Kavitha Income : 2018లో ఇళ్లే లేదు.. 2023లో ఇరవై లక్షల వాచ్‌.. కవిత బాగా కష్టపడుతోంది!

Kavitha Trolls : కల్వకుంట్ల వారి అమ్మాయి.. లిక్కర్‌ క్వీన్‌ బిరుదాంకితురాలు బతుకమ్మకు తానే బ్రాండ్‌ అంబాజిడర్‌ అని చెప్పుకునే కవిత ఇటీవల టీవీ చానెళ్లకు ఇంటర్వ్యూ ఇచ్చి విపక్షాలకు అడ్డంగా దొరికిపోయారు. నెటిజన్లు ట్రోల్స్, కామెంట్లకు హద్దు లేకుండా పోతోంది. తాజా ఇంటర్వ్యూలో ఆమె చెప్పిన మాటలను 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఓ న్యూస్‌ చానెల్‌కు ఇచిచ్చన ఇంటర్వ్యూను కలిపి ఓ వీడియో తయారు చేశాయి విపక్షాలు. ఆ వీడియో ఇప్పుడు నెట్టింట్లో తెగ […]

Written By: Raghava Rao Gara, Updated On : March 5, 2023 3:23 pm
Follow us on

Kavitha Trolls : కల్వకుంట్ల వారి అమ్మాయి.. లిక్కర్‌ క్వీన్‌ బిరుదాంకితురాలు బతుకమ్మకు తానే బ్రాండ్‌ అంబాజిడర్‌ అని చెప్పుకునే కవిత ఇటీవల టీవీ చానెళ్లకు ఇంటర్వ్యూ ఇచ్చి విపక్షాలకు అడ్డంగా దొరికిపోయారు. నెటిజన్లు ట్రోల్స్, కామెంట్లకు హద్దు లేకుండా పోతోంది. తాజా ఇంటర్వ్యూలో ఆమె చెప్పిన మాటలను 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఓ న్యూస్‌ చానెల్‌కు ఇచిచ్చన ఇంటర్వ్యూను కలిపి ఓ వీడియో తయారు చేశాయి విపక్షాలు. ఆ వీడియో ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్‌ అవుతోంది. సోషల్‌ మీడియా వేదికగా నెటిజన్లు కవితను ఓ ఆటాడేసుకుంటున్నారు.

నాడు సొంత ఇల్లే లేదన్న కవిత…
2018లో కేసీఆర్‌ ప్రభుత్వాన్ని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. ఆ సమయంలో కవిత నిజామాబాద్‌ ఎంపీగా ఉన్నారు. అప్పుడు టీఆర్‌ఎస్‌ను మళ్లీ అధికారంలోకి తెచ్చేందుకు కవిత, ఆమె సోదరుడు కేటీఆర్, మరో మంత్రి హరీశ్‌రావు మీడియాను పిలిచి మరీ ఇంటర్వ్యూలు ఇచ్చారు. అప్పుడు ఎన్‌టీవీకి కవిత ఇంటర్వ్యూ ఇచ్చారు. బతుకమ్మ బ్రాండ్‌ అంబాజిడర్‌ను ఇంటర్వ్యూ చేశారు. ఎన్‌టీవీ న్యూస్‌ రీడర్‌ రిషి. ఈ సందర్భంగా తెలంగాణలో టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాక కేసీఆర్‌ కుటుంబం మినహా ఎవరూ బాగుపడలేదన్న విపక్షాలు ఆరోపణలు వస్తున్నాయని తెలిపారు. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి రాకముందు అపార్టుమెంట్‌లో ఉన్న కవిత ఇప్పుడు విలల్లాలో ఉంటున్నారు. తెలంగాణ ప్రజలు పెరగలేదు కేసీఆర్‌ కుటుంబం మాత్రం పెరిగింది దీనికి గురించి ఏం మాట్లాడతారని ప్రశ్నించారు. స్పందించిన కవిత.. నవ్వుతూ.. ఇప్పుడు నేను ఉంటున్న ఇల్లు కూడా కిరాయి ఇల్లే అని చెప్పారు. నాకు సొంత ఇల్లు కూడా లేదని స్పష్టం చేశారు. అంటే తెలంగాణలో అధికారంలోకి వచ్చాక తాము ఏమీ సంపాదించుకోలేదని అర్థం వచ్చేలా మాట్లాడారు.

