Women Health : డెలివరీ తర్వాత డిప్రెషన్‌ ఎందుకు? దీనికి గల కారణాలేంటి?

ఎక్కువశాతం మంది మహిళలు డెలివరీ తర్వాత డిప్రెషన్‌కు లోనవుతారు. దీనికి ముఖ్యకారణం మహిళల శరీరంలో హార్మోన్ల ప్రభావమే. గర్భం దాల్చినప్పటి నుంచి ఒత్తిడి, వ్యక్తిగతంగా ఏవైనా సమస్యలు ఉండటం, కుటుంబంలో ఎవరైనా చనిపోవడం, ఆర్థిక సమస్యలు, మూడ్ స్వింగ్స్ వంటి వాటి వల్ల ఇబ్బంది పడుతుంటారు.

Written By: Swathi, Updated On : August 21, 2024 11:32 am

Depression after delivery

Follow us on

Women Health :  ఒక స్త్రీ పుట్టినప్పటి నుంచి పెద్దయ్యే వరకు తన జీవితంలో ఎన్నో మార్పులు వస్తాయి. పెళ్లికి ముందు తన లైఫ్ ఒకటి అయితే పెళ్లి అయిన తర్వాత లైఫ్ వేరే. ఎన్నో విషయాల్లో పెళ్లి తర్వాత మార్పులు చూడాల్సి వస్తుంది. తన ఇష్టాలతో సంబంధం లేకుండా జీవితం ఉంటుంది. ఆ తర్వాత గర్భం దాల్చడంతో ఇంకా కొత్త కొత్త మార్పులు స్త్రీ శరీరంలో జరుగుతాయి. ముఖ్యంగా గర్భం దాల్చినప్పటి నుంచి డెలివరీ అయ్యే వరకు మహిళల శరీరంలో ఎన్నో మార్పులు వస్తాయి. కొందరు బరువు పెరగడం, సన్నగా మారడం, చర్మ రంగులో మార్పు వంటివి వస్తుంటాయి. కానీ ఎక్కువ శాతం మంది మహిళలు డెలివరీ తర్వాత ఎక్కువగా డిప్రెషన్‌కు లోనవుతారట. తొమ్మిది నెలలు మోసి, పురిటి నొప్పులను తట్టుకుని పుట్టిన బిడ్డను చూసిన తర్వాత తల్లి సంతోషం చెప్పలేనిది. ఇంత సంతోషంగా ఉన్నప్పుడు డెలివరీ తర్వాత అసలు డిప్రెషన్‌లోకి ఎందుకు వెళ్తారు. డెలివరీ తర్వాత డిప్రెషన్ నుంచి బయటకు రావాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం.

ఎక్కువశాతం మంది మహిళలు డెలివరీ తర్వాత డిప్రెషన్‌కు లోనవుతారు. దీనికి ముఖ్యకారణం మహిళల శరీరంలో హార్మోన్ల ప్రభావమే. గర్భం దాల్చినప్పటి నుంచి ఒత్తిడి, వ్యక్తిగతంగా ఏవైనా సమస్యలు ఉండటం, కుటుంబంలో ఎవరైనా చనిపోవడం, ఆర్థిక సమస్యలు, మూడ్ స్వింగ్స్ వంటి వాటి వల్ల ఇబ్బంది పడుతుంటారు. ఈ కారణాల వల్ల కూడా మహిళలు డెలివరీ తర్వాత ఎక్కువగా డిప్రెషన్‌కు గురవుతున్నారు. అయితే డెలివరీ మహిళలు డిప్రెషన్‌తో బాధపడుతున్నారో లేదో తెలుసుకోవాలంటే వారిలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. ఆ మహిళలకి పూర్తిగా ఆకలి వేయకపోవం, ఆకలి విషయంలో మార్పులు రావడం, నిద్రలేమి, వెంట వెంటనే మూడ్ మారిపోవడం, ఎప్పుడూ ఏదో ఒక విషయం ఆలోచించి బాధపడటం, సంతోషంగా లేకపోవడం, పిల్లల విషయంలో ఎలాంటి శ్రద్ధ చూపించకపోవడం, చిన్న సమస్య వచ్చిన ఎక్కువగా ఏడవడం, అతిగా ఆలోచించడం, ఏకాగ్రత లేకపోవడం, ఏ పని మీద అంత ఇంట్రెస్ట్ లేక చేయలేకపోవడం వంటి లక్షణాలన్నీ కనిపిస్తాయి. డెలివరీ అయిన మహిళలో ఈ లక్షణాలు ఉంటే ఆమె డిప్రెషన్‌లో ఉన్నట్లే.

డెలివరీ తర్వాత డిప్రెషన్ నుంచి బయటపడటానికి ప్రయత్నించాలి. లేకపోతే పిల్లలకు మీకు మధ్య ఉన్న బంధం బలోపితం అవుతుంది. మీకు మీరే డిప్రెషన్ నుంచి బయటపడాలి. దీనికి మీరు ఎక్కువగా కుటుంబ సభ్యులతో లేదా స్నేహితులతో గడపాలి. అలాగే పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారం తతినడం, మీకు సంతోషం అనిపించే పనులు చేయాలి. ఎక్కువ ఆలోచించకుండా సరిపడా నిద్రపోవాలి. మద్యం, ధూమపానానికి దూరంగా ఉండాలి. వీటితో పాటు కెఫిన్ వంటి పదార్థాలకు కూడా దూరంగా ఉండాలి. మీ జీవనశైలిని కూడా మార్చుకోవాలి. కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలి. పిల్లలతో ఎక్కువ సమయం గడుపుతూ వాళ్లు పనులు చేయండి. ఇవన్ని చేసినా డిప్రెషన్ నుంచి బయటపడలేదనిపిస్తే వెంటనే సైకియాట్రిస్ట్‌ను సంప్రదించాలి. లేకపోతే మానసికంగా మీరు ఎన్నో సమస్యలను ఎదుర్కొవలసి వస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.