https://oktelugu.com/

Money : సులభంగా డబ్బు సంపాదించవచ్చు. ఎలా అంటే?

డబ్బు సంపాదించడం చాలా కష్టం అని ఫీల్ అవుతున్నారా? కానీ, కొన్ని విధాలుగా ట్రై చేస్తే దీనిని ఈజీగానే పొందవచ్చు. ఏంటి ఎన్నో సంవత్సరాల నుంచి కష్టపడుతుంటే అవడం లేదు. జస్ట్ ఈజీ అంటున్నారు అని కోపం వచ్చిందా? కూల్. నిజంగానే ఈ గోల్ ను అచీవ్ చేయవచ్చు. డబ్బు సంపాదించాలని ప్రతి ఒక్కరూ అనుకోవడం కామన్. కానీ నిజంగానే దీన్ని అచీవ్ చేయడం కష్టం. అయితే కొంతమంది ఎంత కష్టపడినా డబ్బు సంసాదించలేరు. దానికి కారణాలు బోలెడు ఉంటాయి. జీవితంలో ఎక్కువగా డబ్బు సంపాదించి త్వరగా ఉన్నత స్థానానికి చేరుకోవాలి అనుకుంటున్నారా? అయితే కొన్ని టిప్స్ పాటిస్తే సరిపోతుంది. ఇంతకీ ఏంటా టిప్స్ అనేగా మీ క్యూరియాసిటీ. అయితే ఆలస్యం ఎందుకు చదివేసేయండి.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : November 6, 2024 / 11:27 PM IST

    Earn money easily. How do you mean?

    Follow us on

    Money : డబ్బు సంపాదించాలనుకోవడం ముందునుంచే ప్లాన్ చేసుకోవడం మొదటి పాయింట్. చిన్నతనం నుంచే సంపాదన మొదలుపెట్టడం అలవాటు చేసుకోవాలి. ఖర్చులు ఎంత, ఎంత సంపాదించాలి అనేవి మీకు ఒక అవగాహన ఉండాలి. దానికోసం ఎలాంటి దారులున్నాయి. ఇలా అన్నింటి గురించి ఆలోచించుకోవడం వల్ల మీ టాస్క్ చాలా సులభం అవుతుంది. ముందునుంచి ప్లాన్ చేయడం వల్ల సంపాదించడం కూడా ఈజీ అవుతుంది అంటున్నారు నిపుణులు. కొత్త కొత్త ప్రయత్నాలు చేయడం వల్ల మార్గం సులభం అవుతుంది బాస్.

    కొంతమంది తలకి మించిన భారాలు ఉంటాయి. అనవసరమైన అప్పులు చేయడం కూడా కామన్ గా జరుగుతుంటాయి. దీంతో వచ్చిన డబ్బు మొత్తం అప్పు కడుతుంటారు. కాబట్టి, అనవసరమైనవాటి గురించి అప్పు చేయడం మానుకోవడం మంచిది. లేదంటే జీవితం మొత్తం అప్పులు కట్టడానికే సరిపోతుంది. ముందు నుంచి జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. మీరు జాబ్ చేసినా, వ్యాపారం చేసినా వచ్చే డబ్బులో నెలకి కనీసం 15 శాతాం అయినా సేవ్ చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆ మనీ కొన్ని రోజులకి మంచి సేవింగ్ అవుతుంది.

    మన దగ్గర డబ్బు ఉంటే దేనికో ఒకదానికి ఖర్చు చేయడం కామన్. అందుకే సేవ్ చేయడం అలవాటు చేసుకోవాలి. దీనికోసం మీరు మీ జీతాన్ని పెంచుకునే మార్గాలు వెతకడం మంచిది. ఎక్స్‌ట్రా అవర్స్ డ్యూటీ చేయాలి. రెండో జాబ్, ఫ్రీలాన్సర్ వర్క్ చేయాలి. ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ కోసం కావాల్సిన కోర్సులు ఎంచుకోవాలి. ఇలా చేస్తే మీరు ఎక్కువ డబ్బు సంపాదించవచ్చు.

    డబ్బు సంపాదించాలంటే ఇది ముఖ్యమైన విషయం. మీరు వేరేవారితో సమానంగా లగ్జరీ లైఫ్ మొదట్లోనే ఉండాలని కోరుకుంటే అప్పుల్లోనే కూరుకుపోతారు. మొదటగా మీరు డబ్బు సంపాదించాలనే ఆలోచన ఉంచుకోండి. అంతేకానీ, బ్రాండెడ్ బట్టలు, కాస్ట్లీ ఫోన్స్, గ్యాడ్జెట్స్ వంటి వాటి జోలికి వెళ్లకండి. డబ్బు సంపాదనపైనే మీ దృష్ఠిని సారించండి. మీరు కేవలం ప్రస్తుత జీవితానికి మాత్రమే పరిమితం కావొద్దు. రిటైర్ మెంట్ తర్వాత కూడా మీరు హ్యాపీగా ఉండేందుకు ఇప్పట్నుంచే ప్లాన్ చేయండి. దానికోసం అవసరమైన డబ్బు కూడబెట్టండి. కావాలంటే ఫైనాన్షియల్ అడ్వైజర్ హెల్ప్ తీసుకోండి.