Astro Tips: మన నిత్య జీవితంలో సమయాన్ని బట్టి కొన్ని చేయాల్సిన పనులు ఉంటే కొన్ని చేయకూడని పనులు ఉన్నాయి. సూర్యాస్తమయం తర్వాత కొన్ని పనులను అస్సలు చేయకూడదు. ఒకవేళ సూర్యాస్తమయం తర్వాత కొన్ని పనులను చేస్తే మాత్రం ఇబ్బందులు పడక తప్పదని చెప్పవచ్చు. ఇంటి దగ్గర తులసి మొక్కను పెంచుకునే వారు సూర్యాస్తమయం తర్వాత ఎట్టు పరిస్థితుల్లోనూ ఆ మొక్కను తాకకూడదు.
సూర్యాస్తమయం తర్వాత తులసి మొక్కను తాకడం ద్వారా తాకిన వాళ్లు లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. ఆర్థిక ఇబ్బందులు సైతం ఇలా చేసిన వాళ్లకు ఎదురయ్యే అవకాశం ఉండటంతో తులసి మొక్కను పెంచుకునే వాళ్లు ఈ జాగ్రత్తలను తీసుకోవాలి. సూర్యాస్తమయం తర్వాత తులసిమొక్కకు నీళ్లను పోయకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి. సూర్యాస్తమయం తర్వాత గోళ్లను కత్తిరించకూడదు.
ఆ సమయంలో జుట్టును కూడా కత్తిరించకూడదు. జుట్టు లేదా గోళ్లను కత్తిరిస్తే ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదురయ్యే ఛాన్స్ అయితే ఉంటుందని గుర్తుంచుకోవాలి. గోర్లు కత్తిరించే వాళ్ల లైఫ్ పై కూడా నెగిటివ్ ప్రభావం పడే ఛాన్స్ ఉంటుంది. అందువల్ల గతంలో ఈ పొరపాటు చేసిన వాళ్లు ఆ అలవాటును మార్చుకుంటే మంచిది. సూర్యాస్తమయం తర్వాత ఇల్లు ఊడ్చకూడదు.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇలా చేయడం ద్వారా ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. సూర్యాస్తమయం తర్వాత ఇల్లు తుడవడం కూడా మంచిది కాదు. సూర్యాస్తమయం తర్వాత నిద్రపోవడం మంచిది కాదు. సూర్యాస్తమయం తర్వాత పెరుగును దానం చేయకుండా ఉంటే మంచిది. సూర్యాస్తమయం సమయంలో భగవంతుడిని పూజిస్తే మంచిదని చెప్పవచ్చు.