Chanakya Niti: పొరపాటున కూడా మీ క్లోజ్ ఫ్రెండ్స్ తో చెప్పకూడని విషయాలు ఇవే!

Chanakya Niti: ఆచార్య చాణక్యుడు తన నీతి గ్రంథం ద్వారా ఒక మనిషి సరైన మార్గంలో నడవాలంటే ఏ విధమైనటువంటి నడవడిక అలవర్చుకోవాలి, ఎలాంటి లక్షణాలతో మెలగాలి,తప్పుడు మార్గంలో ప్రయాణిస్తున్న మన జీవితాన్ని సరైన మార్గంలోకి వెళ్లాలంటే ఏం చేయాలి అనే విషయాలను ఎంతో అద్భుతంగా వివరించారు. ఈ క్రమంలోనే ఆచార్య చాణక్యుడు నీతి గ్రంథం ద్వారా మన స్నేహితుల దగ్గర ఎలాంటి విషయాలను కూడా చెప్పకూడదు అనే విషయాలను ఎంతో అద్భుతంగా వివరించారు. మరి ఆ […]

Written By: Kusuma Aggunna, Updated On : January 14, 2022 6:50 pm
Follow us on

Chanakya Niti: ఆచార్య చాణక్యుడు తన నీతి గ్రంథం ద్వారా ఒక మనిషి సరైన మార్గంలో నడవాలంటే ఏ విధమైనటువంటి నడవడిక అలవర్చుకోవాలి, ఎలాంటి లక్షణాలతో మెలగాలి,తప్పుడు మార్గంలో ప్రయాణిస్తున్న మన జీవితాన్ని సరైన మార్గంలోకి వెళ్లాలంటే ఏం చేయాలి అనే విషయాలను ఎంతో అద్భుతంగా వివరించారు. ఈ క్రమంలోనే ఆచార్య చాణక్యుడు నీతి గ్రంథం ద్వారా మన స్నేహితుల దగ్గర ఎలాంటి విషయాలను కూడా చెప్పకూడదు అనే విషయాలను ఎంతో అద్భుతంగా వివరించారు. మరి ఆ విషయాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం…

ప్రస్తుతం మన దగ్గర కొంతమంది స్నేహితులు ఎంతో చనువుగా ఉంటారు. ఇలా మనకు చాలా చనువుగా ఉన్నారని వారి దగ్గర మనం మన వ్యక్తిగత విషయాలు చెప్పకూడదు. ఇలా వ్యక్తిగత విషయాలు చెబితే కొన్నిసార్లు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది.అందుకే ఆచార్య చాణిక్యుడు మనకు మన వైవాహిక జీవితానికి సంబంధించిన ఎలాంటి వ్యక్తిగత విషయాలను కూడా పొరపాటున కూడా స్నేహితులతో చెప్పకూడదని తెలియ చేశారు.

ఈ క్రమంలోనే మీ క్లోజ్ ఫ్రెండ్ దగ్గర ఎప్పుడూ కూడా మీ భార్య ప్రస్తావన తీసుకు రాకూడదు. మీ భార్య ఇష్టాఇష్టాలు,అలాగే మీ భార్య గుణగణాలు మంచిచెడుల గురించి కూడా పొరపాటున కూడా మీ క్లోజ్ ఫ్రెండ్ దగ్గర లేదా బంధువులు దగ్గర ఉండదు. ఈరోజు మన దగ్గర మంచిగా ఉన్నవారు పొరపాటున ఏదైనా మనస్పర్ధలు వచ్చినప్పుడు ఇవే చాలా సమస్యలుగా మారిపోతాయి. అలాగే మీ జీవితంలో మీకు ఎదురైన అవమానాలు కూడా ఎప్పుడు స్నేహితుల దగ్గర ప్రస్తావించ కూడదు.ఇలా మీకు జరిగిన అవమానాలు ఇతరులతో పంచుకున్నప్పుడు మీకు మరింత అవమానం జరిగే పరిస్థితులు ఏర్పడతాయి కనుక ఈ విషయాలను పొరపాటున కూడా ఎవరితోనూ షేర్ చేసుకోకూడదని ఆచార్య చాణక్యుడు నీతి గ్రంథం ద్వారా తెలిపారు.