AP Caste Politics: కుల రాజకీయాలతో ఏపీకి నష్టం

AP Caste Politics: ఇప్పడు అక్కడా.. ఇక్కడా అన్న తేడా లేకుండా ప్రతీచోట కుల రాజకీయాలే దర్శనమిస్తున్నాయి. ప్రజలను కులాలుగా విభజించి.. కులాల కుంపట్టు రగిల్చి రాజకీయ పొందుతున్నపార్టీలే అధికం. ప్రాంతీయ పార్టీల ఏర్పాటు వెనుక కూడా కులవాదం అధికంగా కనిపిస్తోంది. కుల రాజ‌కీయాల‌నేవి ప్రాంతీయ పార్టీల ఏర్పాటుతో మొగ్గ తొడిగాయ‌ని చెప్ప‌వ‌చ్చు. జాతీయ పార్టీల్లో ఈ భావ‌న ఉండ‌దు. ప్రాంతీయ పార్టీలు స్థానిక ప‌రిస్థితుల‌కు అనుగుణంగా ఆవిర్భవించినప్పటికీ వాటి మ‌నుగ‌డ‌కు మాత్రం కుల‌మే ఆలంబ‌న‌గా నిలుస్తోంది. […]

Written By: Dharma, Updated On : April 13, 2023 12:47 pm
Follow us on

AP Caste Politics

AP Caste Politics: ఇప్పడు అక్కడా.. ఇక్కడా అన్న తేడా లేకుండా ప్రతీచోట కుల రాజకీయాలే దర్శనమిస్తున్నాయి. ప్రజలను కులాలుగా విభజించి.. కులాల కుంపట్టు రగిల్చి రాజకీయ పొందుతున్నపార్టీలే అధికం. ప్రాంతీయ పార్టీల ఏర్పాటు వెనుక కూడా కులవాదం అధికంగా కనిపిస్తోంది. కుల రాజ‌కీయాల‌నేవి ప్రాంతీయ పార్టీల ఏర్పాటుతో మొగ్గ తొడిగాయ‌ని చెప్ప‌వ‌చ్చు. జాతీయ పార్టీల్లో ఈ భావ‌న ఉండ‌దు. ప్రాంతీయ పార్టీలు స్థానిక ప‌రిస్థితుల‌కు అనుగుణంగా ఆవిర్భవించినప్పటికీ వాటి మ‌నుగ‌డ‌కు మాత్రం కుల‌మే ఆలంబ‌న‌గా నిలుస్తోంది. ద‌శాబ్దాల క్రిత‌మే తెలుగు రాజ‌కీయాల్లో కుల‌మ‌నే మొక్క చిగురించింది. ఎన్నిక‌ల్లో టికెట్ కేటాయించాలంటే కులం ప్ర‌ధాన పాత్ర పోషిస్తోంది. జాతీయ పార్టీలకు కులం అనేది ప్రాధాన్యత కాకపోయినా.. రాష్ట్రాలను యూనిట్ గా తీసుకుంటే మాత్రం అక్కడ ప్రాబల్యమున్న కులాలకే ప్రాధాన్యమిస్తున్నాయి.

కర్నాటకలో వర్కవుట్..
ఇప్పుడు కర్నాటక ఎన్నికల విషయానికే వద్దాం.అక్కడ మెజార్టీ సామాజికవర్గం లింగాయత్ లు. ఆ కులం ఎటు మొగ్గుచూపితే వారితే అధికారం. దశాబ్దాలుగా అక్కడ సామాజికవర్గం ప్రభావం చూపుతోంది. అందుకే రాజకీయ పక్షాలు గుర్తెరిగి ఆ సామాజికవర్గానికి పెద్దపీట వేస్తున్నాయి. ఆ వర్గ నాయకులను ముందుపెట్టి అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తున్నాయి. మొత్తం 224 నియోజకవర్గాలు ఉన్న కర్నాటకలో దాదాపు 100 నియోజకవర్గాల్లో లింగాయత్ ల ప్రభావం అధికం. రాష్ట్ర జనాభాలో వీరు 17 శాతం ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. అందుకే అన్ని రాజకీయ పక్షాలు లింగాయత్ లకు ప్రాధాన్యం ఇస్తూ వచ్చాయి. ఇప్పటివరకూ కర్నాటక రాష్ట్రానికి 23 మంది సీఎంలు పనిచేశారు. అందులో పది మంది లింగాయత్ వర్గానికే చెందిన వారు కావడం విశేషం.

