TVS Apache: యవ్వనంలోకి వచ్చిన తరువాత అత్యంత సంతోషించేది.. సొంతంగా బైక్ వచ్చిన తరువాతే. అందులోనే కోరుకున్న బైక్ ను పొందిన తరువాత ఆ హ్యాపీనెస్ కు అంతు ఉండదు. ఈ పరిస్థితిని బాగా గమనించిన కొన్ని కంపెనీలు యూత్ ను దృష్టిలో ఉంచుకొని వారిని ఆకట్టుకునేవిధంగా బైక్స్ ను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. హీరో హోండా నుంచి బజాజ్, టీవీఎస్ లాంటి కంపెనీలు సాంప్రదాయ స్కూటర్లతో పాటు యూత్ ను అట్రాక్ట్ చేసుకోవడానికి అత్యధిక ధర కలిగిన బైక్ లను మార్కెట్లోకి తీసుకొచ్చాయి. ఇటీవల ఓ బైక్ ను బాగా ఆదరిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిని గత 11 నెలల్లో 4 లక్షల మంది కొనుగోలు చేశారు. అంతేకాకుండా ఆ కంపెనీ అమ్మకాల్లో ఇదే 36 శాతం వాటాను కలిగి ఉంది. ఇంతకీ ఆ బైక్ ఏది?
దేశీయ కంపెనీ అయిన TVSకు వాహనదారుల్లో మంచి గుర్తింపు ఉంది. ఈ కంపెనీ నుంచి రిలీజ్ అయ్యే బైక్స్ ఆకట్టుకుంటాయని వారి భావన. అందులో భాగంగానే 20 ఏళ్ల కిందట Apacheని మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఆ కాలంలో ఇది ప్రీమియం బైక్ గా ఉండడంతో కొంత మంది మాత్రమే కొనుగోలు చేశారు. కానీ ప్రతీ సంవత్సరం దీని అమ్మకాలు పెరుగుతూ వస్తున్నాయి. 20 ఏళ్లలో అత్యధికంగా 2019లో 4.7 లక్షల బైక్ లు విక్రయించబడ్డాయి. అంతకుముందు 2018లో 3,99,035 యూనిట్లు విక్రయాలు జరుపుకున్నాయి. అయితే ఆ తరువాత మళ్లీ తగ్గింపు సేల్స్ నమోదు చేసుకున్నారు. అయితే 2025 ఫిబ్రవరి నెల వరకు దీనిని 4 లక్షల బైక్ లు అమ్ముడు పోయినట్లు తెలుస్తోంది. మార్చి గణాంకాలు వెలువడితే 4.45 లక్షల వరకు ఉంటాయని కంపెనీ ప్రతినిధులు తెలుపుతున్నారు. అపాచీ 150 నుంచి 200 సీసీ ఇంజిన్ బైక్ లను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా కంపెనీ మొత్తం బైక్ అమ్మకాల్లో ఇది 36 శాతం వాటాను కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. టీవీఎస్ కంపెనీకి చెందిన మొత్తం స్కూటర్లు, బైక్స్ అన్నీ కలిపి 11 నెలల్లో 32.2 లక్షల యూనిట్లకు చేరుకున్నాయి. అయితే స్కూటర్లు 24 శాతం వాటాను కలిగి ఉన్నాయి. మొత్తంగా ద్విచక్ర వాహనాలు 51 శాతం వాటాను కలిగాయి. ఈ ఆర్థిక సంవత్సం ముగిసే వరకు వాటి శాతం పెరిగే అవకాశం ఉంటుందని కంపెనీ ప్రతినిధులు తెలుపుతున్నారు. అందులోనూ ఈ కంపెనీకి చెందిన ప్రీమియం బైక్ లు ఎక్కువగా విక్రయాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
అయితే యూత్ ను ఆకర్షించేందుకు హోండా నుంచి కరిజ్మా, బజాజ్ నుంచి పల్సర్ వంటి బైక్ లో కొన్నేళ్ల పాటు సేల్స్ లో స్పీడును పెంచాయి. కానీ ఇటీవల అపాచీకి ఎక్కువగా మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇదే పరిస్థితి ముందు ముందు ఉంటుందని అంటున్నారు. మరి ఎలాంటి సేల్స్ నమోదు చేసుకుంటుందో చూడాలి.