Dating : డేటింగ్‌పై ఆసక్తి కోల్పోతున్న యువత.. అసలు కారణాలివే!

ప్రస్తుతం యువత డేటింగ్ యాప్స్‌పై ఇంట్రెస్ట్ కోల్పోతున్నారని తాజాగా ఓ సర్వే తెలిపింది. వివిధ కారణాల వల్ల ఆసక్తి కోల్పోయినట్లు ప్యూ రీసెర్చ్ సర్వే తెలిపింది. డేటింగ్‌ చేసే ముందు పార్ట్‌నర్ నుంచి ఎన్నో ఆశిస్తారు. దీనివల్ల వాళ్లకు ఏదో లోటుగానే అనిపిస్తుంది. దీంతో నిరాశకు గురవుతారు.

Written By: Kusuma Aggunna, Updated On : August 29, 2024 10:50 am

Youth Not Intrested On dating

Follow us on

Dating :  మారిన జీవనశైలి కారణంగా చాలామంది డేటింగ్ చేస్తున్నారు. అయితే ప్రస్తుతం డేటింగ్ మీద యువత ఆసక్తి కోల్పోతున్నారు. అసలు ఈ డేటింగ్ కల్చర్ మన ఇండియాలో పుట్టింది కాదు. పాశ్చాత్య దేశాల నుంచి ఈ కల్చర్ మన ఇండియాకి వచ్చింది. మన దేశంలో పెద్దలు పార్ట్‌నర్‌ను సెలక్ట్ చేసేవాళ్లు. అలా మారుతున్న జీవనశైలి వల్ల డేటింగ్‌కి అలవాటు పడ్డారు. ఆన్‌లైన్‌లో ఉండే డేటింగ్ యాప్‌ల ద్వారా భాగస్వామిని సెలెక్ట్ చేసుకునేవాళ్లు. వాళ్లను కలిసి, అన్ని మాట్లాడుకున్న తర్వాత ఒకే అయితే పెళ్లి చేసుకునేవారు. కానీ ప్రస్తుతం యువత డేటింగ్ యాప్స్‌పై అంత ఆసక్తి చూపించట్లేదు. అసలు డేటింగ్‌పై ఆసక్తి కోల్పోవడానికి కారణమేంటో మరి తెలుసుకుందాం.

ప్రస్తుతం యువత డేటింగ్ యాప్స్‌పై ఇంట్రెస్ట్ కోల్పోతున్నారని తాజాగా ఓ సర్వే తెలిపింది. వివిధ కారణాల వల్ల ఆసక్తి కోల్పోయినట్లు ప్యూ రీసెర్చ్ సర్వే తెలిపింది. డేటింగ్‌ చేసే ముందు పార్ట్‌నర్ నుంచి ఎన్నో ఆశిస్తారు. దీనివల్ల వాళ్లకు ఏదో లోటుగానే అనిపిస్తుంది. దీంతో నిరాశకు గురవుతారు. ఒక బంధంలో అర్థం చేసుకునే గుణం, సర్దుకుపోయే గుణం చాలా ముఖ్యమైనది. కానీ డేటింగ్‌లో ఇవన్నీ ఉండవు. దీంతో నిరాశకు గురై.. డేటింగ్‌పై ఆసక్తి కోల్పోతున్నారు. పార్ట్‌నర్‌తో ఎంత మంచిగా ఉన్నా కూడా సరైన పార్ట్‌నర్ దొరకడంలేదని చాలా మంది దీనిని దూరం పెడుతున్నారు. మింగిల్ లైఫ్ కంటే సింగిల్ బెటర్‌ అని ఫీల్ అవుతున్నారు. అందుకూ డేటింగ్ చేయకుండా ఒంటరిగా లైఫ్‌ని ఎంజాయ్ చేయాలని అనుకుంటున్నారు. డేటింగ్ చేసిన తర్వాత అసంతృప్తి, మానసిక సమస్యలు, ఒత్తిడి వంటివి ఉంటాయని యువత ముందే భావించి ఒంటరిగా ఉండటానికి ట్రై చేస్తోంది.

డేటింగ్‌లో ఉన్నప్పుడు ఇద్దరికి ఒకరి మీద ఒకరికి ప్రేమ, ఇంట్రెస్ట్, గౌరవం అన్ని ఉంటాయి. కానీ కొన్ని రోజుల తర్వాత ఇద్దరి మధ్య ప్రతి చిన్న విషయానికి విభేదాలు రావడం జరుగుతున్నాయి. కారణం లేకుండా పార్ట్‌నర్‌ను దూరం పెట్టడం వంటివి చేస్తున్నారు. దీంతో అవతలి పర్సన్ డిప్రెషన్‌కు లోనవుతున్నారు. ఇద్దరు కలిసి ఉన్నప్పుడు కూడా కండీషన్లు పెట్టడం, వాళ్లతో మాట్లాడకు, అక్కడికి వెళ్లకు, ఎక్కడికి వెళ్లిన చెప్పాలి, నా పర్మిషన్ లేకుండా నువ్వు ఎక్కడికి వెళ్లకూడదని పార్ట్‌నర్ అంటున్నారు. ఈ తరం యవత ఎక్కువగా వాళ్లకు నచ్చినట్లు బ్రతకడానికి ఇష్టపడుతున్నారు. దీంతో ఇలా అన్నింటికి కండీషన్లు పెడుతూ.. వాళ్లకు నచ్చినట్లు ఉండాలంటే కష్టమని డేటింగ్‌పై ఆసక్తి కోల్పోతున్నారు. అలాగే అందరూ కూడా ఏదో ఆశించి డేటింగ్ చేస్తున్నారు. కేవలం వాళ్ల అవసరాలకు మాత్రమే డేటింగ్ చేస్తున్నారు. తర్వాత కారణం లేకుండా వదిలేయడం వల్ల ఇద్దరిలో ఒకరు ఇబ్బంది పడుతున్నారు. ఇలా బాధపడటం కంటే సింగిల్‌గా ఉండటం బెటర్ అని యువత భావించి డేటింగ్‌కి దూరంగా ఉంటున్నారు.