నేడు చేతికే రూ.20 లక్షల వాచ్‌…
తాజాగా మహిళా రిజర్వేషన్‌ బిల్లు కోసం భారత జాగృతి ఆధ్వర్యంలో ఈనెల 10న ఢిల్లీ జంతర్‌మంతర్‌ వద్ద దీక్ష చేయాలని ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న కవిత నిర్ణయించారు. దీనిపై ప్రచారం కోసం టీవీ9, ఎన్‌టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా టీవీ9 న్యూస్‌ రీడర్‌ ఆమెను అడిగిన ప్రశ్నకు కవిత చెప్పిన సమాధానంతో తెలంగాణ ప్రజల దిమ్మ తిరిగిపోయింది. ఇంటర్వ్యూ సందర్భంగా కవిత రూ.20 లక్షల ఖరీదైన వాచ్‌ ధరించి ఉన్నారు. ఇంత ఖరీదైన వాచ్‌ ఎవరు గిఫ్ట్‌ ఇచ్చారని ప్రశ్నించారు. దానికి నవ్విన కవిత.. ‘‘గిఫ్ట్‌ ఏంటడి.. నేను కొనుక్కున్నా’’ అన్నారు. అంతలోనే ‘‘మావారు మ్యారేజ్‌ డే, వ్యాలంటైన్స్‌డేకు గిఫ్ట్‌ ఇస్తారు’’ అని మాట మార్చారు. వెంటనే రజినీకాంత్‌ రూ.20 లక్షల ఖరీదైన గిఫ్ట్‌ ఇచ్చేంత సంపాదిస్తున్నారా అని అడిగారు. మళ్లీ కవిత నవ్వుతూ.. ‘‘కష్టపడాలండి.. చమడోడ్చాలి.. అప్పుడే డబ్బులు వస్తాయి.. మేం కష్టపడి సంపాదిస్తున్నాం’’ అని ఇంటర్వ్యూ చూస్తున్నవారంతా ఆశ్చర్యపోయే సామాధానం ఇచ్చారు. తర్వాత రజినీకాంత్‌.. ‘‘బంగారం షాప్‌కు వెళ్తే బంగారం కొనుకుంటున్నారు. డైమండ్‌ షాప్‌కు వెళ్తే డైమండ్స్‌ కొంటున్నారు. లగ్జరీ ఇళ్లు ఉన్నాయి.. లగ్జరీ కార్డు కూడా ఉన్నాయి’’ అని అడిగారు. మళ్లీ కవిత నవ్వుతూ.. ‘‘నేడు డబ్బులేని ఇంట్లో పుట్టలేదు.. నేను డబ్బు సంపాదించకుండా ఉండలేను.. తాను చేస్తున్న వ్యాపారాలు సక్సెస్‌ అవుతున్నాయి. డబ్బులు వస్తున్నాయి’’ వాటితోనే అన్నీ కొనుక్కుంటున్నా అని అర్థం వచ్చేలా సమాధానం ఇచ్చారు. అంతటితో ఆగకుండా లిక్కర్‌ క్వీన్‌ బిరుదాంకితురాలు.. ‘‘నాకు నటించడం రాదు.. నటించే అలవాటు నాకు లేదు.. నేనేదో పేదరాలిని.. నేను కమ్మలు పెట్టుకోను.. నేను వాచ్‌ పెట్టుకోను అని చెప్పవాళ్లలా నటన నాకురాదు’’ అని పేర్కొన్నారు.

ఈ సమాధానాలేపైనే నెట్టింట్లో ప్రశ్నల వర్షం..
కవిత 2018, 2020లో న్యూస్‌ చానెళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పిన సమాధానాలే ఇప్పడు నెటిజన్ల ట్రోల్‌కు కారణమయ్యాయి. నాడు ఇళ్లే లేదన్న కవిత ఇప్పుడు రూ.20 లక్షల వాచ్‌ ఎలా వచ్చిందని కొందరు.. వ్యాపారం చేస్తే ఇంట డబ్బులు ఎలా వస్తాయో మాకూ చెప్పాలని ఇంకొందరు.. రూ.20 లక్షల గిఫ్ట్‌లు ఇచ్చే కుర్రాళ్లు ఉంటే తమ కూతురును ఇస్తాం పెళ్లి సబంధం చూడండని మరికొందరు కామెంట్స్‌ చేస్తున్నారు.

నిజమే కదా.. 2019లో జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లోల ఓడిపోయిన కవిత ఏడాదిపాటు ఖాళీగా ఉన్నారు. 2021లో కూతుర్ను ఎమ్మెల్సీ చేశారు కేసీఆర్‌. రెండేళ్ల ఎమ్మెల్సీ పదవితో వచ్చే జీతం ఎంత.. ఖర్చెంత.. అవన్నీ అలా ఉంటే.. ‘‘2018లో ఇళ్లు లేని నిరుపేద కవిత.. ఐదేళ్లలో ఖరీదైన కార్లు, విల్లాలు, ఫోన్లు, బంగారం, డైమండ్స్‌ కొనుక్నునేంత’’ ఆదాయం వచ్చే వ్యాపారాలు చెప్పాలని నెటిజట్లు ట్రోల్‌ చేస్తున్నారు.