Airbus Beluga Hyderabad: ప్రపంచ వ్యాప్తంగా అనేక విమానాలు ఉన్నాయి. వివిధ కంపెనీలు వీటిని నిర్వహిస్తున్నాయి. అమెరికా, రష్యా, జపాన్, జర్మనీ, యూకే లాంటి దేశాల్లో సంపన్నులు చాలా మంది వ్యక్తిగత విమానాలు కూడా వాడుతున్నారు. మన దేశంలో కూడా అంబానీ, అదానీ లాంటి వారు వ్యక్తిగత విమానాలు వాడుతున్నారు. తెలంగాణలో అధికారంలో ఉన్న సమయంలో కేసీఆర్ కూడా విమానం కొనుగోలు చేయాలి భావించారు. ఈ విమానాలన్నీ సాధారణమే. కానీ, ప్రపచంలోనే అతిపెద్ద కార్గో విమానాలలో ఒకటైన ఎయిర్‌బస్ బెలూగా, “వేల్ ఆఫ్ ది స్కై” అని కూడా పిలుస్తారు. తిమింగలాల్లో బెలూగా జాతి తిమింగలాలు ఉన్నాయి. వాటి ఆకారంలోనే ఈ విమానాన్ని తయారుచేశారు. అందుకే దీనికి ఆ పేరు పెట్టారు. దీనిని ఆకాశ తిమింగలం అంటున్నారు. ఈ విమానం శుక్రవారం(ఆగస్టు 30)న తెల్లవారుజామున హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. ఎయిర్‌బస్ A300-608ST బెలూగా, ‘BCO4003’ అనే కాల్‌సైన్‌తో మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాత్రి 7.27 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) బయలుదేరింది. తర్వాత ఆగస్టు 30న తెల్లవారుజామున 12.23 గంటలకు హైదరాబాద్ చేరుకుంది. ఈ విమానం ఆగస్టు 27న ఫ్రాన్స్‌లోని టౌలౌస్ నుంచి బయలుదేరి ఫ్రాన్స్‌లోని మార్సెయిల్‌లో దిగింది. ఆగస్టు 28న తన ప్రయాణం కొనసాగించి ఈజిప్టులోని కైరోలో దిగింది. ఆగస్టు 29న కైరో నుంచి బయలుదేరి ఒమన్‌లోని మస్కట్‌లో దిగి అక్కడి నుంచి హైదరాబాద్‌కు చేరుకుంది.
హైదరాబాద్‌కు మూడోసారి..
అతిపెద్ద విమానం హైదరాబాద్‌కు రావడం ఇంది రెండోసారి. ఎయిర్‌బస్ బెలూగా, “వేల్ ఆఫ్ ది స్కై” గతంలో 2022 డిసెంబర్‌లో మొదటిసారి మైదరాబాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చింది. తర్వాత 2023 ఆగస్టులో రెండోసారి రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. తాజాగా 2024, ఆగస్టు 30న మరోసారి వచ్చింది. శుక్రవారం(ఆగస్టు 30) మధ్యాహ‍్నం 3 గంటలకు శంషాబాద్ నుంచి థాయిలాండ్ బయల్దేరి వెళ్లింది.
ఎయిర్‌బస్ బెలూగా ప్రత్యేకతలు ఇవీ..
ఎయిర్‌బస్ ప్రకారం.. విమానం 1,400 క్యూబిక్ మీటర్ల పెద్ద కార్గో హోల్డ్. గరిష్టంగా 47 టన్నుల పేలోడ్‌తో ప్రత్యేకమైన బల్బస్ ఫ్యూజ్‌లేజ్‌ను కలిగి ఉంది. రెండు జనరల్ ఎలక్ట్రిక్ CF6-80C2A8 ఇంజిన్‌లతో పనిచేస్తుంది. ఇది 750 km/h క్రూజింగ్ వేగాన్ని చేరుకోగలదు. 4,632 కిలోమీటర్ల పరిధిని కలిగి ఉంది. 1995లో మొదటిసారిగా దీనిని ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి అనేక ప్రయోగాలు చేస్తూ, సామర్థ్యం పెంచుకుంటూ వస్తోంది. ప్రామాణిక కార్గో విమానాలు నిర్వహించలేని పెద్ద, భారీ వస్తువులను రవాణా చేయడానికి బెలూగాను వినియోగిస్తున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో ఎయిర్‌క్రాఫ్ట్ ఆంటోనోవ్ ఏఎన్-225 మే 2016లో హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో తొలిసారిగా ల్యాండింగ్ అయింది. దానికి మించిన బరువును బెలూగా తరలించగలదు.