Benefits of worshipping Lord Shiva: త్రిమూర్తులలో ఒకరైన మహాశివుడు ఒకరు. బ్రహ్మ ప్రపంచాన్ని సృష్టిస్తే.. విష్ణు స్థితిగతులను చూస్తారని.. శివుడు లయకారుడిగా పేరు తెచ్చుకుంటాడని అంటారు. అయితే మరికొందరు చెబుతున్న ప్రకారం శక్తి, కాంతి, శాశ్వతం అన్ని శివుడి వద్దే ఉంటాయని పేర్కొంటారు. అందువల్ల మానవ జీవితం సంతోషంగా, అనుకున్న పనులు విజయవంతంగా కావాలంటే శివారాధన తప్పనిసరిగా చేయాలని అంటారు. శివుడిని ఆరాధించడం వల్ల కేవలం ఆధ్యాత్మిక వాతావరణమే కాకుండా మానవ శరీరం ఒక క్రమ పద్ధతిలోకి వస్తుందని అంటున్నారు. శరీరం, ఆత్మ శుద్ధిగా మారడానికి శివారాధన తప్పనిసరి అని చెబుతుంటారు. అయితే ఎటువంటి శుద్ధి జరుగుతుంది? శివారాధన ఎందుకు చేయాలి?
ఓం నమశ్శివాయ.. అన్న మంత్రం సాధారణంగానే కనిపిస్తుంది. కానీ ఈ మంత్రం జపించడం వల్ల మనసు ప్రశాంతంగా మారుతుంది. ఒక వ్యక్తి ఎక్కువగా ఒత్తిడికి గురి అయినా.. భయాందోళనకు గురవుతున్నా.. ఈ మంత్రం జపించడం వల్ల అతడికి ఆందోళన తగ్గే అవకాశం ఉంటుంది. మరోసారి ఏదైనా పని నిర్వహించేటప్పుడు అతనిలో సహజంగానే ధైర్యం వస్తుంది. శివుడిని ఆరాధించడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. శరీరంలో శాంతి హార్మోన్లు పెరుగుతాయి. దీంతో నిద్ర బాగా వస్తుంది. రక్తపోటు ఉన్నవారు శివారాధన చేయడం వల్ల రక్తపోటు స్థిరంగా మారిపోతుంది.
మనకు తెలియకుండానే ఎన్నో పాపాలు చేస్తుంటాం.. పొరపాట్లు కూడా చేస్తుంటాం.. అయితే వీటి భారం తగ్గించుకోవడానికి శివుడి ఆరాధనే సరైన మార్గం అని చెబుతారు. శివుడి పూజ మిగతా దేవుళ్ళ కంటే తక్కువగానే ఉన్నప్పటికీ భక్తులకు విశేషమైన ఫలితాలను అందించి వారిని కాపాడుతూ ఉంటారని శివ భక్తులు పేర్కొంటారు. నిత్యం శివ ధ్యానం చేయడం వల్ల బలమైన నిర్ణయాలు తీసుకునే ధైర్యం వస్తుంది. అలాగే దృఢత్వం పెరిగి కొన్ని కష్టమైన పనులను కూడా చేయగలుగుతారు. కుటుంబంలో సమస్యలు ఉన్నా.. విభేదాలు ఎదుర్కొంటున్నా.. శివారాధన చేయడం వల్ల వీటి నుంచి బయటపడవచ్చని అంటుంటారు. సుఖశాంతులతో జీవిస్తారు.
ఉద్యోగ, వ్యాపార రీత్యా ఎన్నో కష్టాలను ఎదుర్కొంటారు కొందరు. ఇలాంటివారు శివారాధన చేయడం వల్ల తమ సమస్యల నుంచి బయట పడవచ్చు అని అంటున్నారు. వీరు ఒక్కోసారి శత్రుభయాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అనేక నష్టాలను చూడాల్సి వస్తుంది. ఇవి రాకుండా.. వీటినుంచి బయట పడడానికి బోలేనాథ్ మంత్రం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే శివుడి ఆరాధనలో ఉంటూ.. శివ నామస్మరణ చేయడం వల్ల మోక్షమార్గం ఏర్పడుతుందని చెబుతుంటారు. ఆత్మ శుద్ధి చేసుకోవడానికి.. పాపాలను తొలగించుకోవడానికి శివుడి నామస్మరణ అత్యంత ప్రధానమైన మార్గమని పండితులు చెబుతున్నారు.
శివరాధన చేయలేని వారు.. శివ నామస్మరణ నిర్వహించలేని వారు ప్రతి సోమవారం శివాలయానికి వెళ్లి ఆ స్వామివారికి అభిషేకం ఉంటాయని అంటున్నారు. శివుడు పెద్దగా అలంకరణ కోరుకోడు. కేవలం స్వచ్ఛమైన నీటితో అభిషేకం చేయడం వల్ల కూడా ఎంతో సంతోషిస్తాడని హిందూ పురాణాల్లో ఉంది. అంతేకాకుండా శివాలయానికి వెళ్లి వచ్చిన తర్వాత మనసు ఎంతో ప్రశాంతంగా ఉండి సరైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది.