
Mohammed Shami IPL2023: తొలి వికెట్, 50వ వికెట్, 100వ వికెట్… ఇలా అన్ని క్లీన్ బౌల్డ్ లే. బహుశా ఈ రికార్డు ఎవరికి సాధ్యం కాకపోవచ్చు. అందుకే షమీ బౌల్డ్ ల రారాజుగా వెలుగొందుతున్నాడు. అటు సొంత జట్టు ఆటగాళ్లు, ఇటు నెటిజన్ల తో వీరలెవల్లో ప్రశంసలు అందుకుంటున్నాడు.
గుజరాత్ టైటాన్స్ జట్టు బౌలింగ్ దళం బరువును మొత్తం షమీనే మోస్తున్నాడు. గత సీజన్లో తాను ఏంటో నిరూపించుకున్నాడు. జట్టు కప్పు సాధించడంలో తన వంతు పాత్ర పోషించాడు.. బౌలింగ్లో వైవిధ్యం ప్రదర్శించే షమీ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్ 2023 సీజన్ లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన తొలి మ్యాచ్లో…క్యాష్ రిచ్ లీగ్ లో 100 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు.. చెన్నై జట్టు ఓపెనర్ కాన్వే ను ఔట్ చేయడం ద్వారా ఈ సీజన్లో తొలి వికెట్ తీసిన బౌలర్గా రికార్డు సృష్టించాడు. కాన్వే ను బౌల్డ్ చేసి.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో వికెట్లలో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. షమీ వేసిన ఫుల్ డెలివరీని ఆడటం లో కాన్వే పూర్తిగా విఫలమయ్యాడు. దీంతో మిడిల్ వికెట్ తో పాటు, లెఫ్ట్ సైడ్ వికెట్ కూడా ఎగిరి పోయింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

గతంలో జహీర్ ఖాన్ కూడా ఇదే స్థాయిలో బౌలింగ్ చేసేవాడు.. అతడి ఫుల్ లెంగ్త్ డెలివరీలు కూడా ఇలాగే ఉండేవి. తుపాకి నుంచి దూసుకు వచ్చే బుల్లెట్ల మాదిరి బ్యాటర్ల మీదికి అమాంతం అలా వచ్చేవి.. బ్యాటర్ ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా వికెట్ల ను గిరాటేసేవి. ఇక షమీ కూడా జహీర్ ఖాన్ మాదిరే వేగంగా బౌలింగ్ చేస్తాడు. మొదట్లో జట్టులో కుదురుకునేందుకు ఇబ్బంది పడ్డ షమీ… ఆ తర్వాత రాటు దేలాడు. టీమిండియా ఎస్ బౌలర్లలో ఒకడిగా మారాడు.. ఇప్పుడు గుజరాత్ జట్టుకు కూడా ప్రధాన బలం అయ్యాడు. బ్యాటర్లకు స్వర్గధామం లా ఉండే ఐపీఎల్ లో 100 వికెట్లు తీయడం అంటే మామూలు విషయం కాదు.. అది కూడా క్లీన్ బౌల్డ్ రూపంలో.. ఇక షమీ ప్రదర్శన చూసి గుజరాత్ జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా హర్షం వ్యక్తం చేస్తున్నాడు. తమ తురుపు ముక్క అంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నాడు. షమీ వంద వికెట్లు తీసిన నేపథ్యంలో “నీ బంతికి ఎక్కడో సుడి ఉంది షమీ…లేకుంటే ఈ రికార్డు ఎలా సాధ్యమవుతుంది?” అంటూ నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.
A cracking delivery to get his 1⃣0⃣0⃣th IPL wicket 🔥🔥@MdShami11 picks the first wicket of #TATAIPL 2023!
Follow the match ▶️ https://t.co/61QLtsnj3J#GTvCSK pic.twitter.com/hN0qgJ2rFo
— IndianPremierLeague (@IPL) March 31, 2023