Negative Sentiment : మీలో నెగిటివ్ సెంటిమెంట్ ఓవర్‌రైడ్ ఉందా? అయితే ఈ సమస్యలు తప్పవు

ఏ బంధంలో అయిన గొడవలు అనేవి సహజం. కానీ వాటిని అర్థం చేసుకుని ముందుకు వెళ్లేంత ధైర్యం, ఓపిక కొంతమందికి ఉండదు. ఒకరిని ఒకరు అర్థం చేసుకోలేక పార్ట్‌నర్‌ను నెగిటివ్ కోణంలో చూసి వారితో చీటికి మాటికి గొడవ పడుతుంటారు. అలా కాస్త ఆ గొడవలు పెద్దవి అయి.. చివరికి విడిపోయేంత వరకు వస్తుంది.

Written By: Srinivas, Updated On : August 21, 2024 10:59 am

Negative Sentiment

Follow us on

Negative Sentiment :  పచ్చ కామెర్ల వాడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందన్నట్లు.. తప్పుగా చూస్తే అందరూ అలానే కనిపిస్తారు. చెడును అర్థం చేసుకునేంత ఈజీగా మంచి ఎవరికి అర్థం కాదు. నెగిటివ్ కోణంలో మాత్రమే మనుషులను చూస్తుంటారు. కానీ పాజిటివ్‌గా అస్సలు చూడరు. దీనివల్ల ఏ బంధంలోనైనా కలహాలు స్టార్ట్ అవుతాయి. చిన్నగా మొదలైనవి చివరకు పెద్దవి అయి విడిపోయేవరకు వస్తుంది. ఒక్క క్షణం ప్రశాంతంగా నిజనిజాలు ఏంటో తెలుసుకోకుండా నెగిటివ్‌గా ఆలోచించి పంతాలకు వెళ్తారు. ఈమధ్య ఎక్కువ జంటలు పార్టనర్‌ను పాజిటివ్‌గా చూడకుండా నెగిటివ్ కోణంలోనే ఎక్కువగా చూస్తున్నారు. దీనినే నెగిటివ్ సెంటిమెంట్ ఓవర్‌రైడ్ అంటారు. దీనివల్ల ఇద్దరి మధ్య గొడవలు పెరుగుతాయి. మీరు చూసే దృష్టి కోణాన్ని మార్చుకుని పార్టనర్‌ను అర్ధం చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. అదేలాగే ఇప్పుడు తెలుసుకుందాం.

ఏ బంధంలో అయిన గొడవలు అనేవి సహజం. కానీ వాటిని అర్థం చేసుకుని ముందుకు వెళ్లేంత ధైర్యం, ఓపిక కొంతమందికి ఉండదు. ఒకరిని ఒకరు అర్థం చేసుకోలేక పార్ట్‌నర్‌ను నెగిటివ్ కోణంలో చూసి వారితో చీటికి మాటికి గొడవ పడుతుంటారు. అలా కాస్త ఆ గొడవలు పెద్దవి అయి.. చివరికి విడిపోయేంత వరకు వస్తుంది. మంచిగా ఉన్నప్పుడు కొందరు పార్ట్‌నర్‌తో బాగానే ఉంటారు. లెక్కలేనంత ప్రేమ చూపిస్తుంటారు. కానీ చిన్న గొడవ ఇద్దరి మధ్య వచ్చిందంటే చాలు. ఇక నువ్వు అలా, ఇలా అని పార్ట్‌నర్‌ను నెగిటివ్ కోణంలో చూస్తుంటారు. దీంతో ఇన్నాళ్లు చూపించిన ప్రేమ అంతా పోతుంది. ఇద్దరి మధ్య ఇంకా దూరం పెరుగుతుంది. దీనివల్ల పార్ట్‌నర్‌ మీద నెగిటివిటీ ఇంకా పెరుగుతుంది. ఎన్ని గొడవలు వచ్చినా వెంటనే పరిష్కరించుకోవాలి. ఒకరినొకరు అర్థం చేసుకుని సంతోషంగా ఉండాలి.

అంతా మంచిగా ఉన్నప్పుడు అన్ని బాగుంటాయి. కానీ గొడవలు, కష్టాలు వచ్చినప్పుడే ఎవరు రంగు ఏంటని తెలుస్తుంది. మంచిగా ఉన్నప్పుడు బాగానే ఉండి.. గొడవలు వచ్చినప్పుడు విమర్శించుకుంటే ఆ బంధం అసలు నిజమైందే కాదు. ఎంత పెద్ద గొడవ వచ్చిన ఒకరినొకరు విమర్శించుకోకుండా ఉంటే ఆ బంధం ఎప్పటికీ ఉంటుంది. లేకపోతే ఇలా గొడవ వచ్చిన ప్రతీసారి విమర్శించుకుంటూ పోతే ఏదో రోజు ఇద్దరూ విడిపోయే ప్రమాదం ఉంది. బంధంలో ఉండే ఇద్దరూ కూడా ఒకరి ఇష్టాలను మరోకరు గౌరవించుకోవాలి. మీ పార్ట్‌నర్ ఏదైనా చెబితే నెగిటివ్ కోణంలో చూడకుండా.. పాజిటివ్‌గా చూడటం అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే నెగిటివ్‌గా చూస్తే అదే అలవాటు అవుతుంది. దీనివల్ల ఇద్దరి మధ్య సమస్యలు ఇంకా పెరుగుతాయి. తప్పుు ఎవరిది అనేది పక్కన పెట్టి సమస్య పరిష్కరించుకోవడానికి ట్రై చేయాలి. అప్పుడప్పుడు పార్ట్‌నర్ చేసే మంచి పనులను పొగడండి. వాళ్లకు ఏదైనా చిన్న బహుమతులు ఇవ్వడం వంటివి చేస్తుండండి. వీటివల్ల ఇద్దరి మధ్య అనుబంధం పెరగడంతో పాటు పాజిటివిటీ కూడా పెరుగుతుంది