నూతన సంవత్సరం
ఊసులు జరిగిపోయిన గతం
భవిష్యత్ కు ఆశల స్వాగతం
మారాలి మన స్వగతం
ఆకాంక్షలకు తెరవాలి మనోగతం
ప్రతిబింబించాలి మన ఆలోచనల రథం
తీర్చుకోవాలి కోరికలు సర్వస్వం..
కొత్త సంవత్సరానికి మనం ఎన్నో ఆశలతో స్వాగతం పలుకుతుంటాం. పోయిన సంవత్సరం లాగా కాకుండా ఇంకా ఎన్నో అనుభవాలు మన సొంతం కావాలని ఆకాంక్షిస్తుంటాం. రాత్రంతా మెలకువగా ఉండి గత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ రాబోయే సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ కేరింతలు కొడుతూ నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకోవడం ఆనవాయితీ. కుర్ర కారు నుంచి వృద్ధుల వరకు అందరు కూడా నూతన సంవత్సర వేడుకల్లో ఆనందోత్సాహాలతో పాలుపంచుకుంటాం.

మారుతున్న కాలక్రమంలో గతించిన వాటిని నెమరు వేసుకుంటూ భవిష్యత్ శుభాల కోసం కలలు కంటుంటాం. మనోబలం పెంచుకుంటూ మంచిని ఆస్వాదిస్తూ చెడును దూరం చేస్తూ మన గమ్యాన్ని నిర్దేశించుకోవాలి. ఇందుకోసం సమగ్ర ప్రణాళిక రూపొందించుకోవాలి. రోజురోజుకు మనలో మార్పులు తెచ్చుకునేందుకు ప్రయత్నించాలి. అప్పుడే మనం అనుకున్నది సాధించే అవకాశం ఉంటుంది.
మహాభారతంలో పాండవులు వనవాసం చేసినా చివరకు అధికారం వారిదే అవుతుంది. అంటే ధర్మమే చివరకు గెలుస్తుంది. అధర్మమే అధోగతి పాలవుతుంది. అందుకే ధర్మం ఆచరిస్తేనే మనకు అన్ని మంచి పనులు ఎదురవుతాయి. అధర్మం వెంట పడితే మనకు ఆపదలే ఎదురొస్తాయి. నీతి, ధర్మం, న్యాయం అన్ని మనకు మంచినే ఇస్తాయి. ఈ విషయాలు తెలుసుకుని మసలుకుంటే విజయం మనదే అవుతుంది.
Also Read: Happy New Year 2022 Wishes, Images, Greetings, Quotes, Messages in Telugu
ఇదే తరుణంలో మన సంస్కృతి, సంప్రదాయాలను కూడా గౌరవించాలి. ప్రతి సంవత్సరం ఏదో క్యాలెండర్ మార్చినట్లు కాకుండా మన ఆచార వ్యవహారాలను తూచ తప్పకుండా పాటిస్తూ మన పూర్వీకులు చేసిన వాటిని మనం కూడా ఆచరించాలి. అప్పడే గతించిన వాటిని మనం నెమరు వేసుకున్నట్లు అన్నమాట. రానున్న కాలం ఆనందంగా ఉండాలని ఎలా కోరుకుంటామో గతించిన కాలం కూడా పదిలంగా ఉండాలని భావించాలి.
కాలగమనంలో వైవిధ్యాలను మనం స్వాగతిస్తున్నాం. ఆశలు, ఆశయాలను కూడా మనం గుండెల నిండా నింపుకుని మధురానుభూతిగా పదిలం చేసుకోవాలి. కొత్త ఏడాది ఆనందోత్సవాలను వ్యక్తీకరిస్తూ మానవాళికి సామరస్యం వెల్లివిరియాలని కోరుకుంటాం. ఈ నేపథ్యంలో భవిష్యత్ ను బంగారం చేసుకుంటూ గతాన్ని కలగా దాచుకుంటూ ముందుకు సాగిపోవడంలోనే మన ప్రవర్తన సాగిపోవాల్సిందే.
Also Read: న్యూఇయర్ పై ఒమిక్రాన్ ఎఫెక్ట్: ఆంక్షల మధ్యే సెలబ్రెషన్స్..!