంగా సూర్యకుమార్ కొద్ది రోజులు నుంచి దారుణంగా విఫలమవుతున్నాడు. ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ మొదటి మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్ చాలెంజర్స్ తో ముంబై జట్టు ఆడింది. ఈ మ్యాచ్ లో సూర్య కుమార్ యాదవ్ 16 బంతులాడి 15 పరుగులు మాత్రమే చేశాడు. చెన్నై తో జరిగిన మరో మ్యాచ్ లో రెండు బంతులాడి ఒకే ఒక పరుగు చేసి అవుట్ అయ్యాడు. ఢిల్లీ క్యాపిటల్ తో జరిగిన మరో మ్యాచ్ లో గోల్డెన్ డేకౌట్ అయ్యాడు. అంతకుముందు ఆస్ట్రేలియా తో జరిగిన మూడు వన్డేల్లోనూ ఆడిన తొలి బంతికే అవుట్ అయి.. గోల్డెన్ డకౌట్ గా వెనుదిరిగి అభిమానులను తీవ్ర నిరాశపరిచాడు. మళ్లీ సూర్యకుమార్ యాదవ్ ఫామ్ ఎప్పుడు అందుకుంటాడో అని ఆశగా అభిమానులు ఎదురుచూస్తున్నారు.