tulasi plant vasthu tips telugu
Vastu Tips: మన ఇంటి దగ్గర ఎన్ని మొక్కలను పెంచుకున్నా తులసి మొక్కలకు ఉండే ప్రాధాన్యత అంతాఇంతా కాదు. చాలామంది తులసి మొక్కకు కోట కట్టి ప్రతిరోజూ పూజ చేయడంతో పాటు తులసి కోట చుట్టూ ప్రదక్షిణ చేయడం జరుగుతుంది. తులసి మొక్క కష్టాలు, నష్టాలు, దరిద్రాలను అడ్డుకోవడంతో పాటు పాజిటివ్ ఎనర్జీ వచ్చేలా చేస్తుందని పురాణాలు చెబుతున్నాయి. తులసి వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా చేకూరుతాయి.
ఇంటి దగ్గర తులసి మొక్కను పెంచుకోవడం వల్ల ఆర్థికంగా కలిసొచ్చే అవకాశంతో పాటు మనస్సుకు ప్రశాంతత ఉంటుంది. తులసి మొక్క వల్ల కుటుంబంలో సుఖశాంతులు చేకూరే అవకాశాలు అయితే ఉంటాయి. తులసి మొక్క సర్వరోగ నివారిణిగా పని చేస్తుందనే విషయం తెలిసిందే. తులసి మొక్క అంటే సాక్షాత్తూ లక్ష్మీదేవి అని పండితులు చెబుతారు. జరగబోయే విపత్తులను తులసి మొక్క ముందుగానే కనిపెడుతుంది.
ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు, కష్టాలు, ఇతర సమస్యలు ఉన్నవాళ్లు తులసి మొక్కను పెంచుకోవడం ద్వారా ఆ సమస్యలకు సులభంగా చెక్ పెట్టడం సాధ్యమవుతుంది. హిందూ పురాణాల ప్రకారం పుట్టుక నుంచి చావు వరకు ఇంట్లో తులసి ఉండాలి. అయితే తులసి మొక్కలో ఏవైనా మార్పులు గమనిస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. తులసి మొక్క చనిపోతే ఆ మొక్కను ఇంట్లో ఉంచుకున్న వాళ్లకు దరిద్రం పడుతుంది.
ఆ తులసి మొక్కను నీటి ప్రవాహంలో లేదా పరిశుభ్రమైన బయటి వాతావరణంలో వదిలేస్తే మంచిది. ఆ తర్వాత తులసి కోటలో మరో తులసి మొక్కను ఉంచాలి. తులసి మొక్క ఎండిపోతే ఆ మొక్కపై బుధ గ్రహ ప్రభావం పడిందని అర్థం చేసుకోవాలి. కిచెన్ కు దగ్గరలో తులసి మొక్కను ఉంచితే ఇంట్లో తగాదాలు తొలగిపోతాయి. తులసి మొక్క ఆకుల రంగులు మారితే క్షుద్రశక్తుల ప్రయోగం జరుగుతోందని అర్థం. మొక్క ఆకులు అకస్మాత్తుగా ఎండిపోతే యజమానికి కీడు జరుగుతుంది. తులసి మొక్క ఏపుగా పెరుగుతుంటే అదృష్టం కలిసొస్తుందని అర్థం.