Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్ పేరు చెబితే అందరికి వణుకే. తన బ్యాట్ తో విన్యాసాలు చేస్తున్నాడు. ప్రత్యర్థి ఎవరైనా ప్రతీకారమే లక్ష్యంగా చెలరేగిపోతున్నాడు. ప్రతి బంతిని అయితే బౌండరీ లేదంటే సిక్సుగా మలచడంలో అతడిది అందెవేసిన చేయి. దీంతో జట్టులో అతడిని ఎలా ఔట్ చేయాలనే వ్యూహాలతో బౌలర్లు తర్జనభర్జన పడుతున్నారు. 360 డిగ్రీల మొనగాడిగా ఖ్యాతి గడించాడు. అతడి ఆట చూస్తే అందరికి ఎంతో ఉత్సాహం కలుగుతోంది. ఆకాశమే హద్దుగా బంతిని బాదుతున్నాడు. పలు కోణాల్లో బాల్ ను కొడుతూ కసి తీర్చుకుంటున్నాడు. పరుగుల దాహాన్ని తీర్చుకుంటున్నాడు.

ఆదివారం న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో సూర్య తన ప్రతాపం చూపించాడు. 51 బంతుల్లోనే 111 బాది వారికి ముచ్చెమటలు పట్టించాడు. టీ20, వన్డేల్లో అదరగొడుతున్న సూర్య ఇక మీదట టెస్ట్ క్రికెట్లోకి కూడా అరంగేట్రం చేయాలని చూస్తున్నాడు. ఈ మేరకు మేనేజ్ మెంట్ కు సంకేతాలు కూడా ఇచ్చాడు. దీంతో వారు అతడి ప్రవేశం కోసం వేచి చూస్తున్నారు. టీ20, వన్డేల మాదిరి టెస్ట్ క్రికెట్ లోనూ తన తడాఖా చూపించాలని భావిస్తున్నాడు. సూర్య క్రీజులో ఉన్నాడంటే అభిమానులకు పండగే.
గతంలో సైతం బాగా ఆడినా కూడా టీమిండియా నుంచి టెస్ట్ మ్యాచులకు పిలుపు రాకపోవడంతో ఇన్నాళ్లుగా ఎదురు చూస్తున్నాడు. మూడేళ్ల క్రితం వచ్చిన సూర్యకు ఇప్పటికి తేడా ఏమైనా ఉందా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇంకా మెరుగైన క్రికెటర్ గా మారే క్రమంలో సూర్య తనను తాను ఎంతో మార్చుకున్నాడు. ఆహార అలవాట్లు, ప్రాక్టీసు విషయంలో తగిన శ్రద్ధ తీసుకుని బంతిని ఎలా బాదాలో కూడా సరైన విధంగా ఆలోచిస్తుంటాడు. దీంతో అతడి ఆలోచనలకు అనుగుణంగా స్టేడియం నలువైపులా పరుగులు పెట్టిస్తుంటాడు.
ప్రస్తుతం సూర్య కుమార్ యాదవ్ ఓ సంచలన ప్లేయర్ గా వెలుగొందుతున్నాడు. జట్టులో నికరమైన ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. ఆడిన ప్రతి మ్యాచ్ లో తనకంటూ ఓ ప్రత్యేకతను సొంతం చేసుకుంటున్నాడు. మ్యాచ్ అయిపోయాక హైలైట్స్ చూసి తన బ్యాటింగ్ లో ఇంకా ఏవైనా మార్పులు చేసుకోవాలా అనే కోణంలో ఆలోచిస్తుంటాడు. ఇంకా మెరుగైన ప్రదర్శన ఎలా చేయాలనే దానిపై నిరంతరం కసరత్తు చేస్తుంటాడు. తాను కొట్టే షాట్లను కొన్ని సార్లు చూస్తూ ఆవ్చర్యపోతుంటాడు. తనలో ఇంత శక్తి ఉందా అని ప్రశ్నించుకుంటాడు.

ఆటలో ఎలా మసలుకోవాలనే దానిపై కూడా అవగాహన పెంచుకుంటుంటాడు. సరైన సమయంలో సరైన విధంగా స్పందించకపోతే జట్టు వైఫల్యం చెందుతుందని తెలుసుకుని నడుచుకుంటాడు. తన వల్ల ఎలాంటి నష్టం కలగొద్దని భావిస్తుంటాడు. అందుకే మైదానంలో చురుకుగా కదులుతాడు. ఉత్సాహంగా కనిపిస్తుంటాడు. మ్యాచ్ లు లేని సమయంలో కుటుంబంతోనే ఎక్కువ సేపు గడిపేందుకు ఇష్టపడతాడు. కోహ్లితో ఉన్న అనుబంధంతో ఇద్దరు కలిసి తమ అభిప్రాయాలు పంచుకుంటారు. ఆటలో ఎలా వ్యవహరించాలనే దానిపై చర్చించుకుంటారు. విరాట్ ట్వీట్లకు సామాజిక మాధ్యమాల్లో సోదరా అని సంబోధిస్తూ పలకరిస్తుంటాడు.