ఆరాటమే తప్ప.. ప్రయోజనమేదీ?
ఏపీలో కులాల లెక్కల అధికం. ఇక్కడ జరిగిన కుల రాజకీయాలు దేశంలో మరెక్కడా జరగవు. అయితే కులాల ఆరాటమే తప్ప ఎక్కువ జనాభా ఉన్న కులాలకు మాత్రం ఒనగూరే ప్రయోజనం లేకుండా పోతోంది. ఏపీసమాజంలో అధికంగా ఉండే కులాలతో ఒకటి, రెండు శాతం కులాలు ఆడుతున్న వికృత రాజకీయ క్రీడ అది. కానీ దానిని గుర్తించని ప్రజలు రాజకీయ క్రీడలో సమిధులుగా మారుతున్నారు. ఇప్పుడు వెనుకబడిన వర్గాల వారిదీ అదే పరిస్థితి. రాజకీయ పార్టీల తలరాతలు మార్చే శక్తి ఉన్న బీసీలను ఓటు బ్యాంక్ గా మార్చుకోవడానికి పరితపించే క్రీడలో పార్టీలు ఆరితేరుతున్నాయి. అయితే ఏపీ సమాజంలో మరో వికృత క్రీడకు తెరతీస్తున్నారు. ఏపీ స‌మాజంలో జ‌రుగుతున్న ప్ర‌తి సంఘ‌ట‌న‌కు కులం రంగు పులుముకుంటోంది. ఎవరికి వారికి వారి వారి కులాల‌పై అభిమానముండ‌టాన్ని తప్పు ప‌ట్ట‌లేం. కానీ అది శ్రుతిమించి దుర‌భిమానంగా మారుతోంది. త‌ద్వారా విద్వేషాగ్నులు ర‌గులుతున్నాయి.

AP Caste Politics

వీడిపోయిన ఓట్లు పడట్లే…
ఏపీలో ఇప్పటికే కులాలు రాజకీయ పార్టీలు వారీగా విడిపోయాయి. రెడ్లు అంటే వైసీపీ, కమ్మలు అంటే టీడీపీ, కాపులంటే జనసేన అని విడిపోయారు. కానీ ఎవరి కులం ఓట్లు వారు పోలరైజ్ చేసుకోగలరా? అంటే సరైన సమాధానం చెప్పలేం. అదే జరిగి ఉంటే గత ఎన్నికల్లో పవన్ కు కాపులు ఓట్లే వన్ సైడ్ గా ఉండే 38 నియోజకవర్గాల్లో గెలుపు సునాయాసమయ్యేది కదా. కానీ అలా జరగలేదు. అందుకే పవన్ కల్యాణ్ ప్రజలందరికీ తనను ఒక కులానికి పరిమితం చేయవద్దని పదే పదే కోరుకుంటున్నారు. తాను ఏ ఒక్క కులానికో ప్రతినిధిని కానని, సమసమాజ స్థాపన కోసమే రాజకీయాల్లోకి వచ్చానని ప్రతి సమావేశంలో చెబుతున్నారు. అయినప్పటికీ ఆయన్ను ఒక సామాజికవర్గానికే ప్రతినిధిగా చూడటమనేది ఎంతో సిగ్గుచేటని సామాజికవేత్తలు విశ్లేషిస్తున్నారు. కుల రాజకీయాలో నష్టపోతున్నది రాష్ట్రం తప్ప.. నేతలు కాదని అభిప్రాయపడుతున్నారు.