https://oktelugu.com/

Salaar: సంచలనం.. సలార్ మూవీలో ప్రభాస్, ఎన్టీఆర్, యశ్

డైరెక్టర్ ప్రశాంత్ నీల్ పై ప్రభాస్ ఫ్యాన్స్ కు పీకలదాక కోపం ఉంది. దానికి కారణం మనకు తెలియనిది కాదు. అన్ని కుదిరితే సెప్టెంబర్ 28నే డైనోసార్ థియేటర్లలోకి రావాలి.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : October 3, 2023 / 12:15 PM IST

    Salaar

    Follow us on

    Salaar: యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటిస్తున్న ‘సలార్’ చిత్రం కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు ఎంతలా ఎదురు చూస్తున్నారో మన అందరికీ తెలిసిందే. బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ చేసిన ప్రతీ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అట్టర్ ఫ్లాప్ అవుతూనే ఉన్నాయి. దీంతో ప్రభాస్ బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టుగా ఊర మాస్ యాక్షన్ ఫిలిం లో అభిమానులు చూడాలని ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు.‘సలార్’ చిత్రం అలాంటిదే అని పోస్టర్స్, టీజర్ చూసినప్పుడు అందరికీ క్లారిటీ వచ్చేసింది. అందుకే ఈ చిత్రం కోసం సినీ అభిమానులు అంతలా ఎదురు చూస్తున్నారు.సెప్టెంబర్ 28 వ తారీఖున విడుదల అవ్వాల్సిన ఈ చిత్రం కొన్ని అనుకోని కారణాల వల్ల వాయిదా పడాల్సి వచ్చింది.

    డైరెక్టర్ ప్రశాంత్ నీల్ పై ప్రభాస్ ఫ్యాన్స్ కు పీకలదాక కోపం ఉంది. దానికి కారణం మనకు తెలియనిది కాదు. అన్ని కుదిరితే సెప్టెంబర్ 28నే డైనోసార్ థియేటర్లలోకి రావాలి. కానీ సలార్ వీఎఫ్ఎక్స్ పై ప్రశాంత్ నీల్ అసంతృప్తి వ్యక్తం చేయడంతో.. ఆ సీన్లను సరిదిద్దే పనిలో మునిగిపోయారు మూవీ టీమ్. దీంతోనే సినిమా విడుదల వాయిదాపడుతూ వస్తోంది. అయితే ఎంత ఆలస్యం అవుతున్నా.. ఎన్ని వాయిదాలు పడుతున్నా.. సలార్ అంచనాల విషయంలో ఏమాత్రం తగ్గడం లేదు. తాజాగా సలార్ కు సంబంధించిన లేటెస్ట్ న్యూస్ ఒకటి వైరల్ గా మారింది. సలార్ క్లైమాక్స్ లో కన్నడ స్టార్ యశ్ తో పాటు టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నుంచి కూడా సర్ ప్రైజ్ లు ఉంటాయని తెలుస్తోంది.

    సలార్.. ఎన్ని వాయిదాలు పడుతున్నా, ఎంత ఆలస్యం అవుతున్నా మూవీపై క్రేజ్ అంతకంతకు పెరుగుతూనే ఉంది. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సలార్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దుతున్నాడు. ఎప్పుడూ వాయిదా వార్తలతో సోషల్ మీడియాలో నిలిచే సలార్ మూవీ.. తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ తో హాట్ టాపిక్ మారింది. అదేంటంటే?క్లైమాక్స్ తర్వాత వచ్చే పోస్ట్ క్రెడిట్ సన్నివేశాల్లో ఒకే ఫ్రేమ్ లో యశ్-తారక్ లు కనిపించి సర్ప్రైజ్ చేస్తారట. ఈ దృశ్యాలను ఊహించని రీతిలో ప్రశాంత్ నీల్ డిజైన్ చేశాడని బెంగళూరు వర్గాల్లో జోరుగా చర్చనడుస్తోంది. సాధారణంగా ఇలాంటి ప్యాట్రన్ హాలీవుడ్ మూవీల్లో ఎక్కువగా వాడుతూ ఉంటారు. స్పైడర్ మ్యాన్, అవెంజర్స్, అవతార్ లాంటి సిరీస్ లకు ఇది అద్భుతంగా వర్కౌట్ అయ్యింది. ఇప్పుడు ఇదే ప్యాట్రన్ ను సలార్ కు వాడుతున్నాడు ప్రశాంత్ నీల్.

    అయితే ఈ వార్తల్లో ఎంతవరకు నిజమున్నదో తెయాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. యశ్-ఎన్టీఆర్ లు ఒకే ఫ్రేమ్ లో కనిపించే వార్తలను కొట్టిపారేయలేం. ఎందుకుంటే? కేజీఎఫ్ తో యశ్ కు పాన్ ఇండియా రేంజ్ క్రేజ్ ఇచ్చాడు ప్రశాంత్ నీల్. దీంతో అతడు అడిగితే యశ్ కాదనడు. ఇక ఎన్టీఆర్ సైతం ప్రశాంత్ తో ఓ సినిమా చేయబోతున్నాడు. దీంతో వీరిద్దరి మధ్య ఉన్న ఎన్టీఆర్ కూడా అడిగితే కాదనడు. అయితే యశ్-ఎన్టీఆర్ లు ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తే థియేటర్లు దద్దరిల్లడం ఖాయమే అని ప్రేక్షకులు బల్లగుద్ది మరీ చెబుతున్నారు. కాగా.. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక టీజర్ రిలీజ్ చేయాలని హోంబలే నిర్మాణ సంస్థ సిద్దమవుతోంది. మరి ఒకే సినిమాలు ఇంత మంది స్టార్ హీరోలు కనిపిస్తే ఆ థ్రిల్ వేరేలా ఉంటుంది. అసలు సినిమా చూడడానికి రెండు కళ్లు సరిపోవు అనుకుంటున్నారు కొందరు. చూడాలి సినిమా ఎలాంటి రిజల్ట్ ను సొంతం చేసుకుంటుందో.. ఏ స్టార్లు ఇందులో కనిపిస్తారో…