
Chanakya Niti: ఆచార్య చాణక్యుడు మనకు ఎన్నో నీతి విషయాలు చెప్పాడు. అతడు రచించిన నీతి శాస్త్రంలో మనుషులు ఎలా ప్రవర్తించాలనే దాని మీద పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. మనం జీవితంలో ఎవరినైనా గుడ్డిగా నమ్ముతుంటాం. కానీ ఎవరినైనా నమ్ము ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. మనకు చిన్నప్పడు తెలుగులో ఓ పాఠం ఉండేది. కొత్తగా వచ్చిన వారిని నమ్మరాదు. ఎవరినైనా నమ్మే ముందు వారి గుణగణాలు చూడాలి.
ఎవరిని నమ్మాలో..
చాణక్యుడు ఎవరిని నమ్మాలనే దాని మీద మొదట త్యాగం, రెండోది పాత్ర, మూడోది లక్షణాలు, నాలుగోది కర్మలను చూడటం వంటి వాటిని పరిగణనలోకి తీసుకోవడం మంచిది. ప్రతి వారిలో మంచి, చెడు రెండు దాగి ఉంటాయి. అవసరమైన సందర్భంలో అవి బయటకు వస్తాయి. సోమరితం, గర్వం, తరచుగా అబద్ధం చెప్పే వారిని నమ్మకూడదు. ఇలాంటి చెడు గుణాలున్న వారిని దూరంగా ఉంచడమే శ్రేయస్కరం. ఈ నేపథ్యంలో ఇలాంటి చెడు స్వభావం కలవారిని దూరంగా ఉంచడమ మంచిది.

ప్రశాంతంగా..
జీవితంలో ప్రశాంతంగా ఉండాలి. గంభీరంగా వ్యవహరించాలి. కుండబద్ధలు కొట్టినట్లు మాట్లాడే వారిని నమ్మొచ్చు. వారే సన్మార్గంలో నడుస్తారని చెబుతారు. అలాంటి వారినే విశ్వసించాలి. వారికే పనులు అప్పగించాలి. అప్పుడే మనకు లాభం కలుగుతుంది. మనం ఎదుటి వారిని నమ్మేటప్పుడు వారిలో త్యాగం చేసే గుణం ఎంత ఉందో పరీక్షించాలి. ఇతరుల జీవితాల్లో సంతోషం తెచ్చేందుకు తన ఆనందాన్ని కూడా త్యాగం చేసేందుకు రెడీగా ఉంటారో వారిని నమ్మడం ఉత్తమం.
ఇంట్లో ఎవరికి..
ఎవరినైనా మనం నమ్మాలంటే అతడికి తన కుటుంబంలో ఏ మేరకు స్థానం ఉందో తెలుసుకోవాలి. ఏ వ్యక్తికి అయితే ఇంట్లో మంచి స్థానం ఉంటుందో అలాంటి వారిని మన ఇంట్లో ఎలా వ్యవహరిస్తాడు? బయటి వారితో ఎలా నడుచుకుంటాడు? అనే విషయాలపై దృష్టి పెడితే అతడి గురించి మనకు అన్ని విషయాలు తెలుస్తాయి. దీంతో అతడికి మనం కూడా ఎలాంటి స్థానం పుమాయించాలో తెలిసిపోతుంది. కొందరికి డబ్బు ఎక్కువ ఇష్టముంటే మరికొందరికి డబ్బంటే చేదుగా ఉంటుంది. డబ్బుకు ఎక్కువ విలువ ఇస్తున్నాడంటే అతడికి నైతిక విలువలు లేవని తెలిసిపోతుంది.
డబ్బు ఖర్చు..
డబ్బు ఉంటే అతడు ఎలా ప్రవర్తిస్తాడో తెలియాలంటే అతడికి ముందే కొంత డబ్బు ఇస్తే సరిపోతుంది. దాన్ని అతడు సరైన సమయంలో మీకు ఇస్తే మంచివాడని అర్థం. లేదంటే చెడ్డవాడని నిర్ధారించుకోవచ్చు. ఇంకా కొందరు స్వార్థంతో తప్పుడు మార్గంలో సంపాదించేందుకు డబ్బును విచ్చలవిడిగా ఖర్చుపెడతారు. అలాంటి వారి విషయంలో జాగ్రత్త పడాలి.