Kia Seltos Facelift 2023: ఆటో మోబైల్ రంగంలో కాలం మారుతున్న కొద్దీ కొత్త ఆవిష్కరణలు జరుగుతున్నాయి. వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా వివిధ మోడల్ కార్లు అందుబాటులోకి వస్తున్నాయి. ఈ క్రమంలో దక్షిణ కొరియా కంపెనీకి చెందిన కియా భారత మార్కెట్లో తన సత్తా చాటుతోంది. ఈ కంపెనీ నుంచి వచ్చిన కార్లు ఇండియాలో అత్యధిక విక్రయాలు జరుపుకుంటోంది. తాజాగా కియా ‘సెల్టోస్ ఫేస్ లిఫ్ట్’ను 2023 జూలె 5న పరిచయం చేసింది. ఈ సందర్భంగా కంపెనీ ప్రతినిధులు మాట్లాడుతూ భవిష్యత్ లో దేశంలో మినీ ఎస్ యూవీదే హవా కొనసాగుతుందని ప్రకటించారు. ఇప్పటి వరకు ఈ మోడల్ లో హ్యూుండాయ్ 7 శాతం వాటాతో ముందు వరుసలో ఉంది. క్రమంగా తమ వాటా పెంచుకునేందుకు మిగతా కంపెనీలో పోటీ పడుతున్నాయి.
కియా నుంచి ఇదివరకే సెల్టోస్ మార్కెట్లోకి వచ్చింది. అయితే దీనిని మినీ ఎస్ యూవీకి అప్ గ్రేడ్ చేయడంతో పాటు అప్డేట్ ఫీచర్లను జోడించి మార్కెట్లోకి తీసుకొచ్చారు. పాత మోడల్ సెల్టోస్ తో పోలిస్తే కొత్త మోడల్ డిజైన్ ఆకట్టుకుంటోంది. రీ డిజైన్ చేసిన సెల్టోల్ ఫేస్ లిప్ట్ 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్, 1.5 డీజిల్ ఇంజన్ ను కలిగి ఉంది. సీవీటీ యూనిట్ లేదా 6 -స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ యూనిట్ ఇందుల ఉంది. కొత్త మోడల్ స్కిడ్ ప్లేట్లు, ఫాక్స్ డ్యూయల్ ఎగ్జాస్ట్ లు కూడా ఉన్నాయి.
కొత్త స్కిడ్ ప్లేట్లు, ఎల్ ఈడీ టెయిల్ లైట్ల తో పాటు 18 అంగుళాల గ్లోసీ బ్లాక్ వినియోగదారులను ఆకట్టుకుంటోంది. డ్యూయల్ టోన్, మ్యాట్ గ్రాఫైట్ వేరియంట్ తో మొత్తం 8 కలర్లలో ఈ మోడల్ అందుబాటలోకి వచ్చింది. ఇక కియా సెల్టోస్ లేటేస్ట్ మోడల్ రూ.12 లక్షల నుంచి రూ.19 వరకు షోరూం ధరను నిర్నయించారు. ఇది మేడ్ ఇన్ ఇండియా అయినా విదేశాల్లో కూడా పరిచయం చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఇప్పటి వరకు ఉన్న హ్యుండాయ్ క్రెటా, మారుతి సుజుకి గ్రాండ్ విటారా లకు పోటీగా సెల్టోస్ ఫేస్ లిఫ్ట్ పోటీ ఇస్తుందని అంటున్నారు.
కారు కొనాలనుకునేవారు ఎక్కువ శాతం ఎస్ యూవీలకే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. అయితే అత్యధిక ధర ఉన్నందు వల్ల ఎస్ యూవీలోని కొన్ని ఫీచర్లను జోడించి మిడ్ ఎస్ యూవీలను మార్కెట్లోకి తీసుకొస్తున్నారు. ఈ తరుణంతో ఇలాంటి మోడళ్లకు వినియోగదారులు ఆకర్షితులవుతున్నారు. ఈ తరుణంలో కియా సెల్టోస్ ఫేస్ లిఫ్ట్ కూడా ఆకట్టుకుంటుందని అంటున్నారు. అయితే ముందు ముందు కాలంలో ఈ మోడల్ ఎలా ఉంటుందో చూడాలి.