Don’t buy this Mahindra car: దేశంలో Mahindra కార్లకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ కంపెనీ కారు దక్కించుకోవడానికి అహర్నిశలు పడుతూ ఉంటారు. ఇటీవల దీని నుంచి రిలీజ్ అయిన థార్ రాక్స్ కోసం బుక్ చేసుకుంటే మూడు నెలలు వెయిటింగ్ పీరియడ్ ఉన్నా.. వెనక్కి తగ్గడం లేదు. ఎక్కువగా SUV వేరియంట్ లో రిలీజ్ అయ్యే ఈ కంపెనీకి చెందిన కార్ల ధరలు కాస్త ఎక్కువగానే ఉంటాయి. అయినా మహీంద్రా కార్లలో సేప్టీ తో పాటు ఫీచర్స్ విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ కారు. అందుకే మహీంద్రా కార్లు అంటే ఎగబడుతూ ఉంటారు. కానీ ఈ కంపెనీకి చెందిన ఓ కారు మాత్రం అత్యంత తక్కువ మొత్తంలో అమ్మకాలు జరుపుకుంది. 2024 నవంబర్ లో ఈ కారు కేవలం 9 యూనిట్లు మాత్రమే విక్రయించబడ్డాయి. ఇంతకీ ఆ కారు ఏదో తెలుసుకోవాలని ఉందా? అయితే ఈ వివరాల్లోకి వెళ్లండి.
దేశంలో మహీంద్రా కార్ల అమ్మకాలు ఎప్పటికీ టాప్ లెవల్లో ఉంటాయి. ఈ ఏడాది సెప్టెంబర్ లో అత్యధిక యూనిట్లు విక్రయించి మూడో స్థానంలో నిలిచింది. ఈ కంపెనీ సెప్టెంబర్ లో 51,062, అక్టోబర్లో 54,504 యూనిట్లు విక్రయించి ఆకట్టుకుంది. అయితే గత నవంబర్ లో మాత్రం సేల్స్ పడిపోయాయి. ఈ నెలలో 46,222 కార్లను విక్రయించారు. అయితే కొన్ని కార్ల కు మాత్రం క్రేజ్ తగ్గకుండా ఉంటే.. మరికొన్ని మాత్రం కనీసం నమోదు చేసుకోలేదు. ఇందులో ఓ కారు పరిస్థితి మరీ దారుణంగా ఉంది. అదే ‘మహీంద్రా మరాజో’.
Mahindra Marazo కారును నవంబర్ నెలలో 9 మంది మాత్రమే కొనుగోలు చేశారు. అక్టోబర్ లో దీని సేల్స్ 37గా ఉన్నాయి. గత ఆరు నెలలుగా ఈ కారు అమ్మకాల పరిస్థితి మరీ దారుణంగానే ఉంటూ వస్తోంది. ఆరునెలల్లో అత్యధికంగా అక్టోబర్ లోనే విక్రయాలు జరుపుకున్నాయి. కానీ నవంబర్ లో భారీగా తక్కువగా అమ్మకాలు చేసుకున్నాయి. అయితే ఈ కారు మొదట్లోనే ఫెయిల్ కావడంతో ఆ తరువాత దీనిని ఎంపీవీలకు గట్టి పోటీ ఇచ్చేందుకు ఎంపీవీని తీసుకొచ్చారు. అయినా ఫలితం లేకుండా పోయింది.
అయితే మహీంద్రా మరాజో కారు ధర ప్రస్తుతం మార్కెట్లో రూ.13.09 లక్షల ప్రారంభ ధరతో మార్కెట్లో ఉంది. టాప్ ఎండ్ వేరియంట్ రూ.14.74 లక్షలతో విక్రయిస్తున్నారు. ఈ మోడల్ మొత్తం రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. అంతేకాకుండా తాజాగీ వీటి ధరలు రూ.20 వేలు పెంచారు. ధరలు పెరగడంతోనే దీనిని కొనేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని అంటున్నారు. మహీంద్రా మరాజో కారు 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ ను కలిగి ఉంది. ఇది 121 బీహెచ్ పీ పవర్ తో పాటు 300 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 2 ఎయిర్ బ్యాగ్, ఏబీఎస్, ఈబీడీ రియర్ పార్కింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇందులో 7 అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.