
Cheapest mini AC : ఎండాకాలం వచ్చిందంటే చాలు.. చల్లదనం కోసం ఆరాటపడుతుంటాం.. వేసవిలో ఫ్యాన్లు వేడిగాలిని ఇస్తాయి. అందువల్ల కూలర్లను ఏర్పాటు చేసుకొని ఉపశమనం పొందుతాం. కొంచెం డబ్బున్నవాళ్లు ఏసీలు బిగించుకొని హాయిగా గడుపుతారు. అయితే సాధారణ కూలర్లతో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఇవి ఏర్పాటు చేసుకోవడానికి అనువైన ప్లేస్ ఉండదు. అదీ కాకుండా సౌండ్ ఎక్కువ సౌండ్ వచ్చి డిస్ట్రబెన్స్ గా ఉంటాయి. ఒకవేళ ఏసీలు కొనేంత స్థోమత ఉన్నా అద్దెకు ఉన్నవారికి ఇబ్బందిగానే ఉంటుంది. అందువల్ల మూవీంగ్ ఉండే ఏసీలు ఇప్పుడు మార్కెల్లో అలరిస్తున్నాయి. ఇవి ఏసీ లెవల్లో చల్లని గాలిని ఇస్తూ సౌండ్ లేకుండా ఉంటున్నాయి. అంతేకాకుండా ఇవి తక్కువ ధరకు అందుబాటులో లభిస్తున్నాయి. వీటి గురించి తెలిసిన వారు ఏసీలు కొనడం ఆపేస్తున్నారు. మరి మిడిల్ క్లాస్ బడ్జెట్ లో లభించే సౌకర్యవంతమైన కూలర్ల (ఏసీ)లు ఏవో చూద్దాం.
1. ఫోర్టబుల్ స్మాల్ ప్లాస్టిక్ ఏయిర్ కండిషనర్:
ఇది చిన్నపాటి ఏసీ లెవల్లో ఉంటుంది. 8 గంటల పాటు ఆటంకం లేకుండా నడుస్తుంది. దీని ట్యాంక్ నింపడం చాలా సులభం. దీనిని ఎక్కడ కావాలిస్తే అక్కడికి తీసుకెళ్లచ్చు. దీని ధర రూ.500 నుంచి రూ.800 వరకు విక్రయిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఇవి అందుబాటులో లేవని అంటున్నారు. కానీ షోరూంలో లభ్యమయ్యే అవకాశం ఉంది.
2. మిని పోర్టబుల్ ఏయిర్ కూలర్, పర్సనల్ స్పేస్ కూలర్, ఏయిర్ కండిషనర్:
ఇది చూడ్డానికి చాలా స్టైలిష్ గా ఉంటుంది. దీనిని ఆన్ చేసినప్పుడు అస్సలు శబ్దం రాదు. కూల్, హ్యూమిడిఫికేషన్, ఫ్యూరిఫికేషన్ వంటి విభిన్న ఫంక్షన్లు అందుబాటులో ఉన్నాయి. దాని వాటర్ ట్యాంక్ నిండిన తరువాత 8 గంటల పాటు పనిచేస్తుంది. యూఎస్ బీ కేబుల్ ద్వారా ఎక్కడికైనా అమర్చుకోవచ్చు. చల్ల గాలిని ఆస్వాదించవచ్చు. దీని ధర రూ.1,135 నుంచి రూ.2,499 వరకు అందుబాటులో ఉంది.

3)Sasimo Go Arctic Air Protable 3 In 1 conditioner:
ఈ ఎయిర్ కండిషనర్ గాలిని పీల్చుకొని శుద్ధి చేస్తుంది. ఇది తక్కువ, మధ్యస్థ, హై లెవల్లో మూడు స్థాయిలో మార్చుకోవచ్చు. యూఎస్ బీ కేబుల్ సహాయంతో దీనిని ఫోర్టబుల్ గా ఉపయోగించుకోవచ్చు. టూరిస్టులకు వెళ్లినప్పుడు కూడా దీనిని తోడుగా తీసుకెళ్లవచ్చు. దీని ప్రారంభ ధర రూ.1,999 నుంచి ఉంది.
4) డెస్క్ టాప్ కూలర్:
ఇది ఆకర్షనీయంగా కనిపించే కూలర్. కాంపాక్ట్ డిజైన్ తో పాటు డ్యూయల్ బ్లోవర్ తో కూడిన బ్లేడ్ లెన్ మినీ కూలర్, ఇందులో ఐస్ ట్రే కూడా ఉంటుంది. బ్యాటరీతో కూడా దీనిని ఉపయోగించుకోవచ్చు. ఇది రూ.1000 లోపు ఆన్లైన్లో విక్రయిస్తున్నారు.