https://oktelugu.com/

love romantic stories : స్త్రీలకి శృంగార కథలంటే మక్కువ.. ఎందుకో తెలిస్తే ఆశ్చర్యపోతారు

ఇలాంటి కథలు, పాడ్‌కాస్ట్‌ల వల్ల మహిళలు సంతోషంగా ఉండటంతో పాటు లైంగిక కోరికలు పెంచుకోవడానికి ఉపయోపడుతుందని వీటిని వినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : October 3, 2024 / 05:02 AM IST
    Follow us on

    love romantic stories : శృంగారం చాలా సున్నితమైన సబ్జెట్. ఈ విషయంలో అమ్మాయిలు అయితే అసలు పైకి కనిపించరు. అయితే శృంగార కథలను ఎక్కువగా అబ్బాయిలు ఇష్టపడతారని చాలా మంది భావిస్తారు. కానీ మహిళలకే శృంగార కథలంటే ఇష్టమట. మహిళల కోసం ప్రత్యేకంగా పాడ్‌కాస్ట్‌లు, కథలు వంటివి కూడా ఉన్నాయి. చాలామంది మహిళలు శృంగారానికి సంబంధించిన పాడ్‌కాస్ట్‌లను ఎక్కువగా వింటున్నారని ఓ పరిశోధనలో కూడా తేలింది. మొత్తం 82 శాతం మహిళలు శృంగార కథలను వినడానికి ఇష్టపడుతున్నారట. అది కూడా 27 నుంచి 45 ఏళ్ల మధ్య వయస్సులో ఉన్న మహిళలే శృంగార కథనాలను వినడానికి ఇష్టపడుతున్నారని అధ్యయనం తెలిపింది. అయితే 90 శాతం మహిళలు కథల ద్వారా లైంగిక కోరికలను పెంచుకుంటారని, అందుకే వీరికి శృంగార కథలు అంటే ఇష్టమని ఓ నివేదిక చెబుతోంది.

    శృంగారం విషయంలో పురుషులు కంటే మహిళలే ఎక్కువ యాక్టివ్‌గా ఉంటారని కొందరు నిపుణులు చెబుతున్నారు. ఇలా శృంగార కథనాలు, పాడ్‌కాస్ట్‌లు వినే మహిళలు తమ భాగస్వాములతో 74శాతం ఎక్కువ లైంగికంగా ఉండాలని ఇష్టపడతారు. భర్తలతో శృంగార జీవితాన్ని మెరుగుపర్చుకోవడానికి ఈ కథలు మహిళలకు బాగా ఉపయోగపడతాయి. సాధారణంగా చాలా మంది అమ్మాయిలు వాళ్ల మ్యారేజ్‌ లైఫ్ రొమాంటిక్‌గా ఉండాలని కోరుకుంటారు. కానీ అందరికీ ఇది సాధ్యం కాదు. ఈ శృంగార కథల వల్ల కొంతవరకు పెంచుకోవచ్చని కొన్ని పరిశోధనల్లో తేలింది. మహిళలకు ఒక బిడ్డ పుట్టిన తర్వాత హార్మోన్ల వల్ల లైంగిక కోరికలు తగ్గుతాయి. దానికి తోడు కొందరికి బాడీ సహకరించకపోవడం, రోజువారీ ఇంటి పనులు, అలసట, పిల్లలను చూసుకోవడం వంటి పనుల వల్ల రోజురోజుకి శృంగారం మీద ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. కొందరికి మనస్సులో కోరిక ఉన్నప్పటికీ బయటకు చెప్పలేరు. దీనికి ముఖ్య కారణం ఎవరైనా ఆమెను తప్పుగా అనుకుంటారని వెనుకడుగు వేస్తారు. కనీసం శృంగార కథలు చదవడం వల్ల వాళ్లకి వారు సంతృప్తి చెందుతున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి.

    ఇలాంటి శృంగార కథలు కేవలం పురుషులు మాత్రమే చదువుతారని అనుకుంటే పొరపాటే. మహిళలు కూడా ఈ పుస్తకాలను ఎక్కువగా చదువుతుంటారు. రోజుకి 35 నుంచి 40 నిమిషాల పాటు శృంగార కథనాలను చదవడం వల్ల మహిళల మెదడులో ప్రత్యేక రసాయనం ఒకటి విడుదల అవుతుంది. ఆ రసాయనం వారిలో లైంగిక కోరికలను పెంచుతుందట. మహిళల్లో ప్రేమ హార్మోన్ ఆక్సిటోసిన్ ఎక్కువగా విడుదల అవుతుంది. దీనవల్ల వారు ఎక్కువగా ఎమోషనల్‌గా ఉంటారు. ఇలాంటి కథలను చదవడం, వినడం వంటివి చేయడం వల్ల మహిళల్లో హ్యపీ హార్మోన్లు విడుదల అవుతాయి. ఇవి మానసిక స్థితిని మెరుగుపరుస్తుందని రిలేషన్‌షిప్ నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి కథలు, పాడ్‌కాస్ట్‌ల వల్ల మహిళలు సంతోషంగా ఉండటంతో పాటు లైంగిక కోరికలు పెంచుకోవడానికి ఉపయోపడుతుందని వీటిని వినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు.