Jo root: తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ జట్టు శ్రీలంక బౌలర్ల ధాటికి 42 పరుగులకే రెండు వికెట్ల కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో క్రీజు లోకి వచ్చిన రూట్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. శ్రీలంక బౌలర్లను ఎదుర్కొంటూ 143 రన్స్ చేశాడు. ఈ సెంచరీ ద్వారా ప్రస్తుత క్రికెటర్లలో అత్యధిక శతకాలు బాదిన రెండవ ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఈ రికార్డు అంతకుముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (48) పేరు మీద ఉండేది. ఈ జాబితాలో టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ (80) అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు..కుక్(33) ఇంగ్లాండ్ జట్టు తరఫున అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా ఉండగా.. ప్రస్తుతం అతడి స్థానంలో సమంగా రూట్ (33) నిలిచాడు. రూట్ తర్వాత కెన్ పీటర్సన్ (23) కొనసాగుతున్నాడు. ఇంగ్లాండ్ జట్టు తరఫున అత్యధిక శతకాలు బాదిన టాప్ -3 ఆటగాళ్లల్లో కుక్, రూట్, పీటర్సన్ కొనసాగుతున్నారు.. శ్రీలంక జట్టుపై 143 పరుగులు చేసిన నేపథ్యంలో.. తన అద్భుతమైన సెంచరీని తన బ్యాటింగ్ మాజీ మెంటార్, స్నేహితుడైన గ్రాహం తోర్ప్ కు రూట్ అంకితం ఇచ్చాడు. ఇటీవల గ్రాహం కన్నుమూశాడు. 145 టెస్ట్ మ్యాచ్ లలో 12274 రన్స్ చేశాడు. ఇందులో 33 సెంచరీలు ఉన్నాయి. 5 డబుల్ సెంచరీలు, 64 అర్థ సెంచరీలు సాధించాడు. 171 వన్డేలు ఆడి 6522 రన్స్ చేశాడు. ఇందులో 16 సెంచరీలు, 39 అర్థ సెంచరీలు ఉన్నాయి.. 2020 వరకు రూట్ టెస్ట్ లలో 17 సెంచరీలు మాత్రమే సాధించాడు. ఆ తర్వాత అతడు ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. ప్రత్యర్థి బౌలర్ల పాలిట సింహ స్వప్నం లాగా మారిపోయి పరుగుల మీద పరుగులు చేస్తున్నాడు. నాలుగు సంవత్సరాల వ్యవధిలో ఏకంగా 16 సెంచరీలు చేశాడంటే..రూట్ బ్యాటింగ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్ లో శ్రీలంక బౌలర్లు ప్రారంభంలో కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. రూట్, అట్కిన్సన్ మైదానంలోకి వచ్చిన తర్వాత శ్రీలంక బౌలర్లు చేతులెత్తేశారు. వీరిద్దరూ ధాటిగా బ్యాటింగ్ చేస్తూ.. శ్రీలంక బౌలర్లకు చుక్కలు చూపించారు. వీరిద్దరి వీరోచిత బ్యాటింగ్ ఫలితంగా శ్రీలంక జట్టు భారీ స్కోర్ సాధించింది.. డకెట్ 40, హ్యారీ బ్రూక్ 33 రన్స్ చేసి ఇంగ్లాండ్ భారీ స్కోర్ చేయడంలో తమ వంతు పాత్ర పోషించారు. లారెన్స్(9), పోప్(1), వోక్స్(6) పూర్తిగా నిరాశపరిచారు. ఇక శ్రీలంక బౌలర్లలో అసిత ఫెర్నాండో ఐదు వికెట్లు పడగొట్టాడు. మిలన్ రత్నాయక్, లాహిరు కుమార చెరో రెండు వికెట్లు దక్కించుకున్నారు.