Devotional Tips: సాధారణంగా మన ఇంటి ఆవరణంలో చాలామంది ఎన్నో రకాల మొక్కలను పెంచుతూ ఉంటారు. ఇలా మొక్కలను పెంచడం వల్ల ఇంటికి ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుందని వివిధ రకాల మొక్కలను పెంచడం మనం చూస్తూ ఉంటాము.
అయితే మన ఇంటి ఆవరణంలో మొక్కలు ఏవి పడితే అది కాకుండా కొన్ని రకాల మొక్కలను పెంచడం వల్ల ఎంతో అదృష్టం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. మరి ఆ ఐదు రకాల మొక్కలు ఏవి అనే విషయానికి వస్తే…
తులసితో పాటు మరువం చెట్టు కూడా ఇంటిలో ఉండాలి. ఆధ్యాత్మిక పరంగా మరువం చెట్టు ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఈ చెట్టు ఆకులతో శనివారం శ్రీహరిని విష్ణుమూర్తిని పూజించడం వల్ల అష్టైశ్వర్యాలను కలిగిస్తుంది. అలాగే శుక్రవారం అమ్మవారికి పూజ చేయటం వల్ల దీర్ఘసుమంగళీ ప్రాప్తం కలుగుతుంది. కనుక మరువం చెట్టు ఇంట్లో ఉండడం ఎంతో ముఖ్యం.
వీటితో పాటు పసుపు మొక్కలు తప్పనిసరిగా ఇంటిలో ఉండాలని పండితులు సూచిస్తున్నారు. మనం పచ్చి పసుపును నాటడం వల్ల మొక్కలు వృద్ధిచెందుతాయి ఆ మొక్కలు ఇంట్లో ఉండటం మన ఆర్థిక అభివృద్ధికి సంకేతం. అలాగే ఈ పసుపుతో వెంకటేశ్వర స్వామికి అర్చన చేయడం లేదా శుక్రవారం అమ్మవారికి అర్చన చేయడం, ఆ పసుపు మొత్తం అరగదీసి దానితో దీపం వెలిగించడం వల్ల అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. అందుకే పసుపు మొక్కలు కూడా ఇంట్లో తప్పనిసరిగా ఉండాలి. వీటితోపాటు సువాసనలు వెదజల్లే పుష్పాలు మల్లె పువ్వుల చెట్లు ఇంట్లో ఉండాలి. అదేవిధంగా భగవంతుడికి ఎంతో ప్రీతికరమైన ఎర్రమందారం చెట్లను కూడా ఇంటిలో పెట్టుకోవాలి. ఈ ఐదు రకాల మొక్కలు ఇంట్లో ఉంటే నిత్యం ఆ కుటుంబంలో ఐశ్వర్యం, ఆనందం, సౌభాగ్యం కలిగి ఉంటాయని పండితులు చెబుతున్నారు.