https://oktelugu.com/

Trigraha Yoga: కొత్త సంవత్సరంలో ఈ రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి.. లేదంటే ఇబ్బందులే!

Trigraha Yoga: ప్రతి ఒక్కరికి భవిష్యత్తు గురించి తెలుసుకోవాలని చాలా ఆసక్తి ఉంటుంది. దాంతో కొన్ని జ్యోతిష్య శాస్త్రాల దగ్గరికి వెళ్లి భవిష్యత్తు గురించి తెలుసుకుంటూ ఉంటారు. ఇక ఈ సంవత్సరం మరికొన్ని రోజుల్లో పూర్తి కానున్న సందర్భంగా కొత్త సంవత్సరంకు సంబంధించిన రాశుల గురించి ఇప్పటి నుంచే తమ భవిష్యత్తు గురించి వెతుక్కుంటున్నారు. 2022 వ సంవత్సరంలో మూడు గ్రహాలు ఒకే రాశిలోకి చేరుతాయని తెలుస్తుంది. ఆ రాశి ఏంటంటే మకర రాశి. ఇందులో సూర్యుడు, […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 24, 2021 / 01:05 PM IST

    horoscope Today

    Follow us on

    Trigraha Yoga: ప్రతి ఒక్కరికి భవిష్యత్తు గురించి తెలుసుకోవాలని చాలా ఆసక్తి ఉంటుంది. దాంతో కొన్ని జ్యోతిష్య శాస్త్రాల దగ్గరికి వెళ్లి భవిష్యత్తు గురించి తెలుసుకుంటూ ఉంటారు. ఇక ఈ సంవత్సరం మరికొన్ని రోజుల్లో పూర్తి కానున్న సందర్భంగా కొత్త సంవత్సరంకు సంబంధించిన రాశుల గురించి ఇప్పటి నుంచే తమ భవిష్యత్తు గురించి వెతుక్కుంటున్నారు.

    Trigraha Yoga

    2022 వ సంవత్సరంలో మూడు గ్రహాలు ఒకే రాశిలోకి చేరుతాయని తెలుస్తుంది. ఆ రాశి ఏంటంటే మకర రాశి. ఇందులో సూర్యుడు, శని, బుధుడు ప్రవేశించనున్నారు. దీని వల్ల త్రిగ్రహ యోగం ఏర్పడుతుందని కొన్ని శాస్త్రాలు తెలుపుతున్నాయి. ఈ యోగం ఏర్పడటం వల్ల 4 రాశుల పై ప్రభావం పడింది. ఆ రాశులు ఏమిటంటే..

    ధనుస్సు: ఈ రాశి వారికి త్రిగ్రహ యోగం వల్ల వీరి వైవాహిక జీవితం ఆనందంగా సాగుతుంది. కానీ ఆరోగ్యపరంగా చాలా సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. సంతానం నుండి శుభవార్తలు వింటారు. అంతేకాకుండా వారి గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.

    Also Read: సంక్రాంతికి సరికొత్తగా గాడిదల పందాలు

    కన్య: కన్య రాశి పై మూడు గ్రహాల ప్రభావం ఎక్కువగా ఉంది. తీసుకునే ఆహారం పట్ల శ్రద్ధ గా ఉండాలి. ఆర్థికంగా జాగ్రత్తగా ఆలోచించాలి. ప్రయాణాలు చేసేటప్పుడు ముఖ్యంగా డ్రైవింగ్ చేసేటప్పుడు శ్రద్ధ తీసుకోవాలి. కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి శ్రద్ద తీసుకోవాలి.

    తుల: ఇక తుల రాశి వారికి కూడా కొన్ని కష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా మానసిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. జీవిత భాగస్వామి తో జాగ్రత్తగా ఉండాలి. ప్రేమలో ఉన్న వాళ్ళు కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.

    మకర: ఈ రాశి వాళ్ళు ఏ పని మొదలు పెట్టాలన్న చాలా కష్టపడాల్సి ఉంటుంది. విద్యార్థుల చదువు పట్ల పెద్దగా ఆసక్తి చూపించలేరు. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఆర్థికంగా ఖర్చులను ఎక్కువగా చేసే అవకాశం ఉంది.

    Also Read: ఈ వస్తువులు కలలో కనిపిస్తే మీకు జీవితంలో ఎదురుండడు.. అన్ని శుభాలే!