Eat lentils and rice benefits: ఒకప్పుడు ఆహార ఉత్పత్తి తక్కువగా జరిగేది. అందుబాటులోకి అవసరమైన వనరులు లేకపోవడంతో కేవలం కొన్ని రకాల ఆహార పదార్థాలు మాత్రమే ఉండేవి. కానీ ఇప్పుడు రకరకాల ఆహార పదార్థాలను పండిస్తున్నారు. దీంతో మార్కెట్లోకి కొత్త కొత్త రుచులు వస్తున్నాయి. వీటి రాకతో సాంప్రదాయ వంటలు కనుమరుగైపోతున్నాయి. సాంప్రదాయ వంటల్లో భాగంగా తెలుగువారింట కనిపించే కూర పప్పు. ఎన్నో రకాలు కలిగిన ఈ పప్పు దినుసులతో అనేక ఆహార పదార్థాలను తయారు చేసుకోవచ్చు. అయితే ప్రస్తుత కాలంలో నాన్ వెజ్ ఇష్టంగా తినడంతో పప్పు, కూరలను దూరం పెడుతున్నారు. కానీ పప్పు కూరల్లో ఉండే అసలైన విటమిన్స్ గురించి తెలిస్తే ప్రతిరోజు పప్పుకూరే తింటామని అంటారు. ఇంతకీ పప్పు కూరల్లో ఉండే విటమిన్స్ ఏవి? పప్పు కూర శరీరానికి ఎలాంటి మేలు చేస్తుంది?
మానవ శరీరానికి ప్రతిరోజు 9 రకాల అమైనో ఆమ్లాలు అవసరం. ఇవి మనం తినే పదార్థాల ద్వారా శరీరంలోకి వెళ్తాయి. అయితే ఈ తొమ్మిది రకాల అమైనో ఆమ్లాలు ఒకే పదార్థంలో ఉండకపోవచ్చు. కానీ మనం తినే పప్పు కూరలో 8 రకాల అమైనో ఆమ్లాలు ఉంటాయి. అయితే ఇందులో Methionine అనే అమినో ఆమ్లం లభించదు. ఉన్నా కూడా ఇందులో చాలా తక్కువగా ఉంటుంది. అసలైన విషయం ఏంటంటే ఈ Methionine ఆమ్లం రైస్ లో సమృద్ధిగా ఉంటుంది. అంటే పప్పు, అన్నం కలిపి తింటే తొమ్మిది రకాల అమినో ఆమ్లాలను శరీరంలోకి పంపించుకోవచ్చు. ఇలా శరీరానికి ప్రతిరోజు 9 రకాల అమైనో ఆమ్లాలు పంపించడం వల్ల ఆరోగ్యంగా ఉండగలుగుతారు.
అంతేకాకుండా పప్పు, అన్నం కలిపి తినడం వల్ల శరీరానికి కావలసిన ఫైబర్ అందుతుంది. అనారోగ్య సమయంలోను, అలసటగా ఉన్న సమయంలోను పప్పు అన్నం కలిపి తినడం వల్ల ఎంతో ఎనర్జిటిక్ గా ఉంటుంది. ముఖ్యంగా చిన్నపిల్లలకు సాధ్యమైతే ప్రతిరోజూ పప్పు అన్నం తినిపించవచ్చు. అయితే ప్రతిరోజు పప్పు అన్నం అండలేని వారు.. వారానికి రెండు సార్లు అయినా పప్పు తో కలిపినా అన్నం తినాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కొంతమంది శరీర ఆకృతి పెంచుకోవడానికి మాంసకృతులు తినాలని అంటూ ఉంటారు. వాస్తవానికి వాటికంటే పప్పు తో కలిపినా ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల మజిల్స్ పెరిగే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా వర్క్ అవుట్ చేసేవారు సైతం పప్పు అన్నం ను తీసుకుంటే కావలసిన శక్తి అందుతుంది.
కానీ ప్రస్తుత కాలంలో బయట దొరికే ఆహార పదార్థాలకే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. వాటికంటే పప్పు అన్నం తినే ప్రయత్నం చేయాలని అంటున్నారు. పప్పుల్లో కంది, పెసర వంటి వాటికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. మిగతా వాటికంటే వీటితో చేసే ఆహార పదార్థాలు రుచిగా ఉంటాయి. అంతేకాకుండా ఎక్కువగా కూరల్లో ఈ రెండింటిని ఉపయోగిస్తూ ఉంటారు. సాధ్యమైన వరకు వారంలో కొన్నిసార్లు అయినా పప్పు అన్నంతో తిని ఆరోగ్యంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.