https://oktelugu.com/

Nayanthara : నిమిషానికి ఐదుకోట్లా..? వామ్మో నయన రేంజ్ తగ్గడం కాదు ఓ రేంజ్ కు వెళ్తుంది.. దీనికి కారణం అదేనా?

సంపాదిస్తూ..ఇతర హీరోయిన్ల కంటే డబుల్ ఛార్జ్ చేస్తుంది. ఇప్పటికే సినిమాకు ఆమె రెమ్యునరేషన్ 10 నుంచి 15 కోట్లు డిమాండ్ చేస్తుంది. రీసెంట్ గా ఓ యాడ్ కు సబంధించి రెమ్యునరేషన్ విషయంలో నయన ఫుల్ ట్రెండింగ్ లో ఉంది.

Written By:
  • NARESH
  • , Updated On : October 3, 2024 / 07:01 AM IST

    Nayanthara

    Follow us on

    Nayanthara : వయసు పెరుగుతున్నా సరే అందం మాత్రం తగ్గించకుండా పెంచుకుంటున్న బ్యూటీ నయనతార. అందంతో పాటు సినిమాల్లో కూడా ఫుల్ బిజీ. ఇక రెమ్యూనరేషన్ కూడా వేరే లెవల్ లో ఉంటుంది. పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నా ఏమాత్రం వన్నె తగ్గడం లేదు. వరుస ఆఫర్లు సాధిస్తూ.. రెమ్యునరేషన్ ను కూడా ఫుల్ గా పెంచుతుంది. ఒక వైపు సినిమాలు.. మరో వైపు బిజినెస్ లు.. ఇంకో వైపు బ్రాండ్స్ ప్రమోట్ అంటూ చేతి నిండా డబ్బు సంపాదిస్తుంది ఈ కోలివుడ్ బ్యూటీ. ఈ రేంజ్ లో సంపాదిస్తూ..ఇతర హీరోయిన్ల కంటే డబుల్ ఛార్జ్ చేస్తుంది. ఇప్పటికే సినిమాకు ఆమె రెమ్యునరేషన్ 10 నుంచి 15 కోట్లు డిమాండ్ చేస్తుంది. రీసెంట్ గా ఓ యాడ్ కు సబంధించి రెమ్యునరేషన్ విషయంలో నయన ఫుల్ ట్రెండింగ్ లో ఉంది.

    బ్రాండ్స్ ను ప్రమోట్ చేయడంలో బిజీగా ఉండే నయనతార రీసెంట్ గా టాటా స్కై కి సబంధించిన యాడ్ ను చేసిందట. అయితే దాదాపు 50 సెకండ్ల వరకూ ఉన్న ఈ యాడ్ కోసం నయనతార ఏకంగా రూ. 5 కోట్ల అందుకుంది. ఈ విషయం షాక్ అవడం నెటిజన్ల వంతు అయింది. నయన్ కు అంత డిమాండ్ ఏంటీ.. ఎందుకు అంతలా ఆమె వెనకు పడుతున్నారని మాట్లాడుకుంటున్నారు నెటిజన్లు. అసలు హీరోయిన్లు కెరీర్ 30 ఏళ్ళు దాటితే తగ్గాలి. 40 ఏళ్ళు వచ్చేవరకూ హీరోయిన్లు మాయం అవడం కామన్ గా జరుగుతుంటుంది. కానీ మరికొంత మంది మాత్రం క్యారెక్టర్ రోల్స్ స్టార్ట్ చేసి కెరీర్ ను రన్ చేస్తుంటారు. కాని నయనతార లాంటి కొంత మంది హీరోయిన్లు మాత్రం ఫిట్ నెస్ ను, గ్లామర్ ను కాపాడుకోవడంలో ముందుంటారు. సో ఇలా కంటిన్యూ అవడం గ్రేట్ అంటే ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోయిన్ ల కంటే కూడా హై రేంజ్ లో రెమ్యూనరేషన్ అందుకోవడం మరింత గ్రేట్ కదా.

    సూపర స్టార్ నయనతార ప్రస్తుతం తమిళంలో ఓ మూవీలో నటిస్తోంది. ఈసినిమాతో పాటు మలయాళంలో కూడా మరో సినిమాతో రాబోతుంది. ఈరెండు సినిమాల షూటింగ్ బిజీలో ఉంది అమ్మడు. ఈ సినిమా షూటింగ్ లో ఉండగానే.. ఆమెకు మరో సినిమా ఆఫర్ వచ్చిందట. అది ఎవరి సినిమానో కాదు.. కన్నడ రాక్ స్టార్ యష్ సినిమాలో ఛాన్స్ వచ్చిందని తెలుస్తోంది.

    సాధారణంగా నయనతార సినిమాకు 10 కోట్ల రెమ్యునరేషన్ అందుకుంటుంది. కానీ ప్రస్తుతం మరో సినిమా అంటే త్వరలో అమ్మడు కనిపించబోతున్న టాక్సిక్ సినిమా కోసం ఆమె గట్టిగా డిమాండ్ చేసిందని తెలుస్తోంది. ఈసినిమాలో యష్ సోదరిగా నయన్ నటిస్తోందని సమాచారం. అయితే ఇందులో నిజం ఎంతో తెలియదు కాని..ఈ పాత్రలో నటించేందుకు ఆమె 20 కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందని టాక్ నడుస్తోంది. దీంతో నటి నయనతార తన పారితోషికాన్ని రెట్టింపు చేసిందని తెలిసి మరింత షాక్ అవుతున్నారు నెటిజన్లు.

    అయితే ఈ సినిమాలో ఆమెను తీసుకున్నారా లేదా అనేది క్లారిటీ రాలేదు. ఆసినిమాలో తీసుకున్నా తీసుకోక పోయినా.. నయనతార కు మాత్రం డిమాండ్ తగ్గడం లేదు. ఆమె కోసం నిర్మాతలు క్యూ కడుతూనే ఉండటం గమనార్హం. డేట్స్ కోసం ఎదురు చూస్తూనే ఉన్నారట దర్శకనిర్మాతలు. సౌంత్ సినిమాల్లో ఇంత ఏజ్ వచ్చినా.. అంత డిమాండ్ ఉన్న నటిమణుల్లో నయన్ ముందున్నారు కూడా. ఇక ఆమె తరువాత త్రిష, సమంత లాంటివారు కూడా ఈ కోవలోకే వస్తారు.