RBI: కరోనా కారణంగా చాలా దేశాలు ఆర్థికంగా కుంగిపోయాయి. ఈ మహమ్మారి ఒక్కసారిగా ప్రపంచాన్ని పట్టిపీడించడంతో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. ఆ తరువాత 2022లో ఉక్రెయిన్, రష్యా మధ్య జరిగిన యుద్ధంతో చాలా దేశాలు రెండుగా చీలిపోయినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కొన్ని దేశాలు డాలర్ పై ఆధారపడకుండా తమ సొంత కరెన్సీని అభివృద్ధి చేసుకోవడానికి ఆరాటపడుతున్నాయి. ఇందులో భారత్ కూడా ఉండడం విశేషం. ప్రపంచంలో ఇతర దేశాలతో భారత్ ఇప్పటికే పోటీపడుతోంది. దీంతో తమ కరెన్సీని కూడా డెవలప్ చేయడం ద్వారా మరింత బలోపేతం చేయొచ్చని భావిస్తోంది. ఇందులో భాగంగా అంతర్జాతీయంగా భారత కరెన్సీని ప్రోత్సహించడానికి అనేక చర్యలు చేపట్టింది. తాజాగా రాధా శ్యామ్ నేతృత్వంలో ఓ కమిటీని నియమించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ కమిటీ కాపిటల్ మార్కెట్లను నిశీతంగా పరిశీలించి ప్రపంచంలో రూపాయి స్థితిగతులకు సంబంధించిన కొన్ని సిఫారసులు చేసింది.
రష్యా- ఉక్రెయిన్ యుద్ధం తరువాత ఆ దేశాలపై ఆధారపడడం వల్ల ఎంత నష్టం జరిగిందో చాలా దేశాలు ఆలోచించడం ప్రారంభించాయి. ఇదే సమయంలో ప్రపంచ పరిణామాలు, వాణిజ్యం, క్యాపిటల్ మార్కెట్ ఇతర మార్కెట్లతో పోలిస్తే భారత్ ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందని రాధా శ్యామ్ కమిటీ తెలిపింది. ఇప్పటి వరకు గ్లోబర్ వాల్యూ చైన్ ల ఏకీకరణ, క్యాపిటల్ అకౌంట్ కన్వర్టిబిలిటీలో అద్భుతమైన ప్రగతి సాధించింది. వీటితో పాటు విదేశీ వాణిజ్యం, మూలధన ఖాతాల్లో రూపాయిని ఎక్కువగా వినియోగించడం ప్రారంభమైంది. ఇటీవల భారత్ డాలర్ బదులుగా రూపాయిల్లో చెల్లింపులు చేయడానికి రష్యా ముందుకు వచ్చింది. గతంలో ఇరాన్ సైతం రూపాయి ద్వారా చెల్లింపులు చేయడానికి అంగీకరించిన విషయం తెలిసిందే.
అయితే అంతర్జాతీయంగా రూపాయి కరెన్సీ అభివృద్ధిలోకి వస్తే మన దేశ ఎగుమతులు, దిగుమతుల్లో విదేశీ మారకపు హెచ్చు తగ్గుల విలువ పై ఆధారపడాల్సిన అవసరం లేదు. దీంతో వ్యాపారులు నష్టాల నుంచి గట్టెక్కుతారు. విదేశాల్లో ప్రవాసుల కోసం రూపాయిని అభివృద్ధి చేసేలా ప్రత్యేకంగా బ్యాంకులు తెరుస్తారు. మొత్తం 5 పనిదినాల్లో రోజుకు 24 గంటలు పనిచేసే భారతీయ రూపాయి మార్కెట్ ను ప్రోత్సహించడం ద్వారా లావాదేవీలు, మార్కెట్ ను ప్రోత్సహించడం ద్వారా ఇతర మార్కెట్లతో భారత మార్కెట్ ఏకీకృతం కావడాని ఆస్కారం ఉంటుందని రాధా శ్యామ్ కమిటీ తెలిపింది.
ఇక ఈ కమిటీ నివేదిక ప్రకారం రానున్న 2 నుంచి 5 ఏళ్లలో 5 శాతం విత్ హోల్డింగ్ పన్నును మధ్యకాలిక వ్యూహంగా తొలగించాలని సిఫార్సు చేసింది. అలాగే సరిహద్దు వ్యాపార లావాదేవీల కోసం ఆర్టీజీఎస్ వినియోగాన్ని పెంచాలని తెలిపింది. ప్రస్తుతం యూఎస్ లో డాలర్, యూరో, చైనీస్, యువాన్, జపనీస్ యెన్, బ్రిటిష్ పౌండ్ మాత్రమే ఎస్ డీఆర్ బాస్కెట్ లో ఉన్నాయి. ద్వైపాక్షిక, బహుళ పాక్షిక ఒప్పందాల్లో భాగంగా రూపాయి, స్తానిక కరెన్సీన్లో ఇన్ వాయిస్ చెల్లింపులు చేయాలని కమిటీ సిపారసు చేసింది.