Functions : శుభకార్యాలకు వెళ్తున్నారా? ఈ వస్తువులను ఎట్టి పరిస్థితుల్లో బహమతిగా ఇవ్వకూడదు.. ఎందుకంటే?

బహుమతిగా ఇవ్వడానికి ఏదీ తోచనప్పుడు దేవళ్ల విగ్రహాలు ఇవ్వాలని చూస్తారు. కానీ దేవుళ్ల విగ్రహాలు బహుమతిగా ఇవ్వడం ద్వారా ఇచ్చిన వారికి తీసుకున్న వారికి మంచిది కాదని పండితులు చెబుతున్నారు

Written By: Chai Muchhata, Updated On : August 30, 2024 6:03 pm

Functions

Follow us on

Functions :  పెళ్లిళ్లు, శుభకార్యాలయాలకు వెళ్లినప్పుడు ఊరికే వెళ్లబుద్ది కాదు. వారిని సంతృప్తి పరచడానికి నగదును చదివిస్తూ ఉంటారు. ఇంప్రెస్ చేయడానికి బహుమతులు ఇస్తుంటారు. అయితే ఆకర్షణీయంగా ఉండాలని వారి కోసం ఇచ్చే బహుమతి కోసం ఒక్కోసారి గంటల తరబడి సమయం పోతుంది. చివరికి చేసేదీ ఏం లేక ఏదో ఒకటి తీసుకుంటూ ఉంటారు. అయితే బహుమతి ఇచ్చే విషయంలో జాగ్రత్తగా ఉండాలని కొందరు పండితులు చెబుతున్నారు. ఎందుకంటే కొన్ని వస్తువులు బహుమతిగా ఇవ్వడం వల్ల ఇచ్చేవారికి, తీసుకున్న వారికి నష్టాలు జరిగే అవకాశం ఉందని కొందరు పండితులు హెచ్చరిస్తున్నారు. అలాగే కొన్ని వస్తువులను ఉచితంగా ఇతరులకు ఇవ్వరాదని చెబుతున్నారు. ఇంతకీ ఏ వస్తువులుబహుమతిగా ఇవ్వకూడదు? ఇస్తే ఏం జరుగుతుంది?

బహుమతిగా ఇవ్వడానికి ఏదీ తోచనప్పుడు దేవళ్ల విగ్రహాలు ఇవ్వాలని చూస్తారు. కానీ దేవుళ్ల విగ్రహాలు బహుమతిగా ఇవ్వడం ద్వారా ఇచ్చిన వారికి తీసుకున్న వారికి మంచిది కాదని పండితులు చెబుతున్నారు. అంతేకాకుండా దేవుళ్ల విగ్రహాలు అరచేతిలో పట్టే కంటే పెద్దగా ఉండకూడదని అంటున్నారు. అలాగే కొందరు కత్తులు, ఇనుప వస్తువులు కూడా బహుమతిని ఇస్తారు. ఇలా ఇవ్వడం వల్ల గొడవలు జరుగుతాయి. ఇక డ్రెస్సులకు సంబంధించిన క్లాత్ ను గిప్ట్ గా తీసుకెళ్లడం ద్వారా వారికి దూరమవుతుారు.

చిన్నారుల పుట్టిన రోజు సందర్భంగా కొందరు పెన్నులు, పుస్తకాలు వారికి బహుమతిగా ఇస్తుంటారు. ఇలా ఇవ్వడం వల్ల వారి చదువులో ఆటంకాలు ఏర్పడుతాయి. వీటి స్థానంలో బొమ్మలు ఇవ్వాలి. అలాగే శుభకార్యాలయాల్లో కొందరు అక్వేరియం బహుమతిగా ఇస్తుంటారు. ఇవి ఇచ్చిన వారితో పాటు.. తీసుకున్న వారి ఇంట్లో ప్రతికూ వాతావరణం కల్పిస్తుంది. వీరిద్దరి మధ్య గొడవలు ఏర్పడుతాయి. అందువల్ల ఇలాంటి వస్తువుల జోలికి వెళ్లకుండా ఉండడమే మంచిది. కొంత మంది డబ్బును నిల్వ చేసే వస్తువులు ఇవ్వాలని చూస్తారు. పర్సులు, బాక్సులు ఇస్తుంటారు. ఇలా ఇవ్వడం వల్ల ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటారు. ముఖ్యంగా ఇవి శుభకార్యాల్లో ఇవ్వడం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహిస్తుందని అంటున్నారు.

ఇంటి పక్కన ఉన్నవారు.. సమీపంలో ఉన్న వారు కొన్ని వస్తువుల కోసం ఇతరులన సంప్రదిస్తుంటారు. కొందరు చట్నీ కావాలని అడుగుతారు. అయతే చట్నీలో ఉప్పు ఎక్కువగా ఉంటుంది. దీనిని ఇతరులకు ఇవ్వడం వల్ల ఇంట్లో సమస్యలు వస్తాయి. అయితే ఇలా
ఇవ్వాలనుకున్నప్పుడు వారి దగ్గన నుంచి ఒక రూపాయి అయినా తీసుకోండి. అప్పుడు ఎలాంటి సమస్య ఉండదు. అలాగే శుక్రవారం నాడు ఉప్పు, రాత్రి సమయంలో నూనెను ఇతరులకు ఇవ్వ కూడదు. ఇలా ఇవ్వడం వల్ల ఇంట్లో లక్స్మీ వారి చెంతకు చేరుతుందని అంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఇతరులకు చీపురు దానం ఇవ్వకూడదు.

బహుమతిని ఇవ్వాలనుకున్నప్పుడు ఆకర్షణీయమైన వస్తువులు మాత్రమే ఉండాలి. లేదా వారి అవసరాలకు తగిన విధంగా నగదును బహుమతిగా ఇవ్వొచ్చు అని అంటున్నారు. ఇలా కాకుండా పైన చెప్పిన వస్తువులు బహుమతిగా ఇవ్వడం వల్ల సమస్యలు ఎదుర్కొంటారు. అంతేకాకుండా ఆర్థికంగా నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు.