Relationship : ఏదైనా ఒక బంధం కలకాలం సంతోషంగా ఉండాలంటే కొన్ని నియమాలు పాటించాలి. మరీ ముఖ్యంగా ఒకరిని అర్థం చేసుకుని గౌరవించాలి. కానీ చాలామంది మంచిగా ఉన్నప్పుడు బానే ఉంటారు. ఒక చిన్న గొడవ వస్తే చాలు.. ఇక పాత విషయాలు అన్ని లాగి మాటలతో హర్ట్ చేస్తారు. అయితే ఇవన్నీ అబ్బాయిలే కాదు అమ్మాయిలు కూడా చేస్తుంటారు. ఏదైనా రిలేషన్‌షిప్‌లో గొడవలు అనేవి సహజం. అన్నింటికి సర్దుకోకుండా పార్ట్‌నర్‌ను అర్ధం చేసుకోవాలి. అప్పుడే గొడవలు తగ్గే అవకాశం ఉంటుంది. బంధంలో చిన్న చిన్న గొడవలు రావడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. అసలు గొడవలు పడకుండా ఎవరూ ఉండరు. కానీ వచ్చిన అన్నింటిని అర్థం చేసుకోవాలి. కొందరు అమ్మాయిలు రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పుడు కొన్ని తప్పులు చేస్తుంటారు. పార్ట్‌నర్‌కి సరైన సమయం ఇవ్వకుండా ఉంటారు. ఇలాంటి చిన్న తప్పుల వల్ల ఇద్దరి మధ్య దూరం పెరుగుతుంది. అదే తప్పు పార్ట్‌నర్ చేసిన అర్థం చేసుకోకుండా గొడవలు పడతారు. బంధంలో ప్రేమతో పాటు నమ్మకం కూడా ముఖ్యమే. రిలేషన్‌షిప్ సంతోషంగా ఉండాలంటే అమ్మాయిలు కొన్ని తప్పులు అసలు చేయకూడదు. అవేంటో మరి తెలుసుకుందాం.
ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ లేకపోవడం
రిలేషన్‌షిప్‌లో అందరూ ముఖ్యంగా చేసే తప్పు ఫీలింగ్స్‌ను పార్ట్‌నర్‌తో పంచుకోరు. బాధ వచ్చిన, సంతోషం వచ్చిన పార్ట్‌నర్‌తో షేర్ చేసుకోవాలి. అప్పుడే బంధం బలంగా మారుతుంది. సిగ్గు పడకుండా ప్రతి విషయాన్ని ఇద్దరూ మాట్లాడుకుని, బంధాన్ని బలపరచాలి. ఏం చెప్పకుండా, మాట్లాడకుండా అలా వదిలేస్తే.. దూరం పెరిగి ఇద్దరి మధ్య గొడవలు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి కమ్యూనికేషన్‌ను అసలు ఆపవద్దు.
అతిగా ఆలోచించవద్దు
కొందరు అమ్మాయిలు ఏ విషయాన్ని అయిన లోతుగా ఆలోచిస్తారు. పార్ట్‌నర్ ఏదైనా చెప్తే నమ్మకుండా అతిగా ఆలోచిస్తారు. దీనివల్ల పార్ట్‌నర్‌ను అర్థం చేసుకోకుండా అపార్థం చేసుకుంటారు. అతిగా ఆలోచించడం వల్ల ఇద్దరి మధ్య గొడవలు వచ్చి ఒత్తిడికి గురవుతారు. ఇలా ఇద్దరి మధ్య గొడవలు ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.
పార్ట్‌నర్‌ను నమ్మకపోవడం
ఏ బంధంలో అయిన ప్రేమతో పాటు నమ్మకం కూడా ఉండాలి. భాగస్వామిని నమ్మకుండా అనుమానిస్తే ఇద్దరి మధ్య గొడవలు వస్తాయి. కొందరు అమ్మాయిలు వారి పార్ట్‌నర్ వేరే అమ్మాయితో మాట్లాడితే చూడలేరు. తప్పుగా మాట్లాడితే మీరు అనుమానించిన పర్లేదు. కానీ కారణం లేకుండా ఎవరితో మాట్లాడిన కూడా అనుమానిస్తే సమస్యలు తప్పవు. కాబట్టి భాగస్వామిని నమ్మి అర్థం చేసుకోవడం మొదలు పెట్టండి.
పర్సనల్ స్పేస్ ఇవ్వండి
ప్రతి ఒక్కరికి ఒక పర్సనల్ స్పేస్ ఉంటుంది. ఎప్పుడు మీతోనే ఉండాలని అనుకోవద్దు. కాబట్టి భాగస్వామిని మీకు నచ్చినట్లు కంట్రోల్ పెట్టవద్దు. ఫ్రెండ్స్‌తో బయటకు వెళ్లవద్దు, మీతోనే ఉండాలని కండీషన్స్ పెట్టవద్దు. వాళ్ల ఫ్రెండ్స్‌తో కూడా బయటకు వెళ్లనివ్వండి. ఇలా ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడం వల్ల బంధం స్ట్రాంగ్ అవుతుంది. కాబట్టి అమ్మాయిలు రిలేషన్‌షిప్‌లో ఇలాంటి చిన్న తప్పులు చేయవద్దు.