
Lemon Leaves : మనం నిమ్మకాయను తరచుగా వాడుతుంటాం. ఎండాకాలంలో అయితే నిమ్మకాయ షర్బత్ తాగితే ఎంతో హాయిగా అనిపిస్తుంది. ఇలా నిమ్మకాయ మనకు ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుందో నిమ్మ ఆకులు కూడా మన ఆరోగ్యాన్ని కాపాడతాయన్న సంగతి చాలా మందికి తెలియదు. నిమ్మ ఆకులు చేదుగా ఉంటాయి. అందుకే తినడానికి ఇష్టపడరు. నిమ్మ ఆకులను తినడం ద్వారా వాసన చూడటం వల్ల లాభాలు ఉంటాయి. నిమ్మ ఆకుల జ్యూస్ కూడా చేసుకుని తాగొచ్చు.
ఇందులో ఏముంటాయి?
నిమ్మ ఆకుల్లో యాంటీ వైరల్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటిల్లో అల్కలాయిడ్స్, టానిన్లు, ప్లేవనాయిడ్స్, ఫినాలిక్ ఎలిమెంట్లు ఉన్నాయి. దీంతో పాటు కార్బొహైడ్రేడ్లు, కొవ్వులు, పోషకాలు సమృద్ధిగా కనిపిస్తాయి. యాంటెల్మింటిక్, యాంటీ ప్లాట్యులెంట్, యాంటీ మైక్రో బయల్, యాంటీ క్యాన్సర్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రభావాలు ఉన్నాయి. దీంతో రోగాల బారి నుంచి రక్షిస్తున్నాయి. మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. నిమ్మ ఆకుల్లో ఉండే సహజమైన గుణాలతో మనకు ఎంతో మేలు కలిగిస్తున్నాయి.
వేటిని దూరం చేస్తాయి?
నిమ్మ ఆకుల్లో ఉండే సిట్రిక్ యాసిడ్లు కిడ్నీల్లో రాళ్లు రాకుండా చేస్తాయి. మైగ్రేన్ తలనొప్పిని నియంత్రిస్తుంది. నిమ్మ ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఉండటంతో ఒత్తిడిని తగ్గిస్తాయి. మైగ్రేన్ తలనొప్పిని నివారించడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. నిమ్మ ఆకుల్లో ఉండే సిట్రిక్ యాసిడ్, అల్కలాయిడ్స్ నుంచి నిద్రకు సాయపడతాయి.

బరువు తగ్గేందుకు..
బరువు తగ్గాలనుకునే వారికి నిమ్మ ఆకులు బాగా ఉపయోగపడతాయి నిమ్మ ఆకుల నుంచి తయారైన జ్యూస్ లో క్రిమిసంహారక గుణాలు ఉండటం వల్ల కడుపులోని నులిపురుగులు లేకుండా చేస్తుంది. నిమ్మ ఆకుల రసంలో తేనె కలిపి తీసుకుంటే ఎంతో మేలు కలుగుతుంది. నిమ్మ ఆకులు కూడా మనకు మంచి ఔషధాలు కలిగించే గుణాలు ఎన్నో ఉన్నాయి. ఈ నేపథ్యంలో నిమ్మ ఆకులతో మనకు లభించే ప్రయోజనాలు తెలియడంతో వాటిని వాడుకుని మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.