WhatsApp: వాట్సాప్ లో కుప్పలు తెప్పలుగా వచ్చే మెసేజ్ లతో ఇబ్బంది పడుతున్నారా… ఈ కొత్త ఫీచర్ తో ఆ సమస్య ఉండదు..

వాట్సాప్ లో మనకు సాధారణంగా నంబర్ల నుంచి మెసేజ్ లు వస్తుంటాయి. అలా మెసేజెస్ రాగానే మనం ముందుగా మొబైల్ నెంబర్ చూస్తాం.. అయితే వాట్సాప్ తెరపైకి తీసుకొచ్చిన కొత్త ఫీచర్ వల్ల ఇకపై నెంబర్ కు బదులు ప్రత్యేక కోడ్ లేదా వినియోగదారుడి పేరు నమోదు చేసేందుకు అనుమతి ఉంటుంది.

Written By: Anabothula Bhaskar, Updated On : August 29, 2024 10:28 pm

Whatsapp features

Follow us on

WhatsApp: స్మార్ట్ ఫోన్ అనేది మనిషి జీవితంలో ఒక ముఖ్యమైన భాగం అయిపోయిన తర్వాత.. అందులో వాట్సప్ తప్పనిసరిగా మారిపోయింది. వాట్సాప్ లో కూడా కొత్త కొత్త మార్పులు చేర్పులు రావడంతో యూజర్లు అంతకంతకూ పెరుగుతున్నారు. ప్రస్తుతం 3+ బిలియన్ యూజర్లతో వాట్సాప్ సరికొత్త మెసేజింగ్ యాప్ గా ఆవిర్భవించింది. పెరుగుతున్న యూజర్లకు అనుగుణంగా సరికొత్త ఫీచర్లను అందిస్తూ.. అద్భుతమైన సేవలు అందిస్తోంది.

నంబర్ కు బదులుగా ప్రత్యేకమైన కోడ్

వాట్సాప్ లో మనకు సాధారణంగా నంబర్ల నుంచి మెసేజ్ లు వస్తుంటాయి. అలా మెసేజెస్ రాగానే మనం ముందుగా మొబైల్ నెంబర్ చూస్తాం.. అయితే వాట్సాప్ తెరపైకి తీసుకొచ్చిన కొత్త ఫీచర్ వల్ల ఇకపై నెంబర్ కు బదులు ప్రత్యేక కోడ్ లేదా వినియోగదారుడి పేరు నమోదు చేసేందుకు అనుమతి ఉంటుంది. దీనికి “యూజర్ నేమ్ పిన్” అనే పేరు వాట్సప్ యాజమాన్యం పెట్టింది. దీనివల్ల యూజర్ కు వాట్సాప్ సెక్యూరిటీ ఇస్తుంది. దీనివల్ల వచ్చిన మెసేజ్ వచ్చిన మొబైల్ నెంబర్ తెలుసుకోవడం అంత ఈజీ కాదు. ప్రస్తుతం ఈ సదుపాయం బీటా వెర్షన్ 2.24.18.2 వినియోగదారులకు అందుబాటులో ఉంది. మిగతా వారికి ఈ అప్డేట్ కావాలంటే కొంతకాలం ఎదురు చూడాలి.. దీనివల్ల యూజర్లు తమ నెంబర్ ఎవరికైనా ఇచ్చినా లేదా ఇవ్వకున్నా.. వారి ఫోన్ నెంబర్ను వారే రక్షించుకునే అవకాశం కలుగుతుందని వాట్సప్ చెబుతోంది. సైబర్ మోసాలు పెరిగిన నేపథ్యంలో ఈ కొత్త అప్డేట్ తీసుకొచ్చామని వివరిస్తోంది.

పిన్ కోడ్ రూపొందించుకునే అవకాశం

ఈ ఫీచర్ మాత్రమే కాకుండా మరో ప్రధాన అప్డేట్ కూడా వాట్సాప్ ఇచ్చింది. దీని ప్రకారం యూజర్ నేమ్ కు బదులుగా పిన్ కోడ్ రూపొందించుకునే అవకాశం ఉంటుంది. అయితే ఈ పిన్ అదనపు సెక్యూరిటీగా పనిచేస్తుంది. ఇంతకుముందు ఎన్నడూ మాట్లాడని వారితో మాట్లాడాలంటే.. లేకుంటే మెసేజ్ చేయాలంటే..పిన్ నెంబర్ సెట్ చేసుకోవాలి. ఆ తర్వాత మీ పిన్ షేర్ చేసిన వ్యక్తి మాత్రమే దానికి మెసేజ్ చేసే అవకాశాన్ని పొందుతారు.. అయితే ఈ కొత్త సెక్యూరిటీ ఫీచర్ పాత యూజర్లపై ఎఫెక్ట్ చూపించదు. అంతేకాదు పిన్ లేదా యూజర్ నేమ్ ఫీచర్ ఆక్టివేట్ చేసినప్పటికీ.. అది మీ కాంటాక్ట్ జాబితాలో ఉన్న పాత వ్యక్తులపై ఎఫెక్ట్ చూపించదు.. అటువంటి వారికి మీ మొబైల్ నెంబర్ డిస్ ప్లే అవుతూనే ఉంటుంది.. అయితే ఈ సదుపాయం యూజర్ ఇష్టాన్ని బట్టి ఉంటుంది. ఒకవేళ ఆ యూజర్ నెంబర్ ఆ సౌలభ్యాన్ని కోరుకుంటే నెంబర్, పేరు కనిపించదు. అయితే యూజర్ల భద్రత కోసమే ఈ సదుపాయాన్ని తీసుకొచ్చామని వాట్సాప్ చెబుతోంది. రోజురోజుకు సైబర్ మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో వీటివల్ల యూజర్లకు రక్షణ ఉంటుందని వివరిస్తోంది. వచ్చే రోజుల్లోనూ మరిన్ని ఫీచర్లు అందుబాటులోకి తీసుకు వస్తామని చెబుతోంది.