https://oktelugu.com/

These Four Zodiac: ఈ నాలుగు రాశుల వారు అదృష్టవంతులు.. వీరిపై నిత్యం లక్ష్మీదేవి అనుగ్రహం.. అవే రాశులంటే?

దీపావలి పర్వదినాన లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేయడం వల్ల తమ జీవితం సంతోషంగా ఉంటుందని భావిస్తారు. వ్యాపారులకు అధిక లాభాలు వస్తాయని చెబుతారు. ఉద్యోగులు అత్యున్నత శిఖరాలకు వెళ్లడానికి అవకాశం ఉంటుందని చెబుతారు. ఈ క్రమంలో అశ్వయుజ మాసంలో వచ్చే దీపావళి వేడుకలను ఘనంగా నిర్వహించుకుంటారు.

Written By:
  • Srinivas
  • , Updated On : November 1, 2024 / 01:23 PM IST

    Zodiac

    Follow us on

    These Four Zodiac: జీవితంలో అత్యున్నతస్థాయిలో ఉండాలని అనుకునే వారు లక్ష్మీ కటాక్షం పొందాలని కోరుకుంటారు. లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే పట్టిందల్లా బంగారమే అవుతుందని చాలా మంది భావిస్తారు.ఇందుకోసం ప్రతిరోజూ లక్ష్మీదేవికి పూజలు చేసేవారు ఎందరో ఉన్నారు. మరికొందరు వారం వారం లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలని చూస్తారు. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాశుల వారు లక్ష్మీదేవికి పూజలు చేయకున్నా.. వారిపై అనుగ్రహం ఉంటుంది. అందుకే కొందరు ఏ పని చేపట్టినా విజయం సాధిస్తారు. ధనం కోసం కొంచెం కష్టపడితే చాలు ఐశ్వర్యవంతులవుతారు. మిగతా రాశులపై లక్ష్మీ అప్పుడప్పుడు కరుణిస్తే ఈ రాశులపై మాత్రం ఏడాది పాటు చల్లని చూపు ఉంటుందని పండితులు అంటున్నారు. ఇంతకీ ఆ అదృష్టమైన రాశులు ఏవో తెలుసుకోవాలని ఉందా? అయితే ఈ వివరాల్లోకి వెళ్లండి..

    దీపావలి పర్వదినాన లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేయడం వల్ల తమ జీవితం సంతోషంగా ఉంటుందని భావిస్తారు. వ్యాపారులకు అధిక లాభాలు వస్తాయని చెబుతారు. ఉద్యోగులు అత్యున్నత శిఖరాలకు వెళ్లడానికి అవకాశం ఉంటుందని చెబుతారు. ఈ క్రమంలో అశ్వయుజ మాసంలో వచ్చే దీపావళి వేడుకలను ఘనంగా నిర్వహించుకుంటారు. ఈరోజంతా లక్ష్మీదేవి అమ్మవారిని కొలుస్తూ ఆ మాతా అనుగ్రహం పొందుతారు.అయితే ఈ రాశుల వారు కనుగ లక్ష్మీదేవి పూజలు చేస్తే వెంటనే అనుగ్రహిస్తుందని అంటున్నారు.

    జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కర్కాటక రాశిపై లక్ష్మీదేవి అనుగ్రహం నిత్యం ఉండనుంది. ఈ రాశి వారు 365 రోజులు ఎక్కువగా సంతోషంగా ఉంటారు. ఎందుకంటే వీరిపై లక్ష్మీదేవి చూపు ఉంటుంది. కొన్ని పనులకు ఆటంకాలు ఎదురైనా తిరిగి అవి పుంజుకుంటాయి. వ్యాపారులు అనుకున్న స్థాయిలో విజయం సాధిస్తూ ఉంటారు.

    వృషభ రాశి వారికి లక్ష్మీదేవి అనుకూలంగా ఉంటుంది. వీరు ఏ పని చేపట్టినా లక్ష్యాన్ని పూర్తి చేస్తారు. వ్యాపారులు నిత్యం కొత్త పెట్టుబడులు పెడుతూ ఊహించని లాభాలు పొందుతారు. ఉద్యోగుల ప్రమోషన్ పొందుతూ ఉంటారు.కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా ఉంటారు. అయితే కొందరు వ్యక్తులు వీరిని తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అందువల్ల జాగ్రత్తగా ఉండాలి.

    తులా రాశి వారి జీవితంపై లక్ష్మీదేవి నిత్యం గమనిస్తూ ఉంటుంది. కొందరు ఊహించని విధంగా ఐశ్వర్యవంతులుగా మారుతారు. కష్టపడి పనిచేయడం వల్ల జీవితంలో అనుకున్నది సాధిస్తారు. వీరు ఏ పని మొదలు పెట్టినా అది విజయవంతంగా పూర్తవుతుంది. అయితే మాటలను అదుపులో ఉంచుకోవాలి. వాగ్వాదాల విషయంలో దూరంగా ఉండాలి.

    సింహా రాశి వారి గురించి లక్ష్మీ దేవి గమనిస్తూ ఉంటుంది. వీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నా.. వీరికి దేవి తోడుగా ఉంటుంది. కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేయడానికి సహకరిస్తుంది. అయితే కొన్ని పనుల్లో కష్టపడాల్సి వస్తుంది. అయినా పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. శత్రువుల బెడద ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారికి కోపం ఎక్కువగా ఉంటుంది. ఈ కారణంగా పనులు ఆలస్యం అవుతూ ఉంటాయి. వీటిని అధిగమించి నిత్యం లక్ష్మీ ఆరాధన చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి.