Sudhamurthy for a hassle-free Kapura: దాంపత్య జీవితం చాలా అందమైనది. ఇద్దరు భాగస్వాముల మద్య పరప్పర అవగాహన ఉంటే వీరు ఎంతో సంతోషంగా ఉంటారు. ఒకరిపై ఒకరుపెత్తనం చెలాయించాలని అనుకుంటే క్షణం ఒక గండంలా సాగుతుంది. దంపతులు చిన్న చిన్న విషయాలపై గొడవలు పడకుండా ఆనందంగా ఉండాలని చాలా మంది అవగాహన కల్పిస్తున్నారు. అయినా చాలా మంది ఏదో ఒక విషయంలో గొడవపడుతూనే ఉంటున్నారు. ఈ నేపథ్యంలో కొందరు ప్రముఖులు భార్యభర్తలు ఎలా ఉండాలో సూచిస్తున్నారు. తాజాగా ఇన్ఫోసిస్ అధినేత నారాయణ మూర్తి సతమణి సుధామూర్తి కలతలు లేని కాపురం సజావుగా సాగాలంటే కొన్ని టిప్స్ పాటించాలని చెప్పారు. వాటి వివరాల్లోకి వెళితే..
ప్రముఖ సాప్ట్ వేర్ కంపెనీ Infosyz అధినేత నారాయణ మూర్తి సతీమణి సుధామూర్తి సమాజ సేవకురాలు. ఈమె కంప్యూటర్ ఇంజినీర్ గా జీవితాన్ని ప్రారంభించి ‘గేట్స్ ఫౌండేషన్’ ద్వారా ప్రజారోగ్య విభాగాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. హార్వర్డ్ విశ్వ విద్యాలయంలో ‘ది మూర్తి క్లాసికల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా’ను ప్రారంభించి కొన్ని రచనలు చేశారు. ఈమె రచించిన ‘డాలర్ సోసె’ అనే నవలపై 2001లో జీ టీవీలో సీరియల్ గా ప్రసారమైంది. సుధామూర్తి చేసిన సేవలకు గానే భారత ప్రభుత్వం 2006లో పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. అలాగే 2024లో ఆమె రాజ్యసభకు నామినేట్ అయ్యారు.
అయితే దాంపత్య జీవితానికి సంబంధించిన కొన్ని టిప్స్ ను సుధామూర్తి ప్రజలకు అందించారు. సంసార జీవితం కలతలు లేకుండా ఉండడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటుందని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. దీని కోసం కొన్ని టిప్స్ పాటించాలని చెప్పారు. ప్రతి కుటుంబంలో గొడవలు సహజం. అయితే దంపతుల మధ్య గొడవలు ఏర్పడినప్పుడు ఎవరో ఒకరు తగ్గాలి. ఇద్దరూ ఒకరిపై ఒకరు పై చేయి సాధించాలని అనుకుంటే అది పెద్దదిగా మారుతుంది. దీంతో ఇద్దరి జీవితాలు చిన్నా భిన్నం అవుతుంది. వీరికి పిల్లలు ఉంటే వీరి ప్రభావం వారిపై పడుతుంది.
కుటంబ బాధ్యతలు ఎవరో ఒకరిపై పడడం వల్ల మనశ్శాంతి కరువవుతుంది. దీంతో చికాకు కలిగి ప్రతి విషయానికి కొపం వస్తుంది. ఈ కారణంగా ఇతర మాటలతో గొడవలు ప్రారంభమై అది పెద్దదిగా మారే అవకాశం ఉంది. అందువల్ల కుటంబ బాధ్యతలను ఇద్దరూ పంచుకోవాలి. ఒకరి కోసం మరొకరు అన్నట్లు పనిచేసుకోవాలి. దీంతో ఇద్దరి మధ్య సాన్నిహిత్యం ఏర్పడి పనులు తొందరగా పూర్తవుతాయి. అలాగే బాధ్యతలు పంచుకోవడం వల్ల ఎవరిపై భారం పడకుండా ఆరోగ్యంగా ఉండగలుగుతారు.
దంపతుల్లో ఇద్దరు కొన్ని మంచి పనులు చేయొచ్చు. ఇలాంటి సందర్భంలో మంచి పనులు చేసిన వారిని గుర్తించాలి. వారిపై ప్రశంసలు కురిపించడం వల్ల ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. దీంతో మరింత ఉత్సాహంగా పనిచేయగలుగుతారు. అంతేకాకుండా వారిని ప్రశంసించడం వల్ల ఎదుటివారిపై నమ్మకం ఏర్పడుతుంది. అయితే చెడు పనులు చేసిన సమయంలో ధూషించి..మంచి పనులు చేసిననప్పుడు పట్టించుకోకపోవడం వల్ల ఇద్దరి మధ్య దూరం పెరుగుతుంది. అందువల్ల దంపతుల మధ్య ఎలాంటి గ్యాప్ రాకుండా చూసుకోవాలి.