Spiritual: మంగళవారం ఈ పనులు అస్సలు చేయకూడదు.. లేదంటే?

శ్రీ ఆంజనేయ స్వామికి మంగళవారం ఇష్టమైన రోజు. ఈ రోజున ఆయన భక్తుల కోరికలను వింటుంటారని చెబుతారు. ఆంజనేయ స్వామిన బ్రహ్మచారి అయినందువల్ల ఈరోజు స్వామి అనుగ్రహం పొందాలంటే బ్రహ్మచర్యం పాటించాలి.

Written By: Chai Muchhata, Updated On : October 3, 2023 5:07 pm

Spiritual

Follow us on

Spiritual: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి రోజుకు ఓ ప్రత్యేకత ఉంటుంది. వారంలోని ఏడు వారాల్లో ప్రతి రోజు గ్రహాలతో ముడిపడి ఉంటాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఈ ఏడువారాల్లో మంగళవారం ఆంజనేయుడికి అంకితం చేయబడుతుందని చెబుతారు. ప్రతీ మంగళవారం శ్రీ ఆంజనేయస్వామిని ఆరాధించడం వల్ల ఎన్నో శుభాలు జరుగుతాయి. అయితే ఆంజనేయస్వామికి అనుకూలంగా ఉంటూ ఆయనకు నచ్చని పనలు చేయకుండా ఉండడం వల్లనే స్వామి అనుగ్రహం పొందగలుగుతారు. అందుకోసం మంగళవారం కొన్ని పనులు చేయకుండా ఉండాలి. అవేంటంటే?

శ్రీ ఆంజనేయ స్వామికి మంగళవారం ఇష్టమైన రోజు. ఈ రోజున ఆయన భక్తుల కోరికలను వింటుంటారని చెబుతారు. ఆంజనేయ స్వామిన బ్రహ్మచారి అయినందువల్ల ఈరోజు స్వామి అనుగ్రహం పొందాలంటే బ్రహ్మచర్యం పాటించాలి. శుచి, శుభ్రతతో మెలగాలి. మనసులో ఎలాంటి కోపం తెచ్చుకోకుండా ప్రశాంతంగా ఉండాలి. ముఖ్యంగా మంగళవారం ఉపవాసం చేసేవారు. కూరల్లో దాదాపు ఉప్పు లేకుండా చూసుకోవాలి. ఉప్పు తినడం వల్ల మనిషికి కోపం వస్తుంది. దీంతో స్వామిపై మనసు వెళ్లదు. ఈ క్రమంలో ఆంజనేయస్వామి అనుగ్రహం పొందలేరు.

మంగళవారం ఎట్టి పరిస్థితుల్లో గోళ్లు కత్తిరించకూడదు. అలాగే క్షవరం చేసుకోకూడదు. కొన్ని సెలూన్లు మంగళవారం హాలిడేను పాటిస్తాయి కూడా. ఈరోజున ఉత్తరం, పడమర దిశల్లో అత్యవసరం అయితే తప్ప ప్రయాణాలు లేకుండా చూసుకోవాలి. అలా కాదని ప్రయాణిస్తే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మంగళవారం ఎవరికీ అప్పు ఇవ్వకూడదు. అలాగే ఇనుముతో కూడిన కత్తెర, కత్తి లాంటి వస్తువులు అసలే దానం చేయకూడదు.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మంగళవారం శుక్ర, శని గ్రహాలకు సంబంధించిన పనులు చేయకూడదు. ఈరోజును మాంసానికి, మద్యానికి దూరంగా ఉంటేనే స్వామికి చేరువవుతారు. అలాగే హనుమంతుడిని ఆరాధించేవారు పాలతో చేసిన తీపి పదార్థాలు అస్సలు పెట్టకూడదు. ఇలా చేయడం వల్ల ఆంజనేయస్వామి ఆగ్రహం కలిగించిన వారవుతారని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.