Amazon Shopping: ప్రస్తుత కాలంలో చాలామంది ఆన్లైన్ షాపింగ్ మాత్రమే చేస్తున్నారు. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ వస్తువుల కొనుగోలు విషయంలో ఎప్పటికప్పుడు అప్డేట్ తెలుసుకొని నచ్చిన వాటిని వెంటనే బుక్ చేసుకుంటున్నారు. వీటిలో మొబైల్స్ అయితే కొత్తవి మార్కెట్లోకి రాగానే వాటిని బుక్ చేసుకోవడానికి ఆమెజాన్, ఫ్లిప్ కార్ట్ వంటి వెబ్ సైట్లను సందర్శిస్తూ ఉంటారు. అయితే ఈ వెబ్సైట్లో సందర్శించినప్పుడు మొబైల్ ధర చూసి ఒక్కోసారి షాక్ కు గురి అవుతూ ఉంటారు. ఎందుకంటే ప్రారంభంలో ఉన్న ధర కంటే ఒక్కోసారి ఇవి తక్కువగాను లేదా ఎక్కువగాను ఉంటాయి. ఇలా కంపెనీ ప్రకటించిన ధర కంటే ఎందుకు మారింది ? అన్న విషయం అర్థం కాక ఆందోళన చెందుతుంటారు. అయితే మొబైల్ జెన్యూ ధర ఎంత ఉంది? గత 30 రోజులుగా ఎలా ఉంది? భవిష్యత్తులో ఈ ధర పెరుగుతుందా? లేదా? అనే విషయాలను తెలుసుకునేందుకు కొత్త ఆప్షన్ ను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఆ ఆప్షన్ ఏంటంటే?
మొబైల్ కొనాలని అనుకునేవారు అమెజాన్ లోకి వెళ్లాల్సి వస్తే అందులో ఒక మొబైల్ ను సెలెక్ట్ చేసుకున్న తర్వాత అక్కడ ప్రైస్ లిస్ట్ వస్తుంది. అలాగే మొబైల్ కు సంబంధించిన వివరాలు కనిపిస్తాయి. అంతేకాకుండా మొబైల్ ధర పై ఉన్న డిస్కౌంట్ కూడా చూపిస్తుంది. ఇంతవరకు బాగానే ఉంటుంది. అయితే కంపెనీ ధర ప్రకటించిన దాని కంటే ఇక్కడ ధర ఎక్కువ ఉందా? లేదా తక్కువగా ఉందా? లేదా రియల్ ప్రైస్ చూపిస్తుందా? అనేది తెలుసుకోవాలని చాలామందికి ఉంటుంది. అయితే ఇప్పటివరకు ఆ ఆప్షన్ లేదు. కానీ ఇప్పుడు కొత్తగా ఆ ఆప్షన్ ను అందుబాటులోకి తీసుకువచ్చారు.
ఆమెజాన్ లో చూపించే మొబైల్ ప్రైస్ ధర కింద Price History అనే ఆప్షన్ కొత్తగా ఏర్పాటు చేశారు. దీనిపై క్లిక్ చేయగానే ఒక గ్రాఫ్ మోడల్ గా పేజీ ఓపెన్ అవుతుంది. ఈ పేజీలో ప్రస్తుతం ఉన్న మొబైల్ ద్వారా చూపిస్తుంది. అయితే ఈ గ్రాఫ్ పైన రెండు ఆప్షన్లు ఉంటాయి. వీటిలో ఒకటి 30 డేస్.. మరొకటి 90 డేస్.. అనే ఆప్షన్ లో ఉంటాయి. వీటిలో 30 డేస్ పై క్లిక్ చేస్తే గత 30 రోజులుగా ఈ మొబైల్ ధర ఎలా ఉంది అనేది చూపిస్తుంది. అలాగే 90 డేస్ పై క్లిక్ చేస్తే 90 రోజులుగా మొబైల్ ధర ఏ విధంగా మారింది? అనేది డిస్ప్లే అవుతుంది. ఒకవేళ 90 రోజుల నుంచి ధరలో ఎలాంటి మార్పు లేకపోతే ఒక లైన్ కనిపిస్తుంది.
ఈ విధంగా ఒక మొబైల్ కు సంబంధించిన ధర గురించి తెలుసుకున్న తర్వాత దానిని కొనుగోలు చేసేందుకు ముందుకు వెళ్లాలి. ఒకవేళ 90 డేస్ నుంచి ధర తగ్గుతూ వస్తే ప్రస్తుతం తగ్గినదారే కొనుగోలు చేస్తున్నామని అనుకోవాలి. అలా కాకుండా ధర పెరిగినట్టు అనిపిస్తే కొన్ని రోజులు వెయిట్ చేయడం మంచిది. అయితే దాదాపుగా కొత్తగా వచ్చిన ధర కంటే తగ్గుతూనే ఉంటుంది. ఈ విధంగా అమెజాన్ లోని ఈ ఆప్షన్ ద్వారా మొబైల్ నిజమైన ధరను తెలుసుకోండి.