Electric Car’s: ప్రస్తుతం దేశంలో Electric Cars వినియోగం రోజురోజుకు పెరిగిపోతున్నాయి. వినియోగదారులకు అనుగుణంగా కంపెనీలు సైతం వివిధ మోడళ్లను మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. ఇప్పటికే చాలా కంపెనీలు విద్యుత్ వాహనాను పరిచయం చేశాయి. ఇటీవల ఢిల్లీలో జరిగిన Automobility Showలో మారుతి కంపెన సైతం గ్రాండ్ విఠారా ఎలక్ట్రిక్ కారును తీసుకొస్తున్నట్లు తెలిపింది. మారుతి కంటే ముందే టాటా, హ్యుందాయ్ వంటివి ఎలక్ట్రిక్ కార్లను వినియోగదారులకు పరిచయం చేశాయి. తాజాగా బ్రాండ్ కారు అయిన Creta నుంచి ఎలక్ట్రిక్ కారు విడుదల అయింది. హ్యుందాయ్ క్రెటా కారు ఇప్పటికే చాలా మందికి తెలుసు. ఈ మోడల్ ఇప్పుడు ఎలక్ట్రిక్ వేరియంట్ లో అందుబాటులోకి వచ్చింది. వాస్తవానికి ఈ కారు బుకింగ్ గతంలోనే ప్రారంభం కాగా ఇప్పుడు వినియోగదారులు దీనిని పొందుతున్నారు. అసలు హ్యుందాయ్ కారు ఎలా ఉందంటే?
భారత్ లో హ్యుందాయ్ కార్లకు డిమాండ్ ఎక్కువగానే ఉంటుంది. ఇప్పటికే వరకు ఈ కంపెనీ నుంచి ఎక్కువగా కొనుగోలు చేసిన క్రెటాను ఎలక్ట్రిక్ వేరియంట్ లోకి మార్చారు. ఇది ICE ఇంజిన్ మోడల్ లో ఉంటుంది. ఇందులో రెండు బ్యాటరీలను అమర్చారు. వీటిలో ఒకటి 42 kWh, 51.4 kWhఅనే రెండు ఉన్నాయి. వీటిలో 42 కిలో వాట్ బ్యాటరీ పూర్తిగా చార్జింగ్ చేస్తే 390 కిలోమీట్ల వరకు మైలేజ్ ను ఇస్తాయి. ఈ ఇంజిన్ 135 బీహెచ్ పీ పవర్ ను ఉత్పత్తి చేస్తుంది. రెండో బ్యాటరీ 51.4 చార్జింగ్ తో 473 కిలోమీటర్ల వరకు వెళ్లొచ్చు. ఈ బ్యాటరీతో కేవలం 7.9 సెకన్లలోనే 100 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణిస్తుంది.
హ్యుందాయ్ క్రెటా ఈవీలో అధునాతన ఇఆంజిన్ మాత్రమే కాకుండా ఆకట్టుకునే ఫీచర్స్ ఉన్నాయి. ఇందులో 10.25 అంగుళాల ఇన్పోటైన్మెంట్ సిస్టమ్ తో పాటు కొత్త స్టీరింగ్ వీల్ ను అమర్చారు. వెంటిలేటెడ్ పవర్డ్ సీట్లు ఉన్నాయి. అందరూ కోరుకునే పనోరమిక్ సన్ రూఫ్ ను అమర్చారు. సేప్టీ కోసం ఈ కారులో అడాస్ టెక్నాలజీని సెట్ చేశారు. అలాగే 360 డిగ్రీ కెమెరాతో పాటు ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, యాంబియంట్ లైటింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
ఈ కారు ప్రస్తుతం మొత్తం 4 వేరియంట్లలో అందుబాటులో ఉంది. వీటిలో ఒకటి Exicutive, smart, Premium, Excelenceఅనేవి ఉన్నాయి. ఈ మోడల్ రూ. 17.99 లక్షల నుంచి రూ. 23.50 లక్షల వరకు విక్రయిస్తున్నారు. వినియోగదారులను ఆకర్షించేందుకు మొత్తం 10 కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఎలక్ట్రిక్ కార్ల వినియోగం పెరుగుతున్న వేళ్ల అధునాత ఫచర్లతో పాటు ఆకట్టుకునే ఫీచర్లను కలిగిన హ్యుందాయ్ కారును కొనుగోలు చేసేందుకు చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. ఇందులో భాగంగా దీనిని ఆదరిస్తారని అంటున్నారు. అయితే ఈ కారు సేల్స్ ఎలా ఉంటాయో చూడాలి. అంతేకాకుండా ఈ కారు మిగతా కార్లకు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు.