
Gold Rate: ఇటీవల కాలంలో ఎక్కువ మంది డబ్బుంటే భూములు, బంగారం కొంటున్నారు. భూముల ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. కానీ బంగారం ధరలు మాత్రం ఎప్పుడు పెరుగుతాయో ఎప్పుడు తగ్గుతాయో తెలియడం లేదు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం పసిడి ధరలు దోబూచులాడుతున్నాయి. ఇవాళ అధిక ధరలు ఉన్నా తరువాత రోజే పడిపోతున్నాయి. కానీ వచ్చే దీపావళి నాటికి మాత్రం బంగారం ధరలు రెట్టింపు కానున్నాయని వ్యాపార నిపుణులు చెబుతున్నారు. ఏడాది ప్రారంభంలో బంగారం ధర రూ.55 వేలు ఉండగా మరుసటి రోజే తగ్గింది. ఇలా ఎప్పుడు తగ్గుతుందో ఎప్పుడు పెరుగుతుందో అంతు చిక్కదు.
రానున్న రోజుల్లో బంగారం ధరలు మాత్రం ధగధగలాడతాయని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ధరలు తగ్గినా తరువాత కాలంలో వాటి ధరలకు రెక్కలొస్తాయని సూచిస్తున్నారు. ప్రస్తుతం 22 క్యారెట్ల బంగారం ధర రూ. 52 వేలు పలుకుతుండగా వచ్చే దీపావళి నాటికి మరో రూ.13 వేలు పెరగొచ్చని చెబుతున్నారు. వంద గ్రాముల బంగారంపై దాదాపు రూ. 1.30 లక్షల నుంచి 1.50 లక్షల వరకు ఆదా పొందవచ్చని పరిస్థితులు చెబుతున్నాయి. ఇప్పుడు కొనుగోలు చేస్తే మంచి లాభాలు దక్కుతాయని అంచనా వేస్తున్నారు.
బంగారం ధరలు రోజురోజుకు భారీగానే పెరుగుతున్నాయి. భవిష్యత్ లో కూడా ఆ పెరుగుదల ఉంటుందని తెలుస్తోంది. ఈ క్రమంలో బంగారం ప్రియులు ఇప్పుడేకొనుగోలు చేసుకుంటే ఎంతో బెనిఫిట్స్ పొందొచ్చు. తరువాత కాలంలో రేటు అమాంతం పెరిగితే కొనడానికి ఇబ్బందులు పడతారు. తక్కువ ధర ఉన్నప్పుడే కొనుక్కుంటే లాభాలు దక్కుతాయి. పెరిగిన తరువాత కొనుక్కుంటే ఎక్కువ మొత్తంలో డబ్బు చెల్లించాల్సి రావొచ్చు. కానీ ఎవరు కూడా చెబితే వినరు. పెరిగితేనే వారికి తెలుస్తుంది.

ప్రస్తుతం కొనుక్కుంటే వంద గ్రాముల బంగారానికి రూ. 5.20 లక్షలు అవుతుంది. అదే రాబోయే ఎనిమిది నెలల్లో కొంటే రూ. 6.50 లక్షల నుంచి 6.70 లక్షలకు చేరనుంది. అందుకే ఇప్పుడే ముందస్తు జాగ్రత్తలతో కొనుగోలు చేయడం మంచిది. వెండి ధర కూడా పెరగనుంది. బంగారం, వెండి కొనాలనుకునే వారు ఇప్పుడే కొనుగోలు చేసుకుని డబ్బులు ఆదా చేసుకోవచ్చని సూచిస్తున్నారు. దీపావళి వరకు భారీగా పెరిగే ధరలతో బాధపడే బదులు ఇప్పుడే కొనుక్కోవాలని సూచిస్తున్నారు.