ibomma Ravi challenge CP Sajjanar: సినీ ఇండస్ట్రీ ని పైరసీ భూతం ఎన్నో ఏళ్ళ నుండి పట్టి పీడిస్తోంది. ఒకప్పుడు పైరసీ అంటే థియేటర్స్ ప్రింట్ ఉండేది. కానీ ఇప్పుడు ఏకంగా HD క్వాలిటీ తో పైరసీ ని దిమ్పేస్తున్నాడు. ఉదాహరణకు థియేట్రికల్ రన్ అయిపోయిన తర్వాత ఓటీటీ లోకి ఒక సినిమా వస్తే ఎంత క్వాలిటీ తో ఉంటుందో, అంతే క్వాలిటీ తో సినిమా విడుదలైన రోజునే వచ్చేస్తోంది. దీని వల్ల నిర్మాతలకు కోట్లలో నష్టం వాటిల్లుతోంది. సూపర్ హిట్ అవ్వాల్సిన సినిమాలు హిట్ గా, యావరేజ్ అవ్వాల్సిన సినిమాలు డిజాస్టర్ ఫ్లాప్స్ గా మిగులుతున్నాయి. ముఖ్యంగా ఈ పైరసీ కారణం గా మీడియం రేంజ్ హీరోల సినిమాలు మరియు చిన్న సినిమాలను థియేటర్స్ లో చూడడం ఆపేసారు జనాలు. ఈ పైరసీ మాఫియా కి మూలకారణంగా నిలుస్తూ వచ్చిన సంస్థ ibomma.
ఎన్నో లక్షల మంది యూజర్లు ఇందులో ఉంటారు. పబ్లిక్ గా ఎన్నో ఏళ్ళ నుండి పైరసీ చేస్తున్నప్పటికీ కూడా ఇతని ఆచూకీ ని ఎవ్వరూ పెట్టుకోలేని పరిస్థితి. రీసెంట్ గానే ఇతను పోలీసులకు సవాలు చేస్తూ ‘దమ్ముంటే నన్ను పట్టుకోండి’ చూద్దాం అంటూ ఒక వీడియో ని విడుదల చేసాడు. ఆ వీడియో ఎంతటి సంచలనం సృష్టించిందో మనమంతా చూసాము. అయితే రీసెంట్ గానే ఇతని భార్య తో విబేధాలు రావడం తో, ఆమె నేరుగా ibomma రవి వివరాలను పోలీసులకు అందించింది. దీంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా CP సజ్జనార్(CP Sajjanar) నేడు మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi), రాజమౌళి(SS Rajamouli) మరియు ఇతర సినిమా ప్రముఖులతో కలిసి ఒక ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేసాడు. ఈ ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఆయన మాట్లాడుతూ ‘దమ్ముంటే పట్టుకోండి అంటూ రీసెంట్ గానే ఐ బొమ్మ రవి ఛాలెంజ్ విసిరాడు..ఇప్పుడు ఏమైంది?, ఇప్పుడు అతను ఎక్కడ ఉన్నాడు?, పోలీసులకు సవాళ్లు విసిరితే ఇలాగే ఉంటుంది’ అని చెప్పుకొచ్చాడు.
ఇంకా ఆయన మాట్లాడుతూ ‘ఈ ఇబొమ్మ రవి అనే వ్యక్తి సినిమాలను పైరసీ చేయడం మాత్రమే కాదు, బెట్టింగ్ యాప్స్ కూడా చాలానే ప్రమోట్ చేసాడు. ఇతని కారణంగా జనాలకు ఎంతో నష్టం జరిగింది. బెట్టింగ్స్ వల్ల ఎంతో మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఇక ఈ రవి దాదాపుగా 65 మిర్రర్ వెబ్ సైట్స్ రన్ చేసేవాడు. అతని వద్ద ఉన్న హార్డ్ డిస్కులలో దాదాపుగా 21000 సినిమాలు ఉన్నాయి. 1972 వ సంవత్సరం లో వచ్చిన గాడ్ ఫాదర్ చిత్రం దగ్గర నుండి రీసెంట్ గా విడుదలై సూపర్ హిట్ గా నిల్చిన ఓజీ చిత్రం వరకు అతని వద్ద అన్ని సినిమాలు ఉన్నాయి. ఇప్పటి వరకు ఈ మాఫియా తో అతను 20 కోట్ల రూపాయిల వరకు సంపాదించాడు. ప్రస్తుతానికి మూడు కోట్లు రూపాయిలను సీజ్ చేశాం’ అంటూ చెప్పుకొచ్చాడు.
He challenged the police saying, ‘Dammunte pattukora’. Now we know exactly where he is.
– CP Sajjanar while about the iBomma website founder Immadi Ravi.
— Telugu Chitraalu (@CineChitraalu) November 17, 